ISRO Chandrayaan-2 Live | ఇదో చరిత్రాత్మక దినోత్సవం : ఇస్రో చైర్మన్ శివన్

Live ISRO Chandrayaan-2 | చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతమైంది.

news18-telugu
Updated: July 22, 2019, 3:28 PM IST
ISRO Chandrayaan-2 Live | ఇదో చరిత్రాత్మక దినోత్సవం : ఇస్రో చైర్మన్ శివన్
ఇస్రో చైర్మన్ కె.శివన్ (Image:ANI)
  • Share this:
చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న షార్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి జీఎస్‌ఎల్వీ మార్క్ 2 ఎం1 వాహకనౌక ద్వారా చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు ఇస్రో చైర్మన్ శివన్. ‘భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో నేడు చరిత్రాత్మక దినోత్సవం. చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని మార్క్ 3 ఉపగ్రహం విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. చంద్రుడి మీద పరిశోధనలు చేయడానిరి గతంలో చేసిన పరిశోధనలు చేసిన వాటిని విశ్లేషించడానికి, పరిశోధించనివాటిని కనుగొనడానికి చంద్రయాన్ 2 ద్వారా వీలు కలుగుతుంది.’ అని శివన్ అన్నారు. చంద్రయాన్ 2 ప్రయోగం సందర్భంగా సాంకేతిక సమస్య వచ్చినప్పుడు తమ టీమ్ ఎంతో కష్టపడి, తెలివిగా దాన్ని అధిగమించిందన్నారు. ఈ చంద్రయాన్ 2 కోసం గత ఏడాదిన్నర పాటు ఎంతో శ్రమించిన బృందానికి అభినందనలు తెలిపారు. మరీ ముఖ్యంగా గత వారం రోజుల్లో కుటుంబాలను కూడా వదిలి చంద్రయాన్ కోసం కష్టపడ్డారని శివన్ అన్నారు.

చంద్రయాన్ 2ను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతోనే తమ పని ముగిసిపోలేదని శివన్ అన్నారు. వచ్చే నెలన్నర పాటు చంద్రయాన్ 2 మిషన్ టీమ్ మరింత కష్టపడాల్సి ఉంటుందని చెప్పారు. అయితే, ఉపగ్రహాన్ని చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయడమే తమ ముందున్న సవాల్ అని శివన్ అన్నారు. ఆ 15 నిమిషాలు తమకు టెర్రర్ అని చెప్పారు. చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం కోసం భారతదేశం ఒక్కటే కాదని, ప్రపంచం మొత్తం ఎదురు చూసిందని, దాన్ని తాము సాధించామని సగర్వంగా ప్రకటించారు. సక్సెస్ అనేది స్వీట్ ఇస్తుందని, ఇది డబుల్ స్వీట్ అని శివన్ ఆనందం వ్యక్తం చేశారు. టెక్నాలజీలో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేందుకు ఇస్రో కృషి చేస్తుందని శివన్ ప్రకటించారు. త్వరలో ఇస్రో మరిన్ని ప్రాజెక్టులు చేపడుతోందని, దాని గురించి చర్చ కూడా ప్రారంభించామని చెప్పారు.



First published: July 22, 2019, 3:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading