Gmail Inbox: మెయిల్స్‌తో మీ జీమెయిల్ నిండిపోయిందా? అయితే ఈ ట్రిక్స్ ఫాలో అవండి

Gmail Inbox: మెయిల్స్‌తో మీ జీమెయిల్ నిండిపోయిందా? అయితే ఈ ట్రిక్స్ ఫాలో అవండి (ప్రతీకాత్మక చిత్రం)

Gmail Inbox | అవసరం లేని ఇమెయిల్స్‌తో మీ జీమెయిల్ (Gmail) నిండిపోయిందా? మీ జీమెయిల్‌ను క్లీన్‌గా మార్చడానికి ఈ టిప్స్ (Gmail Tips) పాటించండి.

  • Share this:
మారుతున్న కాలానికి తగ్గట్టు చాలామంది ఇంటర్నెట్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్‌ను వాడుతున్న వారిలో దాదాపు ప్రతి ఒక్కరు జీమెయిల్ (Gmail) వాడుతున్నారు. అయితే జీమెయిల్ ఇన్ బాక్స్‌లో కుప్పల కొద్దీ మెయిల్స్ వస్తూనే ఉంటాయి. ఈమధ్య మార్కెటింగ్‌కు జీమెయిల్ అడ్డాగా మారడంతో చాలా కంపెనీలు, వ్యక్తులు మెయిల్స్ ద్వారా మార్కెటింగ్‌కు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో హ్యాకర్లు మెయిల్స్ ద్వారా మన సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తుంటారు. కాబట్టి మన ఇన్ బాక్స్‌ని (Gmail Inbox) ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుకోవడంతో పాటు భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇందుకు ఏం చేయాలో చూద్దాం.

హ్యాకర్లకు చిక్కకుండా జాగ్రత్తపడండి


జీమెయిల్ యాక్సెస్ చేయడం అనే ప్రక్రియ సులభతరం కాకుండా క్లిష్టంగా చేస్తే చాలా వరకు హ్యాకర్ల నుంచి బయటపడవచ్చు. అందుకుగాను రెండంచెల అథెంటికేషన్ (two-factor authentication) ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్ కు ఓటీపీ వచ్చేలా చూసుకోవడం లేదంటే మీ మొబైల్ ద్వారా జీమెయిల్‌ను యాక్సెస్ చేస్తున్నది మీరే అని నిర్ధారించుకోవడం లాంటివి చేయాలి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు రెండంచెల అథెంటికేషన్ ను ఓకే చేయకపోతే https://myaccount.google.com/signinoptions/two-step-verification/enroll-welcome ని క్లిక్ చేసి తెలుసుకోండి.

Redmi Note 10 Pro Max: ఈ స్మార్ట్‌ఫోన్‌పై 12 శాతం డిస్కౌంట్... పండుగ సేల్ ముందే ఆఫర్

అన్ సబ్‎స్క్రైబ్ చేయండి


మనం ఎన్ని మెయిల్స్ ని డిలీట్ చేసినా కానీ కొత్తగా మెయిల్స్ వస్తూనే ఉండటం మనం తరుచూ గమనిస్తుంటాం. దీని వల్ల మనకు చిరాకు పుడుతుంటుంది. అయితే ఇలా జరగకూడదని అనుకుంటే ముందుగా అవసరం లేని మెయిల్స్‌ని అన్ సబ్‎స్క్రైబ్ చేసుకోవాలి. దీని వల్ల సదరు సెండర్ నుంచి తిరిగి మనకు ఎలాంటి మెయిల్స్ రావు.

ఫిల్టర్లను వాడండి


ఇన్‌బాక్స్‌లో ఎక్కువ మెయిల్స్ ఉన్నప్పుడు.. వాటిలో మనకు ఏ మెయిల్స్ ముఖ్యమైనవనే విషయం గుర్తించడం పెద్ద తలనొప్పి. అలాంటి సందర్భాల్లో జీమెయిల్‌లో ఉండే ఫిల్టర్లను వాడి, మనకు కావాల్సిన మెయిల్స్‌ వెతుక్కోవచ్చు. ఇందుకు డెస్క్‌టాప్‌లో జీమెయిల్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ చివర్లో ఉండే స్లైడర్స్ ఐకాన్‌ని క్లిక్ చేయాలి. అక్కడ మీకు ‘Create Filter’ అనే బటన్ కనిపిస్తుంది. తర్వాత మీకు నచ్చిన విధంగా ఫిల్టర్ సెట్ చేసుకోవచ్చు.

Flipkart: రూ.20,000 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.14,099 ధరకే కొనొచ్చు ఇలా

అన్‌ డూ సెంట్ మెసేజ్ ఫీచర్


మనం కొన్నిసార్లు పొరపాటున అవసరమైన మెయిల్స్ కూడా డిలీట్ చేస్తుంటాం. అలాంటప్పుడు జీమెయిల్ అందిస్తున్న అన్‌ డూ సెంట్ మెసేజెస్ (undo sent messages) ఫీచర్‌ను వాడుకోవచ్చు. మనం డిలీట్ చేసిన మెయిల్‌ను 30 సెకన్లలోపు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం జీమెయిల్ సెట్టింగ్స్ లోని టాప్ రైట్ లో ఉండే గేర్ ఐకాన్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. జనరల్ ట్యాబ్‌లో ‘Undo Send’ ఆప్షన్‌ను యూజర్లు ఎంచుకొని.. టైమ్‌ను సైతం సెట్ చేసుకోవచ్చు.

స్మార్ట్ కంపోజ్


మనలో చాలామంది మెయిల్స్ రాయడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే స్మార్ట్ కంపోజ్ తో చాలా వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే మనం మెయిల్ రాయడానికి వీలవుతుంది. స్మార్ట్ కంపోజ్ ఫీచర్‌తో మనం పదాలను టైప్ చేస్తున్నప్పుడే.. రాయాల్సిన పదాలు కనిపిస్తుంటాయి. వాటిని క్లిక్ చేసి వాడుకోవచ్చు. జీమెయిల్ సెట్టింగ్స్‌లో జనరల్ ట్యాబ్ కింద స్మార్ట్ కంపోజ్ ఆప్షన్ మనకు కనిపిస్తుంటుంది.
Published by:Santhosh Kumar S
First published: