వ్యోమమిత్ర రోబో... దీనితో ఇస్రో ఏం చేస్తుంది?

మన పని మనం చేసుకుంటుంటే... ఇస్రో శాస్త్రవేత్తలు తమ పని వారు చేసుకుపోతున్నారు. ఐతే... ఆ పనులు అద్భుతాల్ని సృష్టిస్తున్నాయి. వాటిలో భాగమే ఈ వ్యోమ మిత్ర రోబో.

news18-telugu
Updated: January 23, 2020, 8:57 AM IST
వ్యోమమిత్ర రోబో... దీనితో ఇస్రో ఏం చేస్తుంది?
వ్యోమమిత్ర రోబో (credit - twitter - ANI)
  • Share this:
మిత్ర వింద లాగా... ఈ వ్యోమ మిత్ర ఏంటి అనుకుంటున్నారా... ఇది ఇస్రో తయారుచేసిన రోబోకి శాస్త్రవేత్తలు పెట్టుకున్న క్యూట్ నేమ్. విషయమేంటంటే... గగనయాన్ ప్రాజెక్టు ద్వారా... 2022లో రోదసీ లోకి మనుషుల్ని పంపేందుకు ఇస్రో రెడీ అవుతోంది కదా. అందులో భాగంగా... ఈ రోబోను పంపుతుందన్నమాట. ఇది మనుషుల్లా మాట్లాడే, ఆలోచించే, పనిచేసే రోబో. ఇది వ్యోమగాములతోనే ఉంటూ... వాళ్ల ఆరోగ్యాన్ని తెలుసుకుంటుంది. ఎవరికైనా ఆరోగ్యం తేడా వస్తే వెంటనే ఇస్రోకి రిపోర్ట్ పంపిస్తుంది. ఈ రోబోతో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే... ఇది చక్కగా మాట్లాడగలదు. మనం ప్రశ్నించగానే... ఆన్సర్ ఇవ్వగలదు. అందువల్ల ఎప్పటికప్పుడు దీనితో మాట్లాడుతూ... రోదసీ ప్రయాణం ఎలా సాగుతుందో శాస్త్రవేత్తలు తెలుసుకోగలరు.


ఇది ప్రయోగాత్మక పద్ధతిలో పంపించబోతున్న రోబో. అందువల్ల ఇది పనిచేసినా, చేయకపోయినా శాస్త్రవేత్తలకు వచ్చిన నష్టమేమీ లేదు. కాకపోతే... భవిష్యత్తులో రోబో టెక్నాలజీని అందరూ వాడుకోక తప్పది కాబట్టి... ఇస్రో కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇస్రో శాస్త్రవేత్త శ్యామ్ దయాళ్ ఈ రోబో విశేషాల్ని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. వ్యోమమిత్ర చాలా బాగుందని అంతా అంటున్నారు. అచ్చం అమ్మాయిలాగే ఉందని అంటున్నారు.
First published: January 23, 2020, 8:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading