WhatsApp chat: ప్రముఖ ఇన్స్టాంట్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp), యూజర్లను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు అప్డేడ్లను అందిస్తోంది. ఈ యాప్‌కు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు ఉన్నారు. ఎక్కువ మంది వినియోగిస్తున్న మేసేజింగ్ యాప్‌గా గుర్తింపు పొందింది. మరోపక్క స్కామర్లు (Scammers), హ్యాకర్లు (Hackers) వాట్సాప్ యూజర్ల సమాచారాన్ని హ్యాక్ చేయడానికి ఎప్పటికప్పుడు కొత్త తరహాలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను ఉపయోగిస్తోంది. యూజర్ల వివరాల ప్రైవసీపై మరింత శ్రద్ధ తీసుకుంటోంది. అయితే హ్యాకర్స్/స్కామర్స్ ఇప్పటికీ యూజర్ల సమాచారాన్ని హ్యాక్ చేసేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. అయితే వాట్సాప్ చాట్లను గుర్తు తెలియని వ్యక్తులు చదువుతున్న అనుమానంగా ఉంటే? ఏలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
* వాట్సాప్ లింక్
మీ వాట్సాప్ చాట్‌ను ఎవరైనా చదువుతున్నారని భావిస్తే.. చెక్ చేసుకోవడానికి కంపెనీ అందించే ఫంక్షన్‌ను ఉపయోగించాలి. WhatsApp లింక్ ఫంక్షన్ అనేది అడిషనల్ డివైజ్‌లలో WhatsApp యాక్సెస్‌కు అనుమతిస్తుంది. ప్రాథమిక WhatsApp చాట్లను చదవడానికి యూజర్లు దీన్ని ఉపయోగించవచ్చు. స్కామర్లు తమ ప్రయోజనం కోసం దీన్ని ఇటీవల ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. WhatsApp లింక్ ఫంక్షన్‌ను ఉపయోగించడం ద్వారా స్కామర్స్‌కు యూజర్ చాట్ యాక్సెస్ లభిస్తుంది.
Weak Password: మీ అకౌంట్ పాస్వర్డ్ ఇదేనా? అయితే చిక్కుల్లో పడ్డట్టే
*స్కామర్స్ చాట్‌ను ఎలా చదువుతారంటే?
వాట్సాప్ యూజర్ల ప్రైవేట్ చాట్లను చదవడానికి హాకర్స్ వాట్సాప్ లింక్ ఉపయోగించవచ్చు. ఇది చాలా సాధారణమైన పద్ధతి. దీన్ని తెలుసుకోవాలంటే.. యూజర్ ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయాలి. టాప్ లెఫ్ట్ కార్నర్లో కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.
ఇక్కడ లింక్డ్ డివైజస్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. WhatsApp అకౌంట్‌కు కనెక్ట్ అయిన డివైజ్ గురించి అక్కడ సమాచారం తెలుస్తుంది. ఇందులో అన్ ఐడెంటిఫైడ్ బ్రౌజర్ లేదా డివైజ్‌ను కనిపిస్తే.. వెంటనే రిమూవ్ చేయాలి.
వాట్సాప్‌కు లింక్ అయి ఉన్న అన్ ఐడెంటిఫైడ్ డివైజెస్‌ను రిమూవ్ చేయడానికి, కంప్యూటర్ లేదా బ్రౌజర్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం డిలీట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఎక్కువ ప్రొటెక్షన్ కావాలంటే, వాట్సాప్‌ను లాక్‌లో ఉంచడానికి బిల్ట్-ఇన్ యాప్ లాక్‌ను ఉపయోగించవచ్చు. అదనంగా టూ-ఫ్యాక్టర్స్ సెక్యూరిటీ కోడ్లను ఉపయోగించవచ్చు.
వాట్సాప్ కొత్తగా మరికొన్ని ఫీచర్లను ఇటీవల లాంచ్ చేసింది. కమ్యూనిటీస్, ఇన్-చాట్ పోల్స్, వీడియో కాల్స్, గ్రూప్ మెంబర్స్ లిమిట్ పెంపు వంటి ఫీచర్లను పరిచయం చేసింది. ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు ఈ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. వేర్వేరు గ్రూపులను ఒకే గొడుగుకు కిందికి తెచ్చుకునేలా కమ్యూనిటీస్ ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. మొత్తం కమ్యూనిటీకి అప్డేట్లను పంపడం, రిసీవ్ చేసుకోవడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. గ్రూప్‌లను ఆర్గనైజ్ చేయడం ఈ ఫీచర్‌తో మరింత సులభతరం అవుతుంది. అంతే కాకుండా ఎంతోకాలంగా టెస్ట్ చేస్తున్న ఇన్-చాట్స్ పోల్స్ ఫీచర్‌ను వాట్సాప్ ఎట్టకేలకు లాంచ్ చేసింది. ఇన్-చాట్ పోల్ ఫీచర్ ద్వారా ఏదైనా ప్రశ్నను క్రియేట్ చేసి చాట్‌లో సెండ్ చేయవచ్చు. ముఖ్యంగా గ్రూప్‌లలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Technology, Whatsapp, Whatsapp tricks