హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Satellite Internet Service: ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ లాంచ్.. ప్రైవేట్ ఏజెన్సీతో కలిసి ప్రారంభించిన ఇస్రో

Satellite Internet Service: ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ లాంచ్.. ప్రైవేట్ ఏజెన్సీతో కలిసి ప్రారంభించిన ఇస్రో

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO).. ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ను పరిచయం చేసింది. హ్యూస్ కమ్యూనికేషన్స్ ఇండియా అనే ప్రైవేట్ నెట్‌వర్క్‌ కంపెనీతో కలిసి ఈ సేవలను లాంచ్ చేసింది. దేశంలో తొలి కమర్షియల్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ ఇదే కావడం విశేషం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO).. ఇండియాలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌(Satellite Internet Service)ను పరిచయం చేసింది. హ్యూస్ కమ్యూనికేషన్స్ ఇండియా (Hughes Communications India) అనే ప్రైవేట్ నెట్‌వర్క్‌ కంపెనీతో కలిసి ఈ సేవలను లాంచ్ చేసింది. దేశంలో తొలి కమర్షియల్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్‌ ఇదే కావడం విశేషం. టెరెస్ట్రియల్ నెట్‌వర్క్స్ అందించలేని అత్యంత మారుమూల ప్రాంతాల్లోనూ ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ దేశమంతటా ప్రతి మారుమూల ప్రాంతంలో హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందిస్తూ ఎంటర్‌ప్రైజ్, ప్రభుత్వ నెట్‌వర్క్‌లను కనెక్ట్ చేస్తుందని హ్యూస్ సంస్థ పేర్కొంది.

ఈ సర్వీస్‌ను ఇండియాలో పరిచయం చేసేందుకు శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ అయిన హ్యూస్ కమ్యూనికేషన్స్ ఇస్రోతో పార్ట్‌నర్‌షిప్ కుదుర్చుకుంది. హై-త్రూపుట్ శాటిలైట్ (High-throughput Satellite)గా పిలిచే ఈ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌ లాంచ్‌ చేస్తున్నట్లు ఇస్రో, హ్యూస్ సంయుక్త ప్రకటన చేశాయి. ప్రస్తుతం హ్యూస్ కమ్యూనికేషన్స్ ఇండియా 2 లక్షల కంటే ఎక్కువ బిజినెస్, గవర్నమెంట్ సైట్స్‌కు శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందిస్తుంది. ఆ విధంగా ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు స్ట్రాటజిక్ సెంటర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు సపోర్ట్ చేస్తోంది. హ్యూస్ జూపిటర్ సిస్టమ్‌లో 75 కంటే ఎక్కువ శాటిలైట్స్‌ ప్రస్తుతం ఉపయోగంలో ఉండగా ఈ సంఖ్య శాటిలైట్ ఇంటర్నెట్ అమలకు ఒక స్టాండర్డ్ అని చెప్పవచ్చు.

ఈ సర్వీస్ లాంచ్‌ సందర్భంగా అంతరిక్ష శాఖ కార్యదర్శి, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. ఇస్రోలో పనిచేస్తున్న తామంతా ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో, డిజిటల్ సర్వీసుల కొరతను తగ్గించడంలో హెల్ప్ చేసేందుకు ప్రైవేట్ రంగంతో కలిసి పని చేసే మార్గాలను అన్వేషిస్తున్నామని పేర్కొన్నారు. ఇస్రో శాటిలైట్స్ ద్వారా ఆధారితమైన కొత్త హెచ్‌టీఎస్ సామర్థ్యాలతో హ్యూస్ కంపెనీ అద్భుతమైన క్వాలిటీతో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను అందిస్తున్న నమ్మకం తమకుందన్నారు. ఈ సర్వీసులు భారతదేశ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ వేగవంతం చేసే కనెక్టివిటీ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత ఇంప్రూవ్ చేస్తాయని విశ్వసిస్తున్నట్లు సోమనాథ్ తెలిపారు.

మల్టీ-మెగాబిట్ హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను అందుబాటు ధరలో అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని HCI ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ పార్థో బెనర్జీ అన్నారు. ఈ కొత్త బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ హై-బ్యాండ్‌విడ్త్ అవసరమయ్యే ప్రభుత్వ, ఆర్థిక సంస్థలు, సెల్యులార్ ఆపరేటర్లు, మైనింగ్, ఎనర్జీ కంపెనీలకు బాగా ఉపయోగపడుతుందన్నారు.

Success Story: ఒకప్పుడు గాజులమ్మాడు, ఇప్పుడు IASఆఫీసర్‌ అయ్యాడు .. మహారాష్ట్ర యువకుడి సక్సెస్ స్టోరీ

Viral Video : అట్లుంటది ప్రభుత్వం పని..రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన వెంటనే కుప్పకూలిన బ్రిడ్జ్

HTS బ్రాడ్‌బ్యాండ్ కమ్యూనిటీ ఇంటర్నెట్ యాక్సెస్ కోసం Wi-Fi హాట్‌స్పాట్‌ల వంటి అప్లికేషన్లకు సపోర్ట్ చేస్తుంది. మేనేజ్డ్ SD-WAN సొల్యూషన్స్, మొబైల్ నెట్‌వర్క్ పరిధిని విస్తరించడానికి బ్యాక్‌హాల్; స్మాల్ బిజినెస్‌ల కోసం శాటిలైట్ ఇంటర్నెట్ కూడా ఇది ఆఫర్ చేస్తుంది. HTS బ్రాడ్‌బ్యాండ్ సేవ ఇస్రోకి చెందిన GSAT-11, GSAT-29 శాటిలైట్స్ నుంచి Ku-బ్యాండ్ సామర్థ్యాన్ని కలుపుకొని హ్యూస్ జూపిటర్ ప్లాట్‌ఫామ్ గ్రౌండ్ టెక్నాలజీతో భారతదేశం అంతటా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందిస్తుంది. ల్యాండ్-బేస్డ్ నెట్‌వర్క్‌లకు చేరుకోలేని అత్యంత మారుమూల ప్రాంతాలకు కూడా తన సేవలను అందిస్తుంది.

Published by:Kishore Akkaladevi
First published:

Tags: ISRO

ఉత్తమ కథలు