SpaceX 143 Satellites: జనవరి 8న ఎలన్‌మస్క్‌కి చెందిన టెస్లా కంపెనీ ఇండియాలో ప్రవేశించింది. జస్ట్ రెండు వారాల్లో ఎలన్‌మస్క్‌కి చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ చరిత్ర తిరగరాసింది. ఆదివారం రాత్రి ప్రపంచరికార్డ్ బ్రేక్ చేసి... కొత్త రికార్డు తన పేరున రాసేసుకుంది. ఒకేసారి 143 ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఫలితంగా 2017 ఫిబ్రవరిలో 104 శాటిలైట్లను ఒకేసారి ప్రవేశపెట్టిన భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ - ఇస్రో (ISRO) పేరున ఉన్న రికార్డు బద్ధలైంది. స్పేస్ఎక్స్ దగ్గర ఫాల్కన్ 9 రాకెట్లు ఉన్నాయి. అవి ఒక్కోటి పెద్ద సైజు అపార్ట్మెంటులా ఉంటాయి. అలాంటి రాకెట్లో ఈ శాటిలైట్లను ఉంచి... రోదసీలోకి పంపారు. ఈ ప్రాజెక్టు పేరు ట్రాన్స్పోర్టర్-1. అమెరికా... ఫ్లోరిడా రాష్ట్రంలోని కేప్ కెనవరాల్ నుంచి భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8.31కి రాకెట్ దూసుకెళ్లింది. ఈ రాకెట్ ఇండియాపై నుంచి వెళ్తున్నప్పుడు మన ఇస్రోకి చెందిన బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ సిగ్నల్ అందుకుంది.
అసలు ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏంటంటే... చిన్న చిన్న శాటిలైట్లు తయారుచేసుకొని వాటిని ప్రయోగించే సామర్థ్యం లేని దేశాలు... తమ ద్వారా ప్రయోగించుకోవచ్చని స్పేస్ఎక్స్ ముందుకొచ్చింది. ప్రస్తుతం ఇలాంటి పనిని ఇస్రో చేస్తోంది. ఇప్పుడు ఇస్రోకి పోటీగా స్పేస్ఎక్స్ వచ్చింది. ఇన్నాళ్లూ రోదసీ ప్రాజెక్టుల్లో ముందున్న అమెరికా స్పేస్ రీసెర్ట్ సెంటర్ - నాసా (NASA)... ఈ స్పేస్ఎక్స్తో పోటీ పడలేకపోతోంది. అందుకే ఎలన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా మారాడు.
Falcon 9 launches 143 spacecraft to orbit — the most ever deployed on a single mission — completing SpaceX’s first dedicated SmallSat Rideshare Program mission pic.twitter.com/CJSUvKWeb4
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... 143 శాటిలైట్లు కక్ష్యలో చేరడానికి పట్టిన సమయం జస్ట్ నిమిషం లోపే. ఆ నిమిషంలో ప్రతి సెకండూ ఈ ప్రాజెక్టు చేపట్టిన సైంటిస్టులకు హార్ట్ మామూలుగా కొట్టుకోదు. లక్కీగా అన్ని శాటిలైట్లూ... నీటిలో వదిలిన చేప పిల్లల్లా... అంతరిక్షంలో అలా అలా ఎగురుతూ... కక్ష్యలో తిరుగుతున్నాయి. దాంతో ఈ ప్రాజెక్టు గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
Falcon 9’s first stage has landed on the Of Course I Still Love You droneship pic.twitter.com/6gWWlLiXdG
ఈ శాటిలైట్స్ ద్వారా... 2021 ముగిసేనాటికి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ ఇంటర్నెట్ సదుపాయం అందనుంది. సరిగ్గా 143 శాటిలైట్లే ప్రయోగించడానికి కారణం పైన మనం అనుకున్నదే. ఐలవ్యూ అర్థం వచ్చేలా ఉంటుందనే ఉద్దేశంతోనే అన్ని ప్రయోగించారు. మరి స్పేస్ఎక్స్... కేజీ బరువున్న శాటిలైట్‌ను అంతరిక్షంలో వదిలేందుకు ఎంత తీసుకుందో తెలుసా. రూ.10,94,625. ఇది చాలా తక్కువ ధరే అంటున్నారు. సో... ఇప్పుడు స్పేస్ఎక్స్ మన ఇస్రోకి పోటీ ఇచ్చింది. దీన్నుంచి ఇస్రో ఎలా ముందుకు వెళ్తుందన్నది మరో చరిత్ర.