WhatsApp Tricks: వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారా? ఇలా తెలుసుకోండి

WhatsApp Tricks: వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారా? ఇలా తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Tricks | వాట్సప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారని అనుమానంగా ఉందా? ఈ టెక్నిక్స్‌తో (WhatsApp Tricks) సులువుగా తెలుసుకోవచ్చు.

  • Share this:
    వాట్సప్... ఎవరికైనా క్షణాల్లో మెసేజ్ పంపడానికి ఉపయోగపడే ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ వాట్సప్‌ని (WhatsApp) ఉపయోగిస్తుంటారు. కొన్ని ఫీచర్ ఫోన్లలో కూడా వాట్సప్ ఉపయోగించుకోవచ్చు. వాట్సప్‌లో ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్స్ వస్తుంటాయి. యూజర్ల ప్రైవసీ (WhatsApp Privacy), సెక్యూరిటీని (WhatsApp Security) దృష్టిలో పెట్టుకొని వాట్సప్ అనేక ఫీచర్స్‌ని అందించింది. మరిన్ని ఫీచర్స్‌ని (WhatsApp Features) టెస్ట్ చేస్తోంది. వాట్సప్‌లో ఎవరి నుంచైనా మెసేజెస్ స్వీకరించకూడదని మీరు అనుకుంటే ఆ కాంటాక్ట్‌ని బ్లాక్ చేయొచ్చు. ఈ ఫీచర్‌ను వాట్సప్ అందిస్తోంది.

    వాట్సప్‌లో మీరు ఎవరినైనా బ్లాక్ చేస్తే అవతలివాళ్లు తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అలాగే మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేసినా తెలుసుకోవచ్చు. ప్రైవసీ కారణాల వల్ల బ్లాక్ చేసినవారి వివరాలను వాట్సప్ వెల్లడించదు. కానీ కొన్ని టెక్నిక్స్‌తో ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవచ్చు. మరి ఆ టెక్నిక్స్ ఏంటో మీరూ తెలుసుకోండి.

    JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ లాంఛింగ్‌పై క్లారిటీ ఇచ్చిన జియో... రిలీజ్ ఎప్పుడంటే

    మిమ్మల్ని వాట్సప్‌లో ఎవరైనా బ్లాక్ చేస్తే వారి ఛాట్ విండోలో వారి లాస్ట్ సీన్, ఆన్‌లైన్ స్టేటస్ కనిపించదు. ఎవరైనా బ్లాక్ చేస్తే సులువుగా తెలుసుకోవడానికి ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. అయితే ఒకవేళ అవతలివాళ్లు లాస్ట్ సీన్ సెట్టింగ్స్ మారిస్తే లాస్ట్ సీన్ కనిపించదు. కానీ ఆన్‌లైన్ స్టేటస్ కూడా కనిపించట్లేదంటే అవతలివాళ్లు మిమ్మల్ని బ్లాక్ చేసినట్టే.

    మిమ్మల్ని బ్లాక్ చేసినవాళ్లు తమ ప్రొఫైల్ ఫోటో అప్‌డేట్ చేస్తే లేటెస్ట్ ప్రొఫైల్ ఫోటో మీకు కనిపించదు. పాత ప్రొఫైల్ ఫోటో మాత్రమే కనిపిస్తుంది. అంటే మీరు గతంలో ఛాటింగ్ చేసిన సమయంలో ఉన్న ఫోటో మాత్రమే కనిపిస్తుంది.

    Realme X7 Max 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ.6,000 తగ్గింపు... తొలిసారి భారీ డిస్కౌంట్

    మీరు పంపిన మెసేజ్‌కు సింగిల్ టిక్‌మార్క్ మాత్రమే ఉంటే సదరు వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. ఆ మెసేజ్ వారికి వెళ్లదు. మెసేజ్ డెలివర్ కాదు కాబట్టు రెండు టిక్స్ కనిపించదవు. మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడానికి ఈ టెక్నిక్ కూడా పనిచేస్తుంది.

    మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి వాట్సప్‌లో కాల్స్ చేయడం సాధ్యం కాదు. మీరు కాల్ చేయడానికి ట్రై చేసినా కాల్ కనెక్ట్ కాదు. వారిని ఏదైనా వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేయడం కూడా కుదరదు.

    అయితే పైన చెప్పినట్టుగా వాట్సప్‌లో కనిపించినంత మాత్రానా మిమ్మల్ని బ్లాక్ చేసినట్టు కాదు. ఒక్కోసారి అవతలి వ్యక్తి ప్రైవసీ సెట్టింగ్స్ మార్చినా, నెట్వర్క్ సరిగ్గా లేకపోయినా పైన చెప్పినట్టుగానే జరుగుతుంది. కాబట్టి అవతలి వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేసినట్టు నిర్ధారించుకోవద్దు.
    Published by:Santhosh Kumar S
    First published: