Chandrayaan-2 : ఇస్రో మరో ముందడుగు... ఆర్బిటర్ నుంచీ విడిపోయిన ల్యాండర్

ISRO Chandrayaan-2 : ఇస్రో చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతంగా సాగుతోంది. సెప్టెంబర్-1న చంద్రయాన్-2... ఐదో కక్ష్యా మార్గంలోకి చేరింది. ఇవాళ మధ్యాహ్నం కీలక ఘట్టం ఉంది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 2, 2019, 1:48 PM IST
Chandrayaan-2 : ఇస్రో మరో ముందడుగు... ఆర్బిటర్ నుంచీ విడిపోయిన ల్యాండర్
ఇస్రో చిత్రం (Image : ISRO)
Krishna Kumar N | news18-telugu
Updated: September 2, 2019, 1:48 PM IST
చంద్రయాన్-2 ప్రయోగంలో మరో ముందడుగు పడింది. ఇస్రో చంద్రయాన్-2 ఆర్బిటర్ కక్ష్యా మార్గం తగ్గించడంతో... ఇప్పుడు ఆర్బిటర్... చందమామకి మరింత దగ్గరైంది. మధ్యాహ్నం  12:45 నుంచి 1:45 మధ్య... చంద్రయాన్‌-2 మాడ్యూల్‌లోని ఆర్బిటర్‌ నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ను వేరుచేశారు. మధ్యాహ్నం 1.15కి చంద్రయాన్-2 ఆర్బిటర్ నుంచీ విక్రమ్ ల్యాండర్ విడిపోయింది. ఇది ఆర్బిటర్ నుంచీ విడిపోయినా... కక్ష్యా మార్గంలోనే తిరుగుతుంది. ఇది ఐదు రోజుల తర్వాత... సెప్టెంబర్ 2న... చందమామ దక్షిణ ధ్రువంపై మెల్లగా దిగుతుంది. అది దిగిన తర్వాత... ల్యాండర్ డోర్ తెరచుకుంటుంది. అందులోంచీ... రోవర్ బయటకు వస్తుంది. ఆ రోవర్... చందమామపై తిరుగుతూ... ఫొటోలు, సమాచారాన్ని ఇస్రోకి పంపుతుంది.

Loading...
చందమామను అన్వేషించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ - (ఇస్రో) చేపట్టిన... చంద్రయాన్-2 ప్రయోగం చివరి దశకు చేరింది. ఇప్పటికే... భూ కక్ష్యా మార్గం నుంచీ... చందమామ కక్ష్యా మార్గంలోకి విజయవంతంగా ప్రయాణించిన... చంద్రయాన్-2కి తాజాగా... సెప్టెంబర్-1న ఇస్రో సైంటిస్టులు... ఐదోసారి కక్ష్యా మార్గ దూరాన్ని తగ్గించారు. ఆదివారం సాయంత్రం 6:21 గంటలకు చంద్రయాన్-2 మాడ్యూల్‌ (ఉపగ్రహం, ల్యాండర్, రోవర్ ఉన్న వ్యవస్థ)ని 52 సెకన్లలో చంద్రునికి 119 కిలోమీటర్ల దగ్గరగా... 127 కిలోమీటర్ల దూరంగా ఉండే కక్ష్యలోకి చేర్చారు. ఈ ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్లు ఇస్రో... ట్విట్టర్ అకౌంట్‌లో తెలిపింది.

చంద్రయాన్ 2 పూర్తి వివరాలు ఇవీ : చంద్రయాన్ 2 అనేది... చందమామ దక్షిణ ధ్రువాన్ని పరిశోధించబోతున్న తొలి మిషన్. ఇందులో ఆర్బిటర్, విక్రం అని పిలిచే ల్యాండర్, ప్రజ్ఞాన్ అనే రోవర్ ఉంటాయి. ఇస్రోని స్థాపించిన విక్రమ్ సారాభాయ్ పేరు మీద ల్యాండర్‌కు విక్రమ్ అని పేరు పెట్టారు. ప్రజ్ఞాన్ అంటే తెలివితేటలు, నాలెడ్జ్ అని అర్థం. చంద్రయాన్ 2 బరువు 3,877 కేజీలు. చంద్రయాన్ 1 కంటే ఇది నాలుగు రెట్లు బరువు ఎక్కువ. చంద్రయాన్ 1 సాంకేతిక లోపంతో చంద్రమామపై కూలిపోయింది. చంద్రయాన్ 2 అనేది రాకెట్ టెక్నాలజీ ద్వారా... ల్యాండర్‌ను చందమామపై దించబోతోంది. ఇందుకోసం సరైన ప్రదేశాన్ని ఎంచుకుంటారు. రెండు పగులు లోయల (మాంజినస్-సి, సింపెలియస్ ఎన్) మధ్య ఉండే ఎత్తైన మైదానంలో... ల్యాండర్ దిగుతుంది. సెప్టెంబర్ 7న ఇది జరుగుతుంది. ఈ ప్రాజెక్టుకు అయిన ఖర్చు రూ.978 కోట్లు. ల్యాండర్, రోవర్ కలిపి... 14 రోజులు పనిచేస్తాయి. చంద్రుడి చుట్టూ తిరిగే ఆర్బిటర్ మాత్రం ఏడాది పనిచేస్తుంది.

చందమామ తన చుట్టూ తాను తిరిగేందుకు సుమారుగా 29.5 రోజులు పడుతుంది. భూమి చుట్టూ తిరిగేందుకు కూడా అంతే సమయం పడుతోంది. అందుకే మనం చందమామకు ఒకవైపు భాగాన్ని మాత్రమే చూడగలుగుతున్నాం. ఈ కాలంలో సగం సమయం చందమామపై అంతటా సూర్యుడి కిరణాలు పడతాయి. అంటే దాదాపు 14 రోజుల కంటే కాస్త ఎక్కువ. సెప్టెంబర్ 6న చందమామపై రోవర్ దిగేటప్పుడు... సూర్యకాంతి చందమామపై పడుతుంది. అదే సమయంలో... చందమామ... భూమికి కనిపిస్తుంది. ఇలా 14 రోజులపాటూ సూర్యకాంతి పడుతుంది. అదే సమయంలో ల్యాండర్, రోవర్ 14 రోజులు పనిచేస్తాయి. అవి రెండు సోలార్ పవర్‌తో పనిచేస్తాయి కాబట్టి... సోలార్ పవర్ అయిపోగానే అవి పనిచేయడం మానేస్తాయి. అంటే... 14 రోజుల తర్వాత... ఆ ప్రదేశంలో నీడ పడి... ఉష్ణోగ్రత -180 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోతుంది. నెక్ట్స్ 14 రోజుల తర్వాత... తిరిగి ల్యాండర్, రోవర్ పనిచేస్తే... అది బోనస్సే అంటోంది ఇస్రో.
First published: September 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...