మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నారా? మీ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌కు వైఫై వాడుతున్నారా? ఒకేసారి ఎన్ని డివైజ్‌లనైనా ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేసేందుకు వైఫై ఉపయోగపడుతుంది. ఇందుకోసం రౌటర్ ఉంటే చాలు. లేకపోతే కేబుల్ ద్వారా ఒక డివైజ్‌కు మాత్రమే ఇంటర్నెట్ లభిస్తుంది. వైఫై రౌటర్ ఉంటే ఎన్ని డివైజ్‌లనైనా కనెక్ట్ చేయొచ్చు. అయితే ఎవరు వైఫై ఆన్ చేసినా తమ పరిధిలో ఉన్న వైఫై నెట్వర్క్స్ అన్నీ కనిపిస్తాయి. పాస్‌వర్డ్ లేకపోతే ఎవరైనా వైఫైని కనెక్ట్ చేసి ఇంటర్నెట్ ఉపయోగించొచ్చు. వైఫైకి పాస్‌వర్డ్ పెట్టినా హ్యాక్ చేసే అవకాశాలున్నాయి. మీ ఇంటర్నెట్ స్లోగా ఉన్నట్టైతే మీ వైఫై కనెక్షన్‌ని ఇతరులు వాడుతున్నారని అర్థం చేసుకోవచ్చు. మరి ఇతరులు మీ వైఫై వాడుతున్నారో లేదో కనిపెట్టడానికి ఈ టిప్స్ ఫాలో అవండి.
Realme X7 Max 5G: రూ.26,999 విలువైన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.9,999 ధరకే కొనండి ఇలా
Paytm Cashback: పేటీఎం కొత్త ఆఫర్... కరెంట్ బిల్ కడితే క్యాష్‌బ్యాక్
మీ ఇంటర్నెట్ స్లో అయినట్టైతే ముందుగా మీ వైఫైకి కనెక్ట్ అయిన డివైజ్‌లను అన్నింటినీ ఆఫ్ చేయండి. అంటే స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌టీవీ, స్మార్ట్‌స్పీకర్స్‌ని వైఫై నుంచి డిస్‌కనెక్ట్ చేయండి. ఆ తర్వాత మీ రౌటర్ చెక్ చేయండి. అన్ని డివైజ్‌లు ఆఫ్ చేసిన తర్వాత కూడా రౌటర్‌లో గ్రీన్ లైట్ ఫ్లాష్ అవుతున్నట్టైతే ఎవరో మీ వైఫైని ఉపయోగిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇక మరో వైఫై రౌటర్‌కు ఎన్ని డివైజ్‌లు కనెక్ట్ అయ్యాయో తెలుసుకోవడానికి మరో టెక్నిక్ ఉంది. ఇందుకోసం మీ రౌటర్ ఐపీ అడ్రస్ టైప్ చేయాలి. మీరు విండోస్ యూజర్ అయితే కమాండ్ ఓపెన్ చేసి ipconfig టైప్ చేయాలి. Default Gateway దగ్గర మీ రౌటర్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇంటర్నెట్ బ్రౌజర్‌లో ఐపీ అడ్రస్ టైప్ చేయాలి. యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఆ తర్వాత ఎన్ని డివైజ్‌లు కనెక్ట్ అయ్యాయో తెలుసుకోవచ్చు. మీకు సంబంధం లేని డివైజ్‌లు ఉంటే డిస్‌కనెక్ట్ చేయొచ్చు. మీ వైఫైని ప్రొటెక్ట్ చేయడానికి స్ట్రాంగ్ పాస్‌వర్డ్ పెట్టుకోవాలి. లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ పాస్‌వర్డ్‌లో ఉంటాలి. మీ పేరు, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీని పాస్‌వర్డ్‌గా పెట్టకూడదు. మీ పాస్‌వర్డ్‌ని ఆరు నెలలకు ఓసారి మారుస్తూ ఉండాలి.
WhatsApp: కొత్త ఫీచర్ టెస్ట్ చేస్తున్న వాట్సప్... ఇక 90 రోజుల వరకు
WhatsApp Messages: ఇంపార్టెంట్ వాట్సప్ మెసేజ్ వచ్చిందా? ఇలా సేవ్ చేయండి
ఇక మీకు పబ్లిక్ వైఫై వాడే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త. పబ్లిక్ వైఫై వాడితే మీ బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్స్ లాంటివి హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే మీ ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్ ఆటోమెటిక్‌గా వైఫై నెట్వర్క్స్‌కి కనెక్ట్ కాకుండా జాగ్రత్త పడాలి. మీరు విండోస్ 10 యూజర్ అయితే టాస్క్‌బార్‌లో వైఫై ఐకాన్ క్లిక్ చేయాలి. Connect Automatically ఆప్షన్ అన్‌టిక్ చేయాలి. ఆ తర్వాత Start క్లిక్ చేసి Control Panel క్లిక్ చేసి Network and Internet క్లిక్ చేసి Network and Sharing Centre ఓపెన్ చేయాలి. Change Adapter Settings ఓపెన్ చేయాలి. ఇప్పటికే కనెక్ట్ అయి ఉన్న వైఫై కనెక్షన్స్ అన్నీ తొలగించాలి. Wireless Properties సెలెక్ట్ చేసి Connect automatically when this network is in range అన్‌టిక్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.