Apple : ఆపిల్ మూఢ నమ్మకాలను నమ్ముతోందా..? ఐఫోన్-13 ఈ నెల 14వ తేదీ విడుదలకు కారణం అదేనా..? నెట్టింట్లో రచ్చ

I phone 13

Apple i Phone 13: మొబైల్ రంగంలోకి తిరుగులేని శక్తిగా ఎదిగిన ఆపిల్ సంస్థకు మూ ఢ నమ్మకాలు ఉన్నాయా..? అందుకే ఐఫోన్ 13ను.. రేపు అంటే 13వ తేదీన కాకుండా.. 14న మార్కెట్లోకి విడుదల చేస్తోంది..? ఏది నిజం

 • Share this:
  iPhone–13:కోట్ల మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐఫోన్ –13 సిరీస్ ఫోన్ (I phone-13) మార్కెట్లోకి వచ్చేస్తోంది. ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ సంస్థ ఆపిల్ నెక్ట్స్ జ‌న‌రేష‌న్(Next Generation) ఐఫోన్ 13 సిరీస్‌కు సంబంధించి ప్రీఆర్డ‌ర్(Pre-order) బుకింగ్‌ను సెప్టెంబ‌ర్ 14, 2021న ప్రారంభం కానుంది. ఈ కొత్త సిరీస్(New Series) ఐఫోన్‌12 మాదిరిగానే కూడా ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ వంటి మోడ‌ల్స్ వస్తున్నాయి. ఈ మొబైల్ కోసం గాడ్జెట్ ప్రేమికులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నెల 14న కాలిఫోర్నియా (California) వేదికగా ఈ మొబైల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ ఫోన్ కోసం ప్రపంచ వ్యక్తంగా ఉన్న ఐ ఫోన్ లవర్స్ కళ్లలో వత్తులేసుకొని కూర్చున్నారు. ఇక ఈ మొబైల్ రిలీజ్ వేడుకను ఆపిల్ సంస్థ ప్రత్యేక్ష ప్రసారం చేయనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇదిలా ఉంటే ఆపిల్ సంస్థ మూఢనమ్మకాలను నమ్ముతోందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు కారణం ఏంటంటే.. ఐఫోన్ -13 సిరీస్ ను సెప్టెంబర్ 13న రిలీజ్ చేయకుండా.. 14న చేయడంతోనే వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు #iPhone14 పేరిట ట్విట్టర్ లో హాష్ టాగ్ ట్రెండ్ చేస్తున్నారు. సాధారణంగా అనేక పాశ్చాత్యదేశాల్లో 13 నంబర్ ని దురదృష్టసంఖ్యగా భావిస్తారు. ఇది ఆయా దేశాల ప్రజల్లో మూఢనమ్మకంగా పడిపోయింది. 13 సంఖ్యతో కొన్ని దేశాల్లో హోటల్ రూమ్స్ కూడా ఉండవు. బిల్డింగ్ లో 13 ఫ్లోర్ ఉంటే ఆ నంబర్ ఎత్తేస్తారు.. 12 తర్వాత డైరెక్ట్ 14 నంబర్ పెడతారు. కొన్ని విమాన సంస్థలు 13వ నంబర్ ను పూర్తిగా తీసేస్తాయి. విమానం సీరియల్ నంబర్ లోకాని.. లోపల సీట్లలో కానీ 13 నంబర్ ఉండనివ్వరు.

  ఇప్పుడు ఆపిల్ సంస్థ కూడా ఇదే ఫాలో అవుతుందంటూ నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఈ మూఢనమ్మకాన్ని నమ్ముతోంది కాబట్టే ఆపిల్ సెప్టెంబర్ 13న ఐఫోన్ –13ని రిలీజ్ చేయడం లేదని నెటిజన్లు అంటున్నారు. http://  ఐఫోన్‌-13 నంబర్‌ సిరీస్‌ మొబైల్‌ కొన్నవారిపై, ఆపిల్‌ కంపెనీ దుష్ప్రభావాలు చూపుతోందని ట్విటర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఆపిల్ కంపెనీ మాత్రం మూఢనమ్మకాలను నమ్మడం లేదని చెబుతోంది. నమ్మితే ఐఫోన్ – 13 సిరీస్ ఎలా తీసుకొస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కావాలనే కొందరు ఐఫోన్ -13 సిరీస్ పై దృష్ప్రచారం చేస్తున్నారని ఆపిల్ కి సపోర్ట్ చేసే నెటిజన్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 2010లో ఆపిల్ తన ఐఫోన్ – 4 సిరీస్ ను విడుదల చేసింది. http://  4 నంబర్ ను ఆసియాలోని కొన్ని దేశాలు డెత్ నంబర్ గా చూస్తాయి. అయినా అటువంటివేమీ పట్టించుకోకుండా 4 సిరీస్ విడుదల చేసింది. ఈ సిరీస్ విడుదలైన గంటల్లోనే మొత్తం ఫోన్లు అమ్ముడుపోయాయి. దీనిని బట్టి చూస్తే ఆపిల్ సంస్థ మూఢనమ్మకాలకు దూరంగా ఉంటుందని చెప్పొచ్చని ఆపిల్ అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు..

  ఇదీ చదవండి: తొలివారమే బిగ్ బాస్ 5 తెలుగు హౌస్ నుంచి సరయు ఔట్

  ఈ కొత్త మోడ‌ల్ ఫోన్‌లు వేగ‌వంత‌మైన 5జీ క‌నెక్టివిటీ(Connectivity) ఉంటుంద‌ని, వైఫై 6ఈ, రెండ నూత‌న క‌ల‌ర్ ఆప్ష‌న్‌లు(Options) ఉండ‌వ‌చ్చిన ప్ర‌చారం సాగుతోంది. వైర్లెస్ ఛార్జింగ్, వీడియో కోసం పోర్ట్రెయిట్ మోడ్ మరియు ఆటో ఫోకస్‌తో పాటు వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ సారి యాపిల్‌ 90 మిలియ‌న్ ఆపిల్ ఫోన్‌ల‌ను త‌యారీ చేసేలా ల‌క్ష్యాన్ని ఎంచుకొన్న‌ట్టు స‌మాచారం ఇది గ‌తంలో స‌ర‌ఫ‌రా చ‌సిన 75మిలియ‌న్ ఫోన్‌ల క‌న్నా 20శాతం అధిక‌మైన ల‌క్ష్యంతో ప్ర‌ణాళిక చేస్తోంది. సెప్టెంబ‌ర్ మూడో వారంలో ఐఫోన్ 13 మార్కెట్‌(Market)లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.
  Published by:Nagesh Paina
  First published: