Chandrayaan-2 :చంద్రయాన్-2 ప్రయోగం... ఎన్నో ప్రత్యేకతలు... అవేంటో తెలుసుకుందామా...

ISRO Chandrayaan 2 : ఇప్పటివరకు చందమామపైకి అమెరికా, రష్యా, చైనా మాత్రమే రోవర్లను పంపించాయి. ఆ తర్వాత భారత్ కూడా తన తొలి రోవర్‌ను చంద్రుడిపైకి పంపుతోంది. ఐతే... చందమామ దక్షిణ ధ్రువానికి రోవర్‌ను పంపుతున్న తొలి దేశం మాత్రం భారతే.

Krishna Kumar N | news18-telugu
Updated: July 15, 2019, 1:19 AM IST
Chandrayaan-2 :చంద్రయాన్-2 ప్రయోగం... ఎన్నో ప్రత్యేకతలు... అవేంటో తెలుసుకుందామా...
చంద్రయాన్-2 ప్రయోగ ఊహా చిత్రం (Image : Twitter / ISRO)
Krishna Kumar N | news18-telugu
Updated: July 15, 2019, 1:19 AM IST
130 కోట్ల మంది ప్రజలు ఆసక్తిగా చూస్తున్న ఘట్టం నేడు (15న) తెల్లవారుజామున 2.51 నిమిషాలకు చంద్రుడి చుట్టూ తిరుగుతూ రహస్యాల్ని కనిపెట్టే... చంద్రయాన్-2 ఉపగ్రహం, చందమామపై దిగే విక్రమ్ ల్యాండర్, ల్యాండర్ లోంచీ బయటకు వచ్చి... చందమామపై తిరిగే ప్రజ్ఞాన్ రోవర్... లను మోసుకుంటూ... GSLV మార్క్-3 రాకెట్... నిప్పులు చిమ్ముతూ... చందమామ వైపు దూసుకెళ్లబోతోంది. ఇందుకోసం నెల్లూరు జిల్లా శ్రీహరికోట ప్రయోగ కేంద్రంలో పూర్తి ఏర్పాట్లు జరిగాయి. రెండో ప్రయోగ వేదిక దగ్గర దూసుకెళ్లేందుకు రాకెట్ రెడీగా ఉంది. రెండుసార్లు రిహార్సల్స్ చేసి... అంతా పర్ఫెక్టుగా ఉండటంతో... ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాన పడినా ఇబ్బంది లేకుండా... మార్క్ 3 రాకెట్‌ను రెయిన్ ప్రొటెక్షన్‌తో తయారుచేయడం విశేషం.

chandrayaan-2,chandrayaan 2,chandrayaan-2 mission,chandrayaan,chandrayaan-2 launch,chandrayaan 2 launch video,isro chandrayaan 2,chandrayaan-2 launch date,chandrayaan 2 launch date,chandrayaan 2 mission,chandrayaan 2 rover,chandrayaan 2 launch,chandrayan- 2,chandrayaan 2 isro,chandrayan 2,isro,chandrayaan2,chandrayaan 2 in hindi,chandrayan 1,mission chandrayaan-2,launch of chandrayan 2,chandrayaan-2 satellite,india,ఇస్రో,చంద్రయాన్ 2,చంద్రయాన్-2,ఇస్రో ఛైర్మన్,ప్రత్యేకతలు,విశేషాలు,
చంద్రయాన్-2 ప్రయోగ ఊహా చిత్రం (Image : Twitter / ISRO)


ఇవీ ప్రాజెక్టు ప్రత్యేకతలు :

- ఈ రాకెట్ ప్రయోగంలో మూడు దశలు ఉన్నాయి. రాకెట్ ప్రయోగించిన 16 నిమిషాల 13 సెకండ్లకు... భూమి నుంచీ 181.6 కిలోమీటర్ల ఎత్తులో... చంద్రయాన్-2 ఉపగ్రహం, విక్రమ్ ల్యాండర్‌ ఉన్న పేలోడ్ రాకెట్ నుంచీ బయటకు వస్తుంది. అక్కడితో రాకెట్ పని పూర్తయినట్లు లెక్క.


- ఈ పేలోడ్ భూ నియంత్రిత కక్ష్యా మార్గంలోకి చేరుతుంది. ఆ తర్వాత అది 17 రోజుల పాటూ రోదసిలో తిరుగుతూ... చందమామ దగ్గర్లోకి వెళ్తుంది. ఆ తర్వాత మరో 6 రోజులు అలాగే తిప్పుతారు. ఆ తర్వాత చంద్రయాన్-2ని పేలోడ్ నుంచీ బయటకు తెస్తారు. అది 28 రోజులపాటూ చందమామ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా అది చందమామ కక్ష్యా మార్గంలోకి చేరుతుంది.
- చంద్రయాన్-2 ప్రయోగం జరిగిన 50 రోజుల తర్వాత పేలోడ్ నుంచీ విక్రమ్ ల్యాండర్ బయటకు వస్తుంది. ఇది 54వ రోజున అంటే సెప్టెంబర్ 6 లేదా 7న చందమామ దక్షిణ ధ్రువంపై దిగుతుంది.


