మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజరా? ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నారా? మీ స్మార్ట్‌ఫోన్ చెత్తతో (Smartphone Trash) నిండిపోయిందా? క్యాష్ ఫైల్స్, జంక్ ఫైల్స్‌తో స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ ఫుల్ (Storage Full) అయిందా? అయితే స్టోరేజ్ ఖాళీ చేయడం అవసరం. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఏదో ఓ సందర్భంలో ఈ సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. స్టోరేజ్ ఖాళీ చేయలేక తిప్పలు పడుతుంటారు. అయితే స్మార్ట్‌ఫోన్‌లో క్యాష్ ఫైల్స్, జంక్ ఫైల్స్ తొలగించడం ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ ఫైల్స్ చాలావరకు స్టోరేజ్ తీసుకుంటాయి. ఒక్కో స్మార్ట్‌ఫోన్‌లో 2జీబీ వరకు ఈ ఫైల్స్ ఉంటాయి. వాటిని తొలగించి స్పేస్ పెంచుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
మీరు ఫైల్స్ బై గూగుల్ (Files by Google) యాప్ వాడుతున్నట్టైతే ఈ యాప్ ఓపెన్ చేయాలి. హోమ్ స్క్రీన్‌పై Clean పైన క్లిక్ చేయాలి. ట్రాష్ ఫైల్స్ అన్నీ స్కాన్ అవుతాయి. వాటిని డిలిట్ చేయొచ్చు. అంతేకాదు... అవసరం లేని ఫైల్స్, వీడియోస్, ఫోటోస్ కూడా ఈ యాప్ నుంచి డిలిట్ చేయొచ్చు. డిలిట్ చేసిన ఫైల్స్ 60 రోజుల పాటు Trash ఫోల్డర్‌లో ఉంటాయి. ఆ ఫైల్స్ ఎప్పటికీ అవసరం లేదంటే ట్రాష్ ఫోల్డర్ కూడా ఖాళీ చేయొచ్చు.
Malware Apps: అలర్ట్... ఈ 3 యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్ నుంచి వెంటనే డిలిట్ చేయండి
ఫైల్స్ బై గూగుల్ యాప్ మాత్రమే కాదు... స్మార్ట్‌ఫోన్‌లో డిఫాల్ట్‌గా వచ్చే స్టోరేజ్ యాప్‌లో, ఇతర స్టోరేజ్ యాప్స్‌లో ట్రాష్ ఫైల్స్ క్లీన్ చేసే ఫీచర్ ఉంటుంది. ఈ ఫీచర్‌ను తరచూ ఉపయోగిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు చెత్తంతా డిలిట్ చేయొచ్చు. ఇక మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ సెక్షన్ ఓసారి చెక్ చేయాలి. ఏవైనా ఫైల్స్ అవసరం అయిప్పుడు డౌన్‌లోడ్ చేస్తే అవి డౌన్‌లోడ్ సెక్షన్‌లో ఉంటాయి. ఆ ఫైల్స్ ఓసారి చెక్ చేసి డిలిట్ చేస్తే స్టోరేజ్ ఖాళీ అవుతుంది.
మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ ఎక్కువగా ఉన్నాయా? అయితే అవసరం లేని యాప్స్ డిలిట్ చేసి స్టోరేజ్ పెంచుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ యాప్ ద్వారా ఒకేసారి అవసరం లేని యాప్స్ అన్నీ అన్‌ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఎలాగో ఈ స్టెప్స్ ద్వారా తెలుసుకోండి.
Moto Days Sale: మోటోరోలా డిస్కౌంట్ సేల్... రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు
Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లేస్టోర్ యాప్ ఓపెన్ చేయాలి.
Step 2- ఆ తర్వాత మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయాలి.
Step 3- Manage apps and device పైన క్లిక్ చేయాలి.
Step 4- ఆ తర్వాత Manage పైన క్లిక్ చేయాలి.
Step 5- ఎన్ని యాప్స్ ఇన్‌స్టాల్ చేశారో లిస్ట్ కనిపిస్తుంది.
Step 6- సైజ్‌ని బట్టి లేదా మీరు ఉపయోగించే తీరును బట్టి యాప్స్ సెలెక్ట్ చేయొచ్చు.
Step 7- యాప్స్ సెలెక్ట్ చేసిన తర్వాత డిలిట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే చాలు. యాప్స్ డిలిట్ అయిపోతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile News, Mobiles, Smartphone