IS YOUR DIGITAL TRANSACTION FAILED YOU CAN COMPLAIN TO OMBUDSMAN SCHEME FOR DIGITAL TRANSACTIONS KNOW HOW SS
Personal Finance: వ్యాలెట్‌లో డబ్బులు పోయాయా? ఇలా కంప్లైంట్ చేయొచ్చు
వాట్సాప్‌లో వచ్చిన న్యూ ఫీచర్‌తో చిన్న వ్యాపారులకు బోలెడు లాభం..
డిజిటల్ ట్రాన్సాక్షన్స్తో ఎంత సౌకర్యం ఉందో... అంతే రిస్క్ కూడా ఉంది. ఒక్కోసారి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతుంటాయి. అసలు డబ్బులు ఎక్కడికి పోయాయో తెలియదు. ఫండ్స్ సెటిల్మెంట్స్లో విపరీతమైన జాప్యం జరుగుతుంది.
ఒకప్పుడు బిల్లులు చెల్లించాలన్నా, నగదు ట్రాన్స్ఫర్ చేయాలన్నా చాలా పరిమితమైన అవకాశాలుండేవి. కానీ... ఇప్పుడు అంతా డిజిటల్‌మయం. జస్ట్ కూర్చున్నచోట నుంచి లక్షలకు లక్షలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఎలాంటి బిల్లులైనా క్షణాల్లో చెల్లించొచ్చు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్తో ఎంత సౌకర్యం ఉందో... అంతే రిస్క్ కూడా ఉంది. ఒక్కోసారి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతుంటాయి. అసలు డబ్బులు ఎక్కడికి పోయాయో తెలియదు. ఫండ్స్ సెటిల్మెంట్స్లో విపరీతమైన జాప్యం జరుగుతుంది. మరి ఇలాంటివాటిపై ఎవరిని అడగాలి? సంబంధిత సంస్థలు స్పందించకపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఇప్పటివరకు చాలామందిలో ఉన్న అనుమానాలు ఇవి. ఇప్పుడు ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ యూజర్ల సమస్యల్ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగింది. అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, 2019 ప్రవేశపెట్టింది.
అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, 2019 ఏంటీ?
అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్, 2019 జనవరి 31న అమలులోకి వచ్చేసింది. అమెజాన్ పే, పేటీఎం, మొబీక్విక్, ఫోన్‌పే... ఇలా ఎలాంటి సంస్థలైనా డిజిటల్ లావాదేవీల్లో ఏవైనా సేవా లోపాలు ఉంటే వాటిపై ఫిర్యాదులు చేయడానికి, వాటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యంత్రాంగమే అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. అంటే ఈ ఫిర్యాదులన్నీ కేవలం ఆన్లైన్లో చేసే డిజిటల్ ట్రాన్సాక్షన్లకు మాత్రమే పరిమితం.
అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో ఎవరు ఫిర్యాదు చేయొచ్చు?
మీరు వ్యాలెట్‌లో ఫండ్స్ లోడ్ చేసినప్పుడు నిర్ణీత సమయంలో డబ్బులు వ్యాలెట్‌లో కనిపించకపోయినా, నిర్ణీత సమయంలో రీఫండ్ చేయకపోయినా, రీఫండ్ చేసేందుకు నిరాకరించినా, లావాదేవీలను తిరస్కరించినా, రద్దు చేసినా కంప్లైంట్ ఇవ్వొచ్చు. ఉదాహరణకు ఒక్కోసారి గూగుల్ పే ద్వారా మీ బంధువులకో, స్నేహితులకో డబ్బులు పంపినప్పుడు మీ అకౌంట్లో డబ్బులు డిడక్ట్ అవుతాయి. కానీ ఆ డబ్బులు అవతలివారి అకౌంట్లోకి చేరవు. లావాదేవీ ఇంకా పెండింగ్‌లోనే చూపిస్తూ ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మరుసటిరోజు మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. కానీ అప్పటివరకూ మీకు టెన్షన్ తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కంప్లైంట్ ఇవ్వొచ్చు. ఆన్లైన్ పేమెంట్‌లో జాప్యం జరిగినా, మీరు డబ్బులు చెల్లించినా అవతలివాళ్లకు చేరకపోయినా, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినప్పుడు మీ డబ్బులు మీకు తిరిగిరాకపోతే ఫిర్యాదు చేయొచ్చు. మీరు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు లబ్ధిదారులకు చేరకపోతే అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించొచ్చు.
అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో ఎలా కంప్లైంట్ చేయాలి?
అవసరమైన వివరాలతో నిర్ణీత ఫార్మాట్లో కంప్లైంట్ కాపీ ఫిల్ చేసి, మీ సంతకంతో ఫిర్యాదు చేయాలి. ఎలక్ట్రానిక్ రూపంలోనూ మీ కంప్లైంట్ పంపొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారులే అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో ఉంటారు. చీఫ్ జనరల్ మేనేజర్ లేదా జనరల్ మేనేజర్ అంబుడ్స్‌మన్ వ్యవస్థను చూసుకుంటారు. మీ కంప్లైంట్ వారికే వెళ్తుంది. కంప్లైంట్ ఇవ్వడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.