Chandrayaan 2 | విక్రమ్ లాండర్ దొరికిందోచ్... కనిపెట్టిన ఇస్రో

చందమామ మీద లాండింగ్ చేస్తున్న సమయంలో విక్రమ్ లాండర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఆ సంబంధాలు తెగిపోయినట్టు ఇస్రో ప్రకటించింది.

news18-telugu
Updated: September 8, 2019, 2:22 PM IST
Chandrayaan 2 | విక్రమ్ లాండర్ దొరికిందోచ్... కనిపెట్టిన ఇస్రో
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 8, 2019, 2:22 PM IST
చంద్రయాన్ 2 ప్రయోగంలో కనిపించకుండాపోయిన విక్రమ్ లాండర్ ఆచూకీ దొరికింది. సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 1.40 గంటల సమయంలో చందమామ మీద లాండింగ్ చేస్తున్న సమయంలో విక్రమ్ లాండర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఆ సంబంధాలు తెగిపోయినట్టు ఇస్రో ప్రకటించింది. అప్పటి నుంచి అది ఎక్కడ ఉందో ఆచూకీ తెలియలేదు. అయితే, చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్.. విక్రమ్ లాండర్‌ను గుర్తించింది. చంద్రుడి ఉపరితలంపై థర్మల్ ఇమేజ్‌ను కనుగొన్నట్టు ఇస్రో చీఫ్ కె.శివన్ ప్రకటించారు. అయితే, విక్రమ్ లాండర్‌తో సంబంధాలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. విక్రమ్ లాండర్‌తో మళ్లీ లింక్ కావడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే దీన్ని సాధిస్తామని కె.శివన్ ప్రకటించారు.





చంద్రయాన్ 2 ప్రయోగంలో భాగంగా విక్రమ్ లాండర్‌ను చంద్రుడి మీద దించడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్న సమయంలో లాండర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. ఇప్పుడు మళ్లీ సంబంధాలను పునరుద్ధరించిన తర్వాత మరోసారి చంద్రుడి మీద దించే అవకాశం ఉంది. ఒకసారి విక్రమ్ లాండ్ర చంద్రుడి మీద దిగిన తర్వాత దానిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. చంద్రుడి మీద అటూ ఇటూ తిరిగి అక్కడి మూలకాలను సేకరిస్తుంది.
First published: September 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...