WhatsApp Groups: మీకు చెప్పకుండా వాట్సప్ గ్రూప్స్‌లో యాడ్ చేస్తున్నారా? ఈ సెట్టింగ్స్‌తో బ్రేక్ వేయండి

WhatsApp Groups: వాట్సప్ గ్రూప్స్‌లో మిమ్మల్ని యాడ్ చేస్తున్నారా? ఈ సెట్టింగ్స్‌తో బ్రేక్ వేయండి (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Groups | మీకు చెప్పకుండా, మీ అనుమతి తీసుకోకుండా ఎవరైనా మిమ్మల్ని వాట్సప్ గ్రూప్స్‌లో యాడ్ చేస్తున్నారా? అయితే వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చండి.

  • Share this:
    ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సప్ ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఎన్నింటినో యూజర్లకు అందిస్తోంది. అందులో వాట్సప్ గ్రూప్స్ అద్భుతమైన ఫీచర్. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ఆఫీస్ కొలీగ్స్, పూర్వ విద్యార్థులు... ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో గ్రూప్ ఉంటుంది. అందరూ రెగ్యులర్‌గా టచ్‌లో ఉండేందుకు ఈ గ్రూప్స్ ఉపయోగపడుతుంటాయి. అయితే ఈ గ్రూప్స్ కొన్ని సందర్భాల్లో యూజర్లకు తలనొప్పిగా మారుతుంటాయి. ఎవరంటే వాళ్లు గ్రూప్స్‌లో యాడ్ చేస్తూ ఉంటారు. పర్మిషన్ తీసుకోకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా గ్రూప్స్‌లో యాడ్ చేస్తుంటారు. ఒక్కసారి యాడ్ చేసిన తర్వాత ఆ గ్రూప్‌లోంచి ఎగ్జిట్ కావడానికి ఆలోచించాల్సిన పరిస్థితి. మొహమాటం అడ్డొస్తుంది. ఎగ్జిట్ అయితే ఏం అనుకుంటారోనని ఆలోచిస్తారు. ఇలాంటి పరిస్థితి ప్రతీ ఒక్కరికీ మామూలే.

    మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఉంది. వాట్సప్‌లో సెట్టింగ్స్ మారిస్తే చాలు. మీ అనుమతి లేకుండా, మీకు తెలియకుండా ఎవరూ మిమ్మల్ని వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేయడం సాధ్యం కాదు. మరి ఆ సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకోండి.

    Vodafone Idea: ఈ వొడాఫోన్ ఐడియా-Vi ప్లాన్స్‌పై 5జీబీ డేటా ఎక్స్‌ట్రా

    WhatsApp to Telegram: వాట్సప్ ఛాట్స్‌ని టెలిగ్రామ్‌లోకి 30 సెకండ్లలో ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా

    ముందుగా మీ వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి.
    రైట్ టాప్ కార్నర్‌లో త్రీడాట్స్ పైన క్లిక్ చేయండి.
    ఆ తర్వాత Settings ఓపెన్ చేయండి.
    ఆ తర్వాత Account పైన క్లిక్ చేయండి.
    ఆ తర్వాత Privacy పైన క్లిక్ చేయండి.
    అందులో మీకు Groups అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి.
    అందులో మీకు Everyone, My Contacts, My contacts except, Nobody అనే ఆప్షన్స్ ఉంటాయి.
    మీరు Everyone సెలెక్ట్ చేస్తే ఎవరైనా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయొచ్చు.
    My Contacts సెలెక్ట్ చేస్తే మీ కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లు మాత్రమే మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయొచ్చు.
    ఇక My contacts except సెలెక్ట్ చేస్తే మీ కాంటాక్ట్స్‌లో కొందరు మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయకుండా అడ్డుకోవచ్చు. అందుకోసం కాంటాక్ట్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
    ఇక చివరగా Nobody ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మిమ్మల్ని గ్రూప్‌లో ఎవరూ యాడ్ చేయలేరు.

    Realme X7 5G: రిలీజ్‌కు ముందే లీకైన ధరలు... రియల్‌మీ ఎక్స్7 5జీ ప్రైస్ ఇదే

    Poco M2: నిమిషానికి 5 ఫోన్లు కొనేస్తున్నారు... ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏంటంటే

    మరి ఏదైనా గ్రూప్‌లో మీరు చేరాలనుకుంటే ఎలా? ఇదేమీ పెద్ద సమస్య కాదు. మీరు ఏ గ్రూప్‌లో చేరాలనుకుంటున్నారో ఆ గ్రూప్‌ అడ్మిన్‌కు మీ నెంబర్ యాడ్ చేయమని చెప్పండి. మీకు గ్రూప్ ఇన్విటేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్ మూడు రోజుల పాటు యాక్టీవ్‌లో ఉంటుంది. మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఆ గ్రూప్‌లో యాడ్ అవుతారు. ఒకవేళ మీకు తెలియకుండా మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేసేందుకు ఎవరైనా ప్రయత్నించినా ఇలాగే గ్రూప్ ఇన్విటేషన్ లింక్ వస్తుంది. మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ కావద్దనుకుంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఆ లింక్‌ను అలాగే వదిలేయాలి. మూడు రోజుల్లో లింక్ ఎక్స్‌పైర్ అవుతుంది.
    Published by:Santhosh Kumar S
    First published: