Smartphone Tip: మీ స్మార్ట్‌ఫోన్ వాటర్‌ప్రూఫేనా? ఇలా తెలుసుకోవచ్చు

Smartphone Tip: మీ స్మార్ట్‌ఫోన్ వాటర్‌ప్రూఫేనా? ఇలా తెలుసుకోవచ్చు

Smartphone Tip | వాటర్‌ప్రూఫ్ అన్న మాట వినగానే హమ్మయ్య అనుకుంటారు. అయితే డివైజ్‌పై వాటర్ ప్రూఫ్ అని కనిపించగానే ఇక తమ ఫోన్‌కు వచ్చిన ఇబ్బందే లేదు అనుకోవద్దు.

  • Share this:
    స్మార్ట్‌ఫోన్ కొనేప్పుడు అది వాటర్ ప్రూఫేనా కాదా అన్న విషయం చాలామంది పట్టించుకోరు. కానీ నీళ్లల్లో పడితే, వర్షంలో తడిస్తే ఎలా అన్న టెన్షన్ మాత్రం అందరిలో ఉంటుంది. ప్రమాదవశాత్తూ టాయిలెట్‌లోనో, వాష్ బేసిన్‌లోనో ఫోన్ పడిపోవడం లేదా ప్యాంట్ పాకెట్‌లో మర్చిపోయి అలాగే వాషింగ్ మెషీన్‌లో తిప్పేయడం మామూలే. ఆ క్షణంలో ప్రపంచం తలకిందులైనట్టు, గుండె బద్దలైనట్టు అనిపిస్తుంది. ఇందుకు కారణం మీ స్మార్ట్‌ఫోన్ వాటర్‌ప్రూఫేనా లేదా స్ప్లాష్‌ప్రూఫా అన్న విషయం తెలియకపోవడమే. అసలు వాటి మధ్య తేడాలు కూడా చాలామందికి తెలియవు. అసలు వాటర్ రెసిస్టెంట్, వాటర్ రెపెల్లెంట్, వాటర్ ప్రూఫ్ ఫోన్ల మధ్య తేడాలు ఏంటీ? వాటిని ఎలా గుర్తించాలో తెలుసుకోండి.

    Read this: Google Apps: ఏప్రిల్ 2న రెండు గూగుల్ యాప్స్ షట్‌డౌన్

    Water-resistant smartphone, Waterproof smartphone, splashproof smartphone, smartphone ip rating, IP 67 smartphones, IP 68 smartphones, list of waterproof smartphones, smartphone service, wet smartphones, వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్, వాటర్ రెసిస్టెంట్ స్మార్ట్‌ఫోన్, స్ప్లాష్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్, ఐపీ 67 స్మార్ట్‌ఫోన్, ఐపీ 68 స్మార్ట్‌ఫోన్


    వాటర్ రెసిస్టెంట్ స్మార్ట్‌ఫోన్స్


    వాటర్ రెసిస్టెంట్ అంటే నీటిని అడ్డుకునేది అని అర్థం. అంటే మీ డివైజ్‌లోపలికి నీళ్లు వెళ్లకుండా అడ్డుకోగలదు. అలాగని ఎక్కువసేపు నీళ్లల్లో ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. నీటి నుంచి కొంతవరకు మాత్రమే కాపాడేది వాటర్ రెసిస్టెంట్. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు వాటర్ రెసిస్టెంట్‌నే స్ప్లాష్‌ప్రూఫ్ అని పిలుస్తాయి.

    వాటర్ రెపెల్లెంట్ స్మార్ట్‌ఫోన్స్


    వాటర్ రెసిస్టెంట్ కన్నా వాటర్ రెపెల్లెంట్ డివైజులు ఇంకా మంచివి. వీటిలో డివైజ్‌లోని విడిభాగాలపై నీటిని అడ్డుకోగల కోటింగ్ ఉంటుంది. అంటే ఇది కూడా పూర్తిగా నీటిలో ఉండే పాడవదని కాదు. కానీ వాటర్ రెసిస్టెంట్ కన్నా ఇంకాస్త బెటర్. ఒకవేళ నీళ్లు లోపలికి వెళ్లినా తుడిచెయ్యడం పెద్ద సమస్యకాదు. చాలావరకు స్మార్ట్‌ఫోన్ విడిభాగాలు ఇలాగే తయారవుతాయి.

