జీమెయిల్... ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ ఇమెయిల్ సర్వీస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ జీమెయిల్ యూజర్లు ఉన్నారని అంచనా. అంటే... 200 కోట్లకు పైగా జీమెయిల్ యూజర్లు ఉన్నారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ (Android Smartphone) వాడుతున్న ప్రతీ ఒక్కరికీ జీమెయిల్ అకౌంట్ అవసరం. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ (Operating System) అయిన ఆండ్రాయిడ్ సేవలు వాడాలంటే జీమెయిల్ కావాల్సిందే. కాబట్టి ప్రతీ ఒక్కరూ నిత్యం జీమెయిల్‌ను ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే అనుకోకుండా జీమెయిల్ లాక్ అయిందంటే చుక్కలు కనిపిస్తాయి. జీమెయిల్‌తో లాగిన్ చేస్తే తప్ప చాలావరకు సేవలు ఉపయోగించుకోలేరు. గూగుల్ ఫోటోస్, గూగుల్ మీట్, గూగుల్ డాక్స్ ఇలా ఎందులో లాగిన్ కావాలన్నా జీమెయిల్ అకౌంట్ కావాల్సిందే.
జీమెయిల్ అకౌంట్ లాక్ కావడానికి పలు కారణాలు ఉంటాయి. పాస్‌వర్డ్ గుర్తుండకపోవడం, సెక్యూరిటీ కారణాల వల్ల జీమెయిల్ బ్లాక్ అవుతుంది. జీమెయిల్ అకౌంట్ బ్లాక్ కాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. సులువుగా అన్‌లాక్ చేయొచ్చు. అంటే జీమెయిల్‌లో ఈజీగా లాగిన్ కావొచ్చు. జీమెయిల్‌లో తిరిగి లాగిన్ కావడానికి చాలా మార్గాలున్నాయి.
Porn Scam: పోర్న్ చూసేవారికి అలర్ట్... ఈ మెసేజ్ నమ్మారంటే స్కామ్‌లో బుక్కైపోతారు జాగ్రత్త
జీమెయిల్ పాస్‌వర్డ్ మర్చిపోతే Forgot Password పైన క్లిక్ చేసి ఆ తర్వాత స్టెప్స్ ఫాలో అయి మీ గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్ మార్చుకోవచ్చు. మీరు టూస్టెప్ వెరిఫికేషన్ వాడుతున్నట్టైతే సెక్యూరిటీ ఉపయోగించొచ్చు. సెక్యూరిటీ కీ లేకపోతే మరో డివైజ్‌లో మీ జీమెయిల్‌తో లాగిన్ అయ్యారేమో చూడండి. ఫోన్ లేదా ట్యాబ్లెట్‌లో నోటిఫికేషన్ వస్తుంది. యాక్సెప్ట్ చేయండి.
మీరు గూగుల్ ఆథెంటికేటర్ యాప్ వాడుతున్నట్టైతే అందులో వచ్చే ఆరు అంకెల కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావొచ్చు. లేదా మీరు రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబర్‌కు వెరిఫికేషన్ కోడ్ పంపి వెరిఫై చేయొచ్చు. ఒకవేళ మీరు ముందే గూగుల్ అకౌంట్ బ్యాకప్ కోడ్స్ ఎక్కడైనా సేవ్ చేసినట్టైతే ఆ కోడ్ ఎంటర్ చేసినా లాగిన్ చేయొచ్చు.
Micromax In Note 2: ఐఫోన్ 13 డిజైన్‌తో మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర రూ.12,490 మాత్రమే
అసలు మీ జీమెయిల్ ఐడీ ఏమని క్రియేట్ చేశారో కూడా గుర్తులేదా? అయితే రికవరీ మెయిల్ ద్వారా తెలుసుకోవచ్చు. జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత Forgot email లింక్ పైన క్లిక్ చేసి మీరు మెయిల్ ఐడీ క్రియేట్ చేసినప్పుడు ఇచ్చిన రికవరీ మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి. లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ రికవరీ ఇమెయిల్ ఐడీకి వచ్చిన కోడ్ ఎంటర్ చేసి మీ జీమెయిల్ అకౌంట్ రికవరీ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.