news18-telugu
Updated: October 18, 2019, 9:49 AM IST
చంద్రుడి అవతలివైపు ఫొటోతీసిన చంద్రయాన్-2 (credit - twitter - ISRO)
ISRO Chandrayaan-2 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగ ఫలితాలు ఇప్పుడిప్పుడే మనకు అందుతున్నాయి. జనరల్‌గా చందమామ అవతలివైపును మనం చూడలేం కదా. కానీ చంద్రయాన్-2 ఆర్బిటర్... చూడగలిగింది. చందమామకు అవతలివైపు... ఉత్తర భాగంలో ఉన్న ఉపరితలాన్ని ఫొటోతీసింది. ఆ ఫొటో అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తోంది. దాన్ని ఇస్రో తన ట్విట్టర్ అకౌంట్లో రిలీజ్ చేసింది. చంద్రయాన్-2కి ఉన్న IIRS పేలోడ్ ద్వారా ఈ ఫొటో లభించింది. చందమామ ఉపరితలంపై ఎంత వరకూ సూర్యుడి ఎండ పడుతుందో లెక్కించడానికి తయారుచేసినదే IIRS. రకరకాల స్పెక్ట్రల్ ఛానెల్స్ ద్వారా ఈ ఫొటోని రూపొందించినట్లు ఇస్రో తెలిపింది.
IIRS అనేది... చందమామ పై భాగాన్ని (ఉపరితలాన్ని) రకరకాలుగా ఫొటోలు తీస్తుంది. తద్వారా దానిపై ఉన్న ఖనిజాలేంటి? అది ఎలా తయారైంది? అసలు చందమామ ఎలా పుట్టింది అనే అంశాలు తెలుసుకునే ఛాన్స్ ఉందని ఇస్రో చెప్పింది.
మీకు చందమామను ఇంచు ఇంచు ఫుల్ క్వాలిటీలో చూడాలని ఉందా? అక్కడి ప్రతీ రాయినీ కళ్లారా చూడాలనుకుంటున్నారా. చందమామపై ప్రతీ లోయలోనూ దిగి నడవాలని ఉందా? అలాంటి ఫీల్ కలగాలంటే... నాసా మూన్ మ్యాప్‌లోకి దూకేయాల్సిందే. అందుకు మీరు చేయాల్సిందల్లా ఈ లింక్ (https://bit.ly/2IYexcO) క్లిక్ చెయ్యడమే. ఇంకెందుకు ఆలస్యం... అలా వెళ్లి... సరదాగా తిరిగేయండి మరి.
Pics : ఈ బ్యూటీ అందాలు చూస్తే మీ హార్టుకి హోలే..!
ఇవి కూడా చదవండి :
Diabetes Tips : జామకాయలతో డయాబెటిస్‌కి చెక్... ఇలా చెయ్యండి
Health Tips : రోజా పూలతో చక్కటి ఆరోగ్యం... ఇలా చెయ్యండి
Health Tips : వేరుశనగ గింజలను ఇలా తింటే ఎక్కువ ప్రయోజనాలు
ఇంటికి ఎలాంటి కలర్స్ వేస్తే మంచిది... కలర్స్ ప్రభావం మనపై ఎలా ఉంటుంది?
ఇంట్లో నెమలి పించం ఉందా... మీకు కలిగే ప్రయోజనాలు ఏవంటే...
Published by:
Krishna Kumar N
First published:
October 18, 2019, 9:48 AM IST