- ల్యాండర్ సేఫ్‌గా దిగిన తర్వాత... అందులోంచీ... ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. అది చందమామపై 500 మీటర్ల ఏరియాలో తిరుగుతుంది.
- ప్రజ్ఞాన్ రోవర్... చందమామపై మట్టి, రసాయనాలు, నీటి జాడలు, మూలకాలు, ఖనిజాలు వంటి విషయాల్ని ఇస్రోకి చేరవేస్తుంది.
- ప్రధానంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీరు గడ్డకట్టి ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే ల్యాండర్‌ను అక్కడ ల్యాండ్ చేస్తున్నారు.


- చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ తిరుగుతూ... చందమామను హెచ్‌డీ ఫొటోలు తీస్తూ... ఇస్రోకు పంపుతుంది.
- చంద్రయాన్-2 ప్రయోగాన్ని మనం లైవ్‌లో చూడొచ్చు. అలాగే ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో కూడా చూడొచ్చు.
- ప్రజ్ఞాన్ అంటే తెలివి అని అర్థం. చంద్రయాన్-2లో చంద్రుడి చుట్టూ తిరిగే ఆర్బిటర్ కంటే... చందమామపై తిరిగే రోవర్‌ దే కీలక పాత్ర అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకూ ఇలా చందమామపై రోవర్లను దించిన దేశాలు అమెరికా, రష్యా, చైనా మాత్రమే.
- 27 కేజీల ప్రజ్ఞాన్ రోవర్... నీటికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇస్తుందా అని శాస్త్రవేత్తలు ఆసక్తిగా చూస్తున్నారు. చందమామపై కావాల్సినంత నీరు ఉంటే... ఇక మనుషులు అక్కడకు వెళ్లి, కాలనీలు ఏర్పాటు చేసుకునేందుకు వీలవుతుంది.
- ఐదేళ్లుగా చేస్తున్న ఈ మొత్తం ప్రాజెక్టుకు అయిన ఖర్చు రూ.978 కోట్లు. ఆ మధ్య వచ్చిన హాలీవుడ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకు అయిన ఖర్చు 356 మిలియన్ డాలర్లు. చంద్రయాన్-2 ప్రాజెక్టుకు అయిన ఖర్చు డాలర్లలో చెప్పాలంటే... అంతా కలిపి 142 మిలియన్ డాలర్లే. ఇంత తక్కువ ఖర్చుతో అంత ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తున్న ఇస్రోపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
- ఇస్రో ప్రయోగాన్ని మన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రత్యక్షంగా చూడబోతున్నారు. ఆదివారం సాయంత్రం 4.25 గంటలకు రాష్ట్రపతి ఫ్యామిలీ... హెలికాప్టర్ ద్వారా షార్‌కి చేరుతుంది. అక్కడ గెస్ట్‌హౌస్‌లో రెస్ట్ తీసుకొని... అర్థరాత్రి 2.20కి రాష్ట్రపతి... ప్రయోగం జరిగే మిషన్ కంట్రోల్ సెంటర్‌కి వెళ్తారు. అక్కడి గ్యాలరీ నుంచీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయోగాన్ని చూస్తారు.
- ఇప్పటివరకూ చంద్రుడి దక్షిణ ధ్రువాన్నీ ఏ దేశమూ టచ్ చెయ్యలేదు. అంతరిక్ష ప్రయోగాల్లో తామే కింగ్ అని చెప్పుకునే నాసా సైతం... అక్కడ అడుగు పెట్టలేదు. ఇప్పుడు మాత్రం ఇస్రో ప్రయోగం జరుగుతుంటే... తాము కూడా 2024లో చందమామపై వ్యోమగాముల్ని పంపుతున్నామని చెబుతోంది. ఇన్నాళ్లూ లేని ఆసక్తి నాసాకు ఇప్పుడెందుకు వచ్చిందంటే... కారణం ఇస్రో చందమామపై చేస్తున్న ప్రయోగాలే.
- ఏది ఏమైనా చరిత్రలో నిలిచిపోయే ప్రయోగం ఇది. ఎప్పుడో 50 ఏళ్ల కిందట... ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్... భారత అంతరిక్ష ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఎడ్లబండ్లు, సైకిళ్లపై రాకెట్లను తీసుకెళ్లేవాళ్లు. అలా మొదలైన ఇస్రో ప్రస్థానం... ఇప్పుడు ప్రపంచమే ఆశ్చర్యపోయే స్థాయికి చేరడం ప్రతీ భారతీయుడూ గర్వించదగ్గ పరిణామం.
First published: July 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...