Ludo King: ఇండియాలో లూడో కింగ్‌ యాప్‌ను బ్యాన్ చేశారా?

Ludo King | మీరు లాక్‌డౌన్ టైమ్‌లో లూడో కింగ్‌తో టైంపాస్ చేశారా? ఇప్పుడు లూడో కింగ్ వార్తల్లోకి వచ్చింది. ఎందుకో తెలుసుకోండి.

news18-telugu
Updated: September 3, 2020, 12:47 PM IST
Ludo King: ఇండియాలో లూడో కింగ్‌ యాప్‌ను బ్యాన్ చేశారా?
Ludo King: ఇండియాలో లూడో కింగ్‌ యాప్‌ను బ్యాన్ చేశారా?
  • Share this:
భారత ప్రభుత్వం పబ్‌జీ సహా 118 చైనీస్ మొబైల్ యాప్స్‌ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. పబ్‌జీతో పాటు ఇతర చైనీస్ యాప్స్‌ని బ్యాన్ చేశారన్న వార్తలు గేమింగ్ లవర్స్‌ను కలవరపర్చింది. అంతేకాదు... ఈ 118 యాప్స్ జాబితాలో లూడో కింగ్ కూడా ఉందా అన్న అనుమానాలు లూడో కింగ్ లవర్స్‌లో వచ్చాయి. అంతే... నిజమేంటో తెలుసుకునేందుకు గూగుల్‌లో వెతికారు. Is Ludo Banned అని గూగుల్‌లో సెర్చ్ చేశారు. గూగుల్‌లో పబ్‌జీ వివరాల కోసం ఎంత వెతికారో లూడో కింగ్ గురించీ అంతే సెర్చ్ చేశారు. అసలు విషయం ఏంటంటే భారత ప్రభుత్వం 118 చైనా యాప్స్‌పై నిషేధం విధించింది. అందులో పాపులర్ ఆన్‌లైన్ మల్టీప్లేయర్ గేమ్ అయిన పబ్‌జీ మొబైల్ కూడా ఉంది. తూర్పు లడఖ్‌లో సరిహద్దులో చైనాతో ఘర్షణ తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చైనాతో సంబంధం ఉన్న యాప్స్‌పై భారత ప్రభుత్వం నిషేధం విధించడం ఇది మూడోసారి.

PUBG Alternatives: పబ్‌జీపై నిషేధం... ఈ 5 గేమ్స్ ట్రై చేయొచ్చు

Redmi Note 9: కాసేపట్లో రెడ్‌మీ నోట్ 9 సేల్... డిస్కౌంట్ పొందండి ఇలