ఫేస్‌బుక్ హ్యాకైందా? మరి మీరేం చేయాలి?

ఫేస్‌బుక్‌లో ప్రైవసీ సెట్టింగ్స్‌ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండండి. అనుమానాస్పదంగా ఏదైనా యాక్టివిటీ కనిపిస్తే ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేయండి.

news18-telugu
Updated: October 13, 2018, 11:10 AM IST
ఫేస్‌బుక్ హ్యాకైందా? మరి మీరేం చేయాలి?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వేలు... లక్షలు కాదు... ఏకంగా 5 కోట్ల ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్ అవడం ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. మరి మీ అకౌంట్ హ్యాక్ అయిందా? అయితే ఏం చేయాలి? హ్యాక్ కాకపోయినా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ? తెలుసుకోండి.

మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయిందన్న అనుమానం వచ్చిందా? ముందుగా పాస్‌వర్డ్ మార్చేయండి.

ఎవరూ గుర్తించలేని విధంగా పాస్‌వర్డ్ సెట్ చేయండి.
పాస్‌వర్డ్‌లో లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి.
మీ పాస్‌వర్డ్ ఎవరికీ చెప్పకండి.
ఫేస్‌బుక్ ప్రైవసీ షార్ట్‌కట్స్, సెట్టింగ్స్ గురించి పూర్తిగా తెలుసుకోండి.
ఏదైనా పోస్ట్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించే పోస్టులేవీ చేయకూడదు.
మీ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు వెల్లడించొద్దు.
మీకు తెలిసినవారి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు మాత్రమే యాక్సెప్ట్ చేయండి.
ప్రైవసీ సెట్టింగ్స్‌ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండండి.
అనుమానాస్పదంగా ఏదైనా యాక్టివిటీ కనిపిస్తే ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేయండి.
మీ ఫేస్‌బుక్‌ను ఆల్వేస్ లాగిన్ స్టేటస్‌లో పెట్టకండి.
సెక్యూరిటీ అండ్ లాగిన్ పేజ్‌లోకి వెళ్తే మీరు ఏఏ డివైజ్‌లల్లో లాగిన్ అయ్యారో తెలుస్తుంది.
ఏదైనా అనుమానం వస్తే అందులో 'లాగౌట్ ఫ్రమ్ ఆల్ సెషన్స్' క్లిక్ చేయండి.
అదే పేజ్‌లో 2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ క్లిక్ చేయండి.
టెక్స్ట్ మెసేజ్ లేదా ఆథెంటికేషన్ యాప్ ఆప్షన్ ఎంచుకోండి.
ఇకపై ఫేస్‌బుక్ లాగిన్ కావాలంటే పాస్‌వర్డ్ తర్వాత మరో కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లకు అడ్డాగా మారిన ఫేస్‌బుక్ అంటే విసుగొస్తే అకౌంట్ డిలిట్ చేయొచ్చు.

ఇవి కూడా చదవండి:

ఫేస్‌బుక్ అకౌంట్లకు హ్యాకింగ్ షాక్!

ఫేస్‌బుక్ హ్యాక్: ఆ అమ్మాయి ఎవరు?

మీ వాట్సప్ హ్యాక్ అయిందా?

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?

మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని అకౌంట్లు ఇవే!

నాలుగు కెమెరాలతో రెడ్‌మీ నోట్ 6 ప్రో
Published by: Santhosh Kumar S
First published: October 13, 2018, 11:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading