IS YOUR SMARTPHONE HAVE HANGING ISSUE KNOW HOW TO IMPROVE ANDROID MOBILE PERFORMANCE SS
Android Tips: మీ స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవుతోందా? ఈ సెట్టింగ్స్ మార్చి చూడండి
Android Tips: మీ స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవుతోందా? ఈ సెట్టింగ్స్ మార్చి చూడండి
(ప్రతీకాత్మక చిత్రం)
Android Tips | మీ స్మార్ట్‌ఫోన్ పనితీరు తగ్గిందా? పదేపదే స్లో అవుతోందా? ఊరికే హ్యాంగ్ (Smartphone Hanging Issue) అవుతోందా? అయితే మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఈ సెట్టింగ్స్ మార్చి చూడండి.
స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఓ అవసరం. మంచి దుస్తులు వేసుకున్నా వేసుకోకపోయినా మంచి స్మార్ట్‌ఫోన్ వాడాలన్న ఆలోచన పెరుగుతోంది. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతీ ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్ వాడటం తప్పనిసరైపోయింది. అయితే కొత్త స్మార్ట్‌ఫోన్ (New Smartphone) కొన్న కొద్దిరోజుల వరకు బాగానే ఉంటుంది. కానీ తర్వాత స్మార్ట్‌ఫోన్ పర్ఫామెన్స్ స్లో అవుతూ ఉంటుంది. ఇందుకు చాలా కారణాలు ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాదు ల్యాప్‌టాప్, కంప్యూటర్ కూడా ఇలాగే అవుతూ ఉంటుంది. అయితే కొన్ని సెట్టింగ్స్ మారిస్తే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ పనితీరును మెరుగుపర్చుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ పదేపదే హ్యాంగ్ అవుతుందని కొత్త ఫోన్ కొనాల్సిన అవసరం లేదు. కొన్ని సెట్టింగ్స్ మార్చి స్మార్ట్‌ఫోన్ పర్ఫామెన్స్‌ను పెంచుకోవచ్చు. మరి ఏఏ టిప్స్ ఫాలో అవాలో తెలుసుకోండి.
Live Wallpapers: మీ స్మార్ట్‌ఫోన్‌లో లైవ్ వాల్‌పేపర్స్ వాడుతున్నట్టైతే వెంటనే మార్చేయండి. లైవ్ వాల్‌పేపర్స్ వల్ల సీపీయూ ఎప్పుడూ రన్నింగ్‌లోనే ఉంటుంది. బ్యాటరీ కూడా త్వరగా తగ్గిపోతుంది. మీరు హోమ్ స్క్రీన్ ఆన్ చేయగానే యాప్స్‌తో పాటు లైవ్ వాల్ పేపర్స్ కూడా సీపీయూ, బ్యాటరీని ఉపయోగించుకుంటాయి. అందుకే స్టాటిక్ వాల్‌పేపర్ ఉపయోగించండి.
Disable Apps: స్మార్ట్‌ఫోన్‌లో అనవసరమైన యాప్స్ చాలా ఉంటాయి. ఇన్‌బిల్ట్ యాప్స్‌ని డిలిట్ చేయడం సాధ్యం కాదు. మీరు ఆ యాప్స్ ఉపయోగించనట్టైతే వాటిని డిసేబుల్ చేయండి. యాప్స్ డిసేబుల్ చేస్తే ఆ యాప్ యాక్టీవ్‌గా ఉండదు. మీరు కావాలనుకున్నప్పుడు ఆ యాప్ ఉపయోగించుకోవచ్చు.
Android Update: ఓసారి మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్ అయిందో లేదో చూడండి. అప్డేట్ చేయాల్సి ఉంటే వెంటనే ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేయండి. ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేస్తే స్మార్ట్‌ఫోన్ యూజర్ ఇంటర్ఫేస్ మారడం మాత్రమే కాదు... ఫోన్ పనితీరు కూడా వేగంగా మారుతుంది. అందుకే పాత వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించొద్దు. ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ చేయడానికి Settings> System> System updates> క్లిక్ చేయాలి.
Widgets: స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ పైన విడ్జెట్స్ చూడటానికి బాగానే ఉంటాయి. కానీ అవి ఎప్పుడూ యాక్టివేట్‌గా ఉంటాయి కాబట్టి... సీపీయూ, బ్యాటరీ పనితీరుపై ప్రభావం ఉంటుంది. మీకు ఎక్కువగా ఉపయోగపడే విడ్జెట్స్ మాత్రమే ఉపయోగించండి. మిగతావాటిని తొలగించండి.
Toggle Animations: మీ స్మార్ట్‌ఫోన్ ఆపరేట్ చేస్తున్నప్పుడు యానిమేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. యానిమేషన్ స్కేల్ మారిస్తే మీ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ స్మూత్ అవుతుంది. Settings > Developer Options > Window Animation Scale > Animation Scale 10x క్లిక్ చేసి యానిమేషన్ స్కేల్ మార్చుకోవచ్చు. మీకు సౌకర్యంగా ఉండే స్కేల్ ఎంచుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.