    Read this: CIBIL Score: మీ సిబిల్ స్కోర్ ఇక వాట్సప్‌లో... ఇలా తెలుసుకోవచ్చు

    Water-resistant smartphone, Waterproof smartphone, splashproof smartphone, smartphone ip rating, IP 67 smartphones, IP 68 smartphones, list of waterproof smartphones, smartphone service, wet smartphones, వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్, వాటర్ రెసిస్టెంట్ స్మార్ట్‌ఫోన్, స్ప్లాష్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్, ఐపీ 67 స్మార్ట్‌ఫోన్, ఐపీ 68 స్మార్ట్‌ఫోన్


    వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్స్


    వాటర్‌ప్రూఫ్ అన్న మాట వినగానే హమ్మయ్య అనుకుంటారు. అయితే డివైజ్‌పై వాటర్ ప్రూఫ్ అని కనిపించగానే ఇక తమ ఫోన్‌కు వచ్చిన ఇబ్బందే లేదు అనుకోవద్దు. ఇంగ్రెస్ ప్రొటెక్షన్ రేటింగ్ అంటే ఐపీ రేటింగ్ లేదా ఐపీ కోడ్‌ను బట్టి ఆ డివైజ్‌ స్టాండర్డ్ తెలుసుకోవచ్చు.

    ఐపీ రేటింగ్స్


    ఐపీ అంటే ఇంగ్రెస్ ప్రొటెక్షన్. అంటే నీళ్లు లోపలికి వెళ్లకుండా ఎంతవరకు అడ్డుకోగలదు అని తేల్చే రేటింగ్ ఇది. నీళ్లు, మట్టి లోపలికి వెళ్లడం, తేమ నుంచి రక్షణను ఐపీ రేటింగ్ తెలియజేస్తుంది. స్మార్ట్‌ఫోన్లు ఎక్కువగా IP 67 నుంచి IP 68 రేటింగ్ వరకు ఉంటాయి. “6” నెంబర్ మట్టి, దుమ్ము నుంచి రక్షణను సూచిస్తుంది. “7” నీటి నుంచి రక్షణను సూచిస్తుంది. “8” నీటిలో మునిగినా ఏమీ కాదని సూచిస్తుంది.

    Read this: SBI YONO App: ఎస్‌బీఐ కస్టమర్లకు యోనో యాప్‌‌తో ఉపయోగాలు ఇవే...

    Water-resistant smartphone, Waterproof smartphone, splashproof smartphone, smartphone ip rating, IP 67 smartphones, IP 68 smartphones, list of waterproof smartphones, smartphone service, wet smartphones, వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్, వాటర్ రెసిస్టెంట్ స్మార్ట్‌ఫోన్, స్ప్లాష్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్, ఐపీ 67 స్మార్ట్‌ఫోన్, ఐపీ 68 స్మార్ట్‌ఫోన్


    వాటర్ ప్రూఫ్, వాటర్ రెసిస్టెంట్ ఫోన్లు ఇవే...


    Apple: iPhone 7, iPhone 7 Plus (IP 67) iPhone 8, 8 Plus, X, XR, XS, XS Plus (IP 68)

    Samsung: Galaxy S7, Galaxy S7 Edge, Galaxy S8, Galaxy S8 Plus, Galaxy S10, Galaxy S10e, Galaxy S10 Plus (IP 68)

    Huawei: Mate 20 Pro (IP 68), P20 Pro (IP 67)

    Sony: Xperia XZ2, Xperia XZ1, Xperia XZ Premium, Xperia XZs (IP 68)

    LG: LG V40 ThinQ, LG G6, LG G7 ThinQ, LG G7 Plus ThinQ, LG Q7, LG Q7 Plus, LG Q Stylus Plus, LG Q Stylus (IP 68)

    Xiaomi: Redmi Note 7, Redmi Note 7 Pro (P2i)

    OnePlus: OnePlus 6T

    Honor: View 20

    Motorola: Moto G6, Moto G6 Plus, One Power (P2i)

    మీ స్మార్ట్‌ఫోన్ ఈ లిస్ట్‌లో లేకపోతే మీ ఫోన్ నీళ్లల్లో పడకుండా, మీ ఫోన్‌పై నీళ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపై స్మార్ట్‌ఫోన్ కొనేప్పుడు ఐపీ రేటింగ్స్ పరిశీలించడం మంచిది.

    Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...

    ఇవి కూడా చదవండి:

    ఆ పావురం ధర రూ.10 కోట్లు... ఎందుకో తెలుసా...

    Food Safety Jobs: ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో 275 ఖాళీలు

    LIC Navjeevan Plan: ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ... నవజీవన్ ప్లాన్‌తో లాభాలు ఇవే
    First published: