Google Drive: గూగుల్​ డ్రైవ్‌లో స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ టిప్స్‌తో ఖాళీ చేయండి

Google Drive: గూగుల్​ డ్రైవ్‌లో స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ టిప్స్‌తో ఖాళీ చేయండి (ప్రతీకాత్మక చిత్రం)

Google Drive | మీ గూగుల్ డ్రైవ్ ఫుల్ అయిందా? జీమెయిల్ మొత్తం మెయిల్స్‌తో ఫుల్ అయిందా? స్టోరేజ్ ఎలా ఖాళీ చేయాలో తెలుసుకోండి.

  • Share this:
గూగుల్​ ఫోటోస్​... ఫోటోలు, వీడియోల బ్యాకప్​ కోసం ఉపయోగిస్తున్న బెస్ట్​ ఫ్రీ యాప్​. చాలా మంది ఇందులో ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను భద్రపర్చుకుంటారు. అయితే ఈ ఉచిత స్టోరేజ్​కి కూడా ఒక లిమిట్​ ఉంటుంది. లిమిట్​ దాటితే ఆ ఫోటోలు, వీడియోలు ఆటోమేటిక్​గా అప్‌లోడ్ కావు. సాధారణంగా ప్రతి గూగుల్​ అకౌంట్​కు 15జీబీ వరకు ఉచిత స్టోరేజ్​ స్పేస్​ లభిస్తుంది. ఈ 15జీబీ డేటాను డాక్యుమెంట్లు, జీమెయిల్​, గూగుల్​ ఫోటోలు స్టోరేజ్​ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. 15జీబీకి మించి స్టోరేజ్​ కోసం అదనంగా సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అవసరం లేని డేటాను ఎప్పటికప్పుడు డిలీట్​ చేయడం ద్వారా ఎక్కువ విలువైన డేటాను ఉచితంగా భద్రపర్చుకోవచ్చు. ప్రతిరోజు మన జీమెయిల్​కు వచ్చి పడే మెయిల్స్‌​ను డిలీట్​ చేయడం ప్రయాసతో కూడుకున్న పని. అందువల్ల ఆటోమేటిక్​గా వాటిని డిలీట్​ చేసి స్టోరేజ్​ స్పేస్​ను క్రియేట్​ చేసుకోవాలి. ఇలా ఏర్పడిన స్పేస్​ను మీ గూగుల్​ ఫోటోస్ కోసం ఉపయోగించుకోవచ్చు. అవసరం లేని మెయిల్స్​, డ్రైవ్ ఇన్‌బాక్స్, లార్జ్ ఫైల్స్‌ను ఆటోమేటిక్​గా ఎలా డిలీట్​ చేయాలో తెలుసుకోండి.

Realme Fan Festival 2021: ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై రూ.6,000 వరకు తగ్గింపు

Motorola Edge 20: మోటోరోలా నుంచి ఎడ్జ్ 20 ప్రీ-ఆర్డర్ సేల్ ప్రారంభం

జీమెయిల్‌లో లార్జ్ అటాచ్‌మెంట్లను ఇలా క్లియర్​ చేయండి


కొన్నిసార్లు మన మెయిల్‌కు పెద్ద సైజులో అటాచ్‌మెంట్లు ఉండే మెయిల్స్ వస్తుంటాయి. వాటిని డిలీట్ చేయడం మర్చిపోతుంటాం. వీటిని ఒకేసారి డిలీట్ చేయడానికి మీ జీమెయిల్​ అకౌంట్​కు వెళ్లి, సెర్చ్ బార్‌లో “has:attachment larger:10M” అని టైప్ చేయండి. ఒకవేళ మీరు 10 కంటే ఎక్కువ సంఖ్యలో పెద్ద ఫైల్‌లను డిలీట్​ చేయాలనుకుంటే.. '10' స్థానంలో ఆ నంబర్‌ టైప్​ చేయండి. మీ జీమెయిల్ సెర్చింగ్ రిజల్ట్స్​ వచ్చిన తర్వాత, మీకు అవసరం లేని అన్ని ఈ–మెయిల్స్​ను సెలక్ట్​ చేసుకోండి. ఆ తర్వాత డిలీట్​ ఆప్షన్​పై క్లిక్​ చేయండి. ట్రాష్​లోకి వెళ్లి మీ ట్రాష్​ బిన్​ను ఖాళీ చేయండి.

WhatsApp: వాట్సప్‌లో ఈ కొత్త ఫీచర్స్ ట్రై చేస్తున్నారా?

Realme X7 Max 5G: రూ.26,999 విలువైన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.9,999 ధరకే కొనండి ఇలా

గూగుల్​ డ్రైవ్‌ను ఎలా క్లియర్ చేయాలంటే...


మీ గూగుల్​ డ్రైవ్ ఇన్‌బాక్స్ ఐటెమ్స్‌ను క్లియర్ చేసేందుకు.. ముందుగా, మీ డ్రైవ్‌ను ఓపెన్​ చేసి, ఎడమ వైపు కనిపించే ఆల్​ ఫైల్స్​ ఆప్షన్​పై క్లిక్​ చేయండి. అవసరం లేని పాత ఫైల్స్​ను​ మాన్యువల్‌గా ఎంచుకుని డిలీట్​ చేయండి.

మీరు ఏదైనా వెబ్​సైట్​లో సైన్​ అప్​ అయితే.. ఆ వెబ్​సైట్​ నుంచి అనేక అప్​​డేట్స్ మీ జీమెయిల్​కు వస్తుంటాయి. అందువల్ల, అవసరం లేని వెబ్​సైట్స్​ నుంచి అన్ సబ్​స్క్రైబ్​ అవ్వండి. దీని కోసం సదరు వెబ్​సైట్​కు సంబంధిన కీవర్డ్​ టైప్ చేసి అన్​సబ్​స్క్రైబ్​ చేసుకోండి. తద్వారా ప్రతి ఈ–మెయిల్​ను చదవకుండానే మీరు ఇప్పుడు సులభంగా డిలీట్ ​చేయవచ్చు.

పాత మెయిల్స్‌ను డిలీట్ చేయడానికి సెర్చ్ బార్‌లో సెండర్ పేరు టైప్ చేయండి. ఆ పేరుతో వచ్చిన మెయిల్స్ అన్నీ సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపిస్తాయి. వాటిని సెలక్ట్ చేసుకొని.. రీడ్ చేయకుండానే ఒకేసారి డిలీట్ చేయవచ్చు.
Published by:Santhosh Kumar S
First published: