Home /News /technology /

IS ONEPLUS BRINGING A FOLDABLE SMARTPHONE THE COMPANYS CEO HAS TEASED A HINGE DESIGN ON HIS TWITTER GH SRD

OnePlus: వన్‌ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ తీసుకువస్తోందా..? లేటెస్ట్ అప్ డేట్ ఇదే..!

Photo Credit : (Twitter/ Pete Lau)

Photo Credit : (Twitter/ Pete Lau)

OnePlus: వన్‌ప్లస్ కంపెనీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ తీసువస్తుందా..?. లేటెస్ట్ గా ఆ కంపెనీ CEO పీట్ లా (Pete Lau) చేసిన ఒక ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
శామ్‌సంగ్, ఒప్పో, నోకియా, మోటొరోలా వంటి మొబైల్ కంపెనీలు ఇప్పటికే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ పరిచయం చేశాయి. ఇప్పుడు వన్‌ప్లస్ (OnePlus) కూడా అదే బాట పట్టనుంది. ఈ కంపెనీ ప్రస్తుతం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు కంపెనీ CEO పీట్ లా (Pete Lau) చేసిన ఒక ట్వీట్ నిదర్శనంగా నిలుస్తోంది. రీసెంట్‌గా పీట్ తన ట్విట్టర్‌లో రెండు ఫొటోలు షేర్ చేశారు. ఆ ఫొటోలు ఫోల్డబుల్ డిస్‌ప్లే మధ్యలో అమర్చే మడతబందు కీలు/జాయింట్స్‌ లాగా కనిపించాయి. "ఇది ఏంటని మీరు అనుకుంటున్నారు?" అని ఒప్పో చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గానూ పనిచేస్తున్న పీట్ ట్వీట్‌లో ప్రశ్న వేశారు. తర్వాత చేసిన ట్వీట్‌లో తాను షేర్ చేసిన ఫొటోలు Oppo Find N కీలు (Hinge)/ జాయింట్స్ అని క్లారిటీ ఇచ్చారు. అలానే వన్‌ప్లస్ కమ్యూనిటీ ఫోరమ్‌లోని ఫోల్డబుల్స్ బ్లాగ్ పోస్ట్‌కి లింక్ ఇచ్చారు. దాంతో కంపెనీ ఫోల్డబుల్ ఫోన్స్ తయారీపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

వన్‌ప్లస్ కంపెనీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటన లేదా క్లియర్ హింట్ అనేది రాలేదు. కాకపోతే వన్‌ప్లస్ సీఈఓ అప్‌కమింగ్ ఫోల్డబుల్ ఫోన్ కాని ఫోల్డబుల్ ఫోన్‌ పార్ట్స్ షేర్ చేశారు. ఇది గతేడాది ఎప్పుడో లాంచ్ అయిన ఫోన్. మళ్లీ ఈ పోస్ట్‌కి "ఫోల్డబుల్ నెక్స్ట్ జనరేషన్స్ నుంచి మీకు ఏమి కావాలి?" అనే ఒక వన్‌ప్లస్ ఫోరమ్‌ లింక్‌ను షేర్ చేశారు.

వీటన్నిటిని బట్టి చూస్తుంటే కంపెనీ ఫోల్డబుల్ ఫోన్స్ తీసుకురావాలనే ఆలోచన చేస్తుందని సీఈఓ ఓ హింట్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఒప్పో ఫైండ్ N ఫోన్ చిన్న ఔటర్ డిస్‌ప్లే, వైడ్ ఫోల్డింగ్ డిస్‌ప్లేతో లాంచ్ అయిన మొదటి ఫోల్డబుల్. అయితే వన్‌ప్లస్ తన తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను Oppo Find N రీబ్రాండెడ్ వెర్షన్‌గా రిలీజ్ చేయవచ్చని గతంలో టెక్‌ రిపోర్ట్స్ పేర్కొన్నాయి. కంపెనీ ఇలానే చేస్తుందా? అనేదానిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.



బ్లాగ్ పోస్ట్‌లో వన్‌ప్లస్ సమస్యలను, ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియజేస్తుంది. ఫోల్డబుల్స్ గురించి వారు ఏమనుకుంటున్నారో వ్యాఖ్యానించమని కూడా ప్రజలను కంపెనీ కోరుతోంది. ముందుగా చెప్పుకున్నట్లు ఇవేవీ వన్‌ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను వస్తుందని కచ్చితంగా చెప్పడానికి లేదు. కానీ లేటెస్ట్ ట్వీట్స్ చూస్తుంటే OnePlus దాని సొంత ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేయడానికి Oppo Find N నుంచి నైపుణ్యం, ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోందని తెలుస్తోంది.

పీట్ తన లేటెస్ట్ ట్వీట్‌లో షేర్ చేసిన వన్‌ప్లస్ బ్లాగ్ పోస్ట్‌లో ఒక ట్రై-ఫోల్డింగ్ డివైజ్ ఫొటో/రెండర్ కనిపించింది. అయితే గతేడాదిలో వన్‌ప్లస్ ఇలాంటి ట్రై-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ కోసం పేటెంట్‌ను దాఖలు చేసింది. దీనిని రెండుసార్లు మడత పెట్టడం సాధ్యమవుతుంది. కంపెనీ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 3 లాంచ్‌కు ముందు కూడా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను టీజ్ చేసింది.

ఇది కూడా చదవండి : మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవారి వాట్సాప్ స్టేటస్‌ను సీక్రెట్‌ గా ఎలా చూడాలి..? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..

వన్‌ప్లస్ USA అధికారిక ట్విట్టర్ అకౌంట్ ఒక ట్వీట్‌లో, వన్‌ప్లస్ డిస్ప్లేలో స్టార్రి యానిమేషన్‌తో ఫోల్డబుల్ లాంటి డివైజ్ చూపించే చిన్న వీడియో క్లిప్‌ను షేర్ చేసింది. కానీ ఇప్పటివరకు వీటిలో ఈ ఫోన్‌కి సంబంధించిన అప్‌డేట్స్ అందించలేదు. శాంసంగ్ ఫోల్డబుల్ లాంచ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసిన ఈ పని ఫోల్డబుల్ విభాగంలో వన్‌ప్లస్ ఆసక్తి చూపిస్తోందని చెప్పకనే చెప్పింది.
Published by:Sridhar Reddy
First published:

Tags: ONE PLUS, Smart phones, Tech news

తదుపరి వార్తలు