WhatsApp: మీ వాట్సప్ ఇంటర్నెట్ ఎక్కువగా వాడేస్తోందా? ఈ సెట్టింగ్స్ మార్చండి

WhatsApp Settings | మీరు వాట్సప్ వాడుతున్నారా? మీ వాట్సప్ ఇంటర్నెట్ డేటాను ఎక్కువగా వాడేస్తోందా? దీని వల్ల డేటా సరిపోవట్లేదా? అయితే వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చండి.

news18-telugu
Updated: March 26, 2020, 8:49 AM IST
WhatsApp: మీ వాట్సప్ ఇంటర్నెట్ ఎక్కువగా వాడేస్తోందా? ఈ సెట్టింగ్స్ మార్చండి
WhatsApp: మీ వాట్సప్ డేటా ఎక్కువగా వాడేస్తోందా? ఈ సెట్టింగ్స్ మార్చండి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కరోనా వైరస్ లాక్‌డౌన్ అందర్నీ ఇళ్లకు పరిమితం చేసింది. అనేక మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌తో బిజీగా ఉన్నారు. ఇంట్లో ఉన్నందుకు ఇంటర్నెట్ డేటా ఎక్కువ ఖర్చవుతోంది. ఫలితంగా గతంలో వాడిన డేటా సరిపోవట్లేదు. మీరూ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టైతే మీ వాట్సప్ వాడే డేటాను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం వాట్సప్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చితే చాలు. చాలావరకు డేటా ఆదా అవుతోంది. అలా ఆదా అయిన డేటాను మీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరాలకు వాడుకోవచ్చు. మరి ఆ సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకోండి.

ముందుగా మీ వాట్సప్‌లో ఆటో డౌన్‌లోడ్ సెట్టింగ్స్ మార్చడం ముఖ్యం. లేకపోతే మీ వాట్సప్‌లోకి వచ్చే ప్రతీ ఫోటో, వీడియో, ఇతర మీడియా కంటెంట్ డౌన్‌లోడ్ అవుతూనే ఉంటుంది. ఇలా మీ డేటా మొత్తం ఖర్చయిపోతుంది. ఆటో డౌన్‌లోడ్ సెట్టింగ్స్ మార్చేందుకు ముందు వాట్సప్ ఓపెన్ చేయండి. ‘When using mobile data’ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత అందులో ఉన్న ప్రతీ మీడియాను డీ సెలెక్ట్ చేయండి. ఈ సెట్టింగ్స్ మార్చడం వల్ల ఇకపై ప్రతీ ఫైల్ ఆటో డౌన్‌లోడ్ కాదు. మీరు డౌన్‌లోడ్ చేస్తేనే సేవ్ అవుతుంది. వైఫై కనెక్షన్‌కు కూడా సెట్టింగ్స్ ఇలాగే చేసుకోవచ్చు

ఇక మీ వాట్సప్ కాల్స్‌కు ఉపయోగించే డేటాను కూడా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం వాట్సప్ సెట్టింగ్స్‌లో ‘Call Settings’ ఓపెన్ చేసి ‘low data usage’ పైన క్లిక్ చేయాలి. ఇక మీ ఛాట్ బ్యాకప్స్ కూడా తగ్గించుకోవాలి. ఇందుకోసం మీ వాట్సప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి Chats సెక్షన్‌లో Chat backup పైన క్లిక్ చేసి ఆటో బ్యాకప్ ఆఫ్ చేయాలి. ఈ సెట్టింగ్స్ మార్చడం ద్వారా మీ వాట్సప్‌లో ఇంటర్నెట్ డేటా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి:



సినిమాలు చూడాలా? అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5 ఫ్రీగా పొందండి ఇలా

Coronavirus Effect: టీవీ, స్మార్ట్‌ఫోన్‌లో సినిమాలు చూస్తున్నారా? మీకు బ్యాడ్ న్యూస్

ATM: ఏటీఎంకు వెళ్లకుండా ఇంటికే డబ్బులు తెప్పించుకోండి ఇలా...
First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు