Alert: మీ ఫోన్ 25 సెకండ్లే రింగ్ అవుతోందా? ఎందుకో తెలుసా?

వాస్తవానికి గతంలో రింగ్ టైమ్ 45 సెకండ్స్ ఉండేది. అంటే మీకు ఎవరైనా కాల్ చేస్తే మీ ఫోన్ 45 సెకండ్ల పాటు రింగ్ అవుతూ ఉండేది. మీరు కాల్ లిఫ్ట్ చేయకపోతే 45 సెకండ్ల తర్వాత డిస్‌కనెక్ట్ అవుతుంది.

news18-telugu
Updated: October 2, 2019, 3:07 PM IST
Alert: మీ ఫోన్ 25 సెకండ్లే రింగ్ అవుతోందా? ఎందుకో తెలుసా?
Alert: మీ ఫోన్ 25 సెకండ్లే రింగ్ అవుతోందా? ఎందుకో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 2, 2019, 3:07 PM IST
మీ ఫోన్ గతంలో కన్నా ఇప్పుడు తక్కువ టైమ్ రింగ్ అవుతోందా? రింగ్ టోన్ విని కాల్ లిఫ్ట్ చేసేలోపే కాల్ కట్ అవుతోందా? అసలు రింగ్ టోన్ వినిపించకుండానే మిస్డ్ కాల్ ఉంటుందా? దీనికంతటికీ కారణం తెలుసా? కాల్ కేవలం 25 సెకండ్లు మాత్రమే రింగ్ కావడం. రిలయెన్స్ జియో కాల్ రింగ్ టైమ్‌ను 25 సెకండ్లకు తగ్గించిన తర్వాత ఇతర టెలికామ్ ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కూడా ఔట్‌గోయింగ్ కాల్స్ రింగ్ టైమ్‌ను తగ్గించాయి. రింగ్ టైమ్ తగ్గిస్తున్నట్టు ట్రాయ్‌కు ఎయిర్‌టెల్ లేఖ రాయగా, వొడాఫోన్ ఐడియా కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. కాల్ రింగ్ టైమ్‌ను తగ్గించడం ద్వారా ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జెస్-IUC నష్టాలను తగ్గించుకోగలమని ఎయిర్‌టెల్ అభిప్రాయపడింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా కూడా రింగ్ టైమ్‌ను తగ్గించింది. దీనిపై స్పందించిన ట్రాయ్... కంపెనీలు పరస్పర ఒప్పందానికి వచ్చి ఈ వివాదానికి ఓ పరిష్కారాన్ని కనుగొనాలని కోరింది. అక్టోబర్ 14న ఓపెన్ హౌజ్ డిస్కషన్ నిర్వహించాలని ట్రాయ్ భావిస్తోంది.

వాస్తవానికి గతంలో రింగ్ టైమ్ 45 సెకండ్స్ ఉండేది. అంటే మీకు ఎవరైనా కాల్ చేస్తే మీ ఫోన్ 45 సెకండ్ల పాటు రింగ్ అవుతూ ఉండేది. మీరు కాల్ లిఫ్ట్ చేయకపోతే 45 సెకండ్ల తర్వాత డిస్‌కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మాత్రం రింగ్ టైమ్ కేవలం 25 సెకండ్లు మాత్రమే. రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నుంచి చేసే కాల్స్ కేవలం 25 సెకండ్స్ మాత్రమే రింగ్ అవుతున్నాయి. గతంలో లాంగ్ రింగ్ కాకుండా తక్కువ టైమ్ రింగ్ అయి కాల్ డిస్‌కనెక్ట్ అవుతోంది. తమ ఫోన్ తక్కువ టైమ్ రింగ్ అవుతుండటంతో యూజర్లు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ప్రస్తుతం వేర్వేరు టెలికామ్ ఆపరేటర్స్ మధ్య కాల్స్ వెళ్తే కాల్ డయల్ చేసిన ఆపరేటర్ కాల్ రిసీవ్ చేసుకున్న ఆపరేటర్‌కు నిమిషానికి 6 పైసలు చెల్లిస్తోంది. దీన్నే ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జెస్ అంటారు. 2020 జనవరి 1 నుంచి ఈ ఛార్జీలను తొలగించాలని ట్రాయ్ భావిస్తోంది.

Mahatma Gandhi 150th Birthday: జాతిపిత అరుదైన 100 చిత్రాలు... మీరు చూశారా?





ఇవి కూడా చదవండి:

WhatsApp: మీరు పంపిన వాట్సప్ మెసేజ్‌ను 5 సెకండ్లలో మాయం చేయొచ్చు

Samsung Galaxy Fold: ఈ స్మార్ట్‌ఫోన్ మడతపెట్టొచ్చు... ఎలా ఉందో చూడండి
Loading...
Best TVs: ఆన్‌లైన్‌లో టీవీ కొంటున్నారా? ఫెస్టివల్ సేల్‌లో 12 బెస్ట్ టీవీలు ఇవే...
First published: October 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...