Mission Moon : ఇటు ఇస్రో... అటు నాసా... చందమామపై మానవ యాత్రకు ప్లాన్ ఇదీ...

ISRO Chandrayaan 2 : ఒకే సమయంలో రెండు పెద్ద అంతరిక్ష పరిశోధనా సంస్థలు చందమామపై పరిశోధనలకు ప్లాన్ సిద్ధం చేసుకోవడం మన అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే... 2024లో ఏం జరగబోతోందో తెలుసుకోండి మరి.

Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 6:19 AM IST
Mission Moon : ఇటు ఇస్రో... అటు నాసా... చందమామపై మానవ యాత్రకు ప్లాన్ ఇదీ...
నాసా మూన్ ప్లాన్ (Image : Youtube /NASA)
Krishna Kumar N | news18-telugu
Updated: July 12, 2019, 6:19 AM IST
ISRO Chandrayaan 2 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో... జులై 15న చందమామ చెంతకు చంద్రయాన్ 2 ఉపగ్రహ ప్రయోగం చేయబోతోందని మనకు తెలుసు. ఇందుకు సంబంధించిన ట్రయల్ కూడా 100 శాతం కచ్చితత్వంతో పూర్తైందని ఇస్రో ప్రకటించింది. ఇదే సమయంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా కూడా చందమామపై లోతైన పరిశోధనలకు ప్లాన్ సిద్ధం చేసింది. ఇందుకోసం తన అధికారిక వెబ్‌సైట్‌లో సరికొత్తగా ఎక్స్‌ప్లోర్ మూన్ టు మార్స్ (Explore Moon to Mars) ప్రాజెక్టును ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చింది. దీని ఉద్దేశం ఒకటే. ముందుగా మనుషులు... చందమామపైకి వెళ్లి... కాలనీలు నిర్మించి... తర్వాత మార్స్ గ్రహంపైకి వెళ్లడమే.

నాసా మూన్ ప్లాన్ (Image : Youtube /NASA)


చందమామపై చివరిసారిగా వ్యోమగాములు కాలుపెట్టి... 45 ఏళ్లు దాటాయి. అప్పటి నుంచీ ఇప్పటివరకూ మళ్లీ మూన్ జోలికి వెళ్లలేదు. ఇప్పుడు ఇస్రో సహా చాలా అంతరిక్ష పరిశోధనా సంస్థలు చంద్రుడి రహస్యాల్ని తెలుసుకునేందుకు సిద్ధమవుతుంటే... నాసా కూడా... నేను సైతం అంటూ... మళ్లీ రంగంలోకి దిగింది. లక్కీగా అమెరికా ట్రంప్ ప్రభుత్వం నాసాకు భారీగా నిధులు ఇస్తోంది.
నాసా తన ప్లాన్ ప్రకారం 2024లో చందమామపైకి వ్యోమగాముల్ని పంపబోతోంది. ఆసక్తికరమైన విషయమేంటంటే... చందమామ దక్షిణ ధృవంపై వాళ్లు కాలు పెట్టబోతున్నారు. సరిగ్గా అదే దక్షిణ ధ్రువంపై ఇస్రో కూడా ఇప్పుడు పరిశోధన చేయబోతోంది. చంద్రయాన్ 2 ప్రయోగంతో పంపే... రోవర్... చందమామ దక్షిణ ధ్రువంపై దిగబోతోంది.

నాసా మూన్ ప్లాన్ (Image : Youtube /NASA)


జీఎస్ఎల్వీ మార్క్-3 వాహకనౌక ద్వారా చంద్రయాన్-2 ప్రయోగం చేయబోతోంది ఇస్రో. ఇందులో ముఖ్యంగా మూడు పరికరాలు... ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లు ఉండబోతున్నాయి. చంద్రయాన్-2 వ్యవస్థ మొత్తం బరువు 3,447 కేజీలు కాగా, వీటిలో ఒక్క ప్రొపెల్లర్ బరువే ఏకంగా 1,179 కేజీలు ఉంటుంది. ఓసారి ఉపగ్రహాన్ని ప్రయోగించాక, ఇది స్వతంత్రంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతుంది. 2019 సెప్టెంబర్ 6 లేదా 7 తేదీల్లో ల్యాండర్ చంద్రుడిపై దిగుతుంది. చంద్రయాన్‌-2 ప్రాజెక్టు ఖ‌రీదు రూ.603 కోట్లు.
Loading...
చంద్రుడిపైకి వ్యోమగాముల్ని పంపేందుకు నాసా ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ని పంపబోతోంది. చందమామపై చిన్న కాలనీ నిర్మించాక... 2030లో భూమికి అతి దగ్గరగా ఉన్న మార్స్ గ్రహంపైకి వ్యోమగాముల్ని పంపబోతోంది నాసా. ఇందుకోసం ఇప్పటికే స్పేస్‌షిప్‌ల తయారీ మొదలుపెట్టినట్లు సమాచారం.

మూన్ పరిశోధన ఎలా జరుగుతుందో, ఎప్పటికప్పుడు ప్రపంచ ప్రజలకు చెబుతూ ఉంటామన్న నాసా... టచ్‌లో ఉండాలని కోరుతోంది. ఒక రకంగా ఇది మనకూ మంచిదే. మనం చందమామపై పరిశోధిస్తున్నప్పుడు... నాసా లాంటి సంస్థలు కూడా తోడైతే... మరింత లోతుగా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.
First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...