IS THE IPHONE LOW ON STORAGE HOWEVER INCREASE STORAGE WITH THESE TIPS FULL DETAILS HERE GH VB
IPhone Storage Problem: ఐఫోన్లో స్టోరేజ్ తక్కువగా ఉందా..? అయితే ఈ టిప్స్‌తో స్టోరేజ్‌ను పెంచుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
యాపిల్ మొబైళ్లు వాడేవారందరిదీ ఒకటే కంప్లెయింట్. అదే స్టోరేజ్ ప్రాబ్లమ్. ఐఫోన్ యూజర్లు స్టోరేజ్‌ను ఎలా మ్యానేజ్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. స్టోరేజీ బాగా తక్కువగా ఉంటే కొన్ని టెక్నిక్స్ ట్రై చేయొచ్చు. అవేంటంటే..
యాపిల్ మొబైళ్లు(Mobiles) వాడేవారందరిదీ ఒకటే కంప్లెయింట్. అదే స్టోరేజ్ ప్రాబ్లమ్. ఐఫోన్ యూజర్లు స్టోరేజ్‌ను ఎలా మ్యానేజ్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఐఫోన్లో స్టోరేజీకి సంబధించిన వివరాలు తెలుసుకునేందుకు ‘సిస్టమ్ డేటా’ అని ఫీచర్ అందుబాటులో ఉంది. ముందుగా డివైజ్(Devise) సెట్టింగ్‌లో ‘జనరల్(General)’ ఆప్షన్ క్లిక్ చేసి, డ్రాప్‌డౌన్ మెనులో ‘ఐఫోన్ స్టోరేజ్(iPhone Storage)’ క్లిక్ చేసి గ్రాఫిక్స్ స్ర్కీన్‌పై స్టోరేజీ ఇంకా ఎంతుందో తెలుసుకోవచ్చు. స్టోరేజీ బాగా తక్కువగా ఉంటే కొన్ని టెక్నిక్స్(Technics) ట్రై చేయొచ్చు. అవేంటంటే.. ఐఫోన్ యూజర్లు స్టోరేజ్(Users Storage) నిండినప్పుడు కీలకమైన ఫైల్స్‌ను(Files) డిలీట్(Delete) చేయాల్సి వస్తుంది. అయితే మీ ఇంపార్టెంట్ ఫైల్స్ డిలీట్ చేయకుండానే కొంత స్టోరేజ్‌ను పొందొచ్చు. దానికోసం మీ యాపిల్ మొబైల్లో(Apple Mobile) ఎక్కువ స్టోరేజ్ ఏ యాప్(App) తీసుకుంటుందో తెలుసుకోవాలి. ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటున్న యాప్‌లో అనవసరంగా ఉన్న ఫైల్స్‌ను డిలీట్ చేయాలి.
ఉదాహరణకు వాట్సాప్ ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటున్నట్టయితే.. వాట్సాప్ మీడియాలో ఉన్న పెద్ద ఫైల్స్‌ను డిలీట్ లేదా క్లౌడ్‌లో అప్లోడ్ చేయడం లాంటివి చేయొచ్చు. ఐఫోన్లో స్టోరేజ్ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయడం కోసం ఎప్పటికప్పుడు మీ ఫొటోలు, వీడియోలను క్లౌడ్ స్టోరేజ్‌కు ట్రాన్స్ఫర్ చేయాలి. అలాగే క్లౌడ్‌లో అవసరం లేని ఫైల్స్‌ను కూడా క్లియర్ చేయాలి. ఇలా చేయడం ద్వారా కొంతవరకూ స్పేస్‌ను సేవ్ చేయొచ్చు. యాపిల్ క్లౌడ్‌లో 5 జీబీ స్టోరేజ్ వరకూ ఉచితంగా లభిస్తుంది. ఆపైన నెలకు రూ .75 చెల్లిస్తే.. అదనపు స్టోరేజ్ ఆప్షన్స్‌ను పొందొచ్చు
ఇకపోతే ముందుగా మీ డివైజ్ సెట్టింగ్‌లో ఇంటర్నెట్ బ్రౌజర్ సఫారీలో ఆప్షన్స్ మెను ఓపెన్ చేసి హిస్టరీ, క్యాచీ క్లియర్ చేసుకోవాలి. అలాగే మెసేజ్ ఆప్షన్స్‌లో కీప్ మెసేజ్‌లోకి వెళ్లి, మెసేజ్‌లు ఎంత కాలానికి స్టోర్ చేయాలనుకుంటున్నారో.. టైం పీరియడ్ ఇవ్వాలి. తద్వారా పాత మెసేజ్‌లు ఎప్పటికప్పుడు ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుంటాయి. ఫలితంగా కొంత స్టోరేజీ ఎప్పటికప్పుడు ఫ్రీ అవుతూ ఉంటుంది.
మొబైల్లో కొన్ని అనవసరమైన యాప్స్ వల్ల ఎక్కువ స్టోరేజ్ వేస్ట్ అవుతూ ఉంటుంది. అందుకే అంతగా వాడని యాప్స్‌ను డిలీట్ చేసేయండి. అలాగే సోషల్ మీడియా యాప్స్ కూడా మీడియా, చాట్స్ రూపంలో చాలా స్టోరేజ్‌ను వాడుకుంటాయి. అందుకే సోషల్ మీడియా యాప్స్ క్యాచీని కూడా ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండాలి. మొబైల్లో మరింత స్టోరేజ్ సేవ్ చేయాలనుకుంటే.. సోషల్ మీడియా యాప్స్‌ను అన్ఇన్ స్టాల్ చేసి.. వాటి లింక్స్‌ను హోమ్ స్క్రీన్‌పై ఉంచుకోవాలి. యాప్స్ వాడే బదులు డైరెక్ట్‌గా సైట్స్ యూజ్ చేయడం ద్వారా చాలా స్టోరేజ్ సేవ్ అవుతుంది.
వాట్సప్ నుంచి లేదా మెయిల్స్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ముఖ్యమైన ఫొటోలు, ఫైళ్లు, డాక్యుమెంట్ల వంటివన్నీ మొబైల్ ఫోల్డర్స్‌లో కాకుండా ఇతర డివైజ్ లేదా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్‌లో సేవ్ చేసుకోవడం ద్వారా ఫైల్స్ భద్రంగా ఉంటాయి. అలాగే మొబైల్లో స్టోరేజ్ కూడా సేవ్ అవుతుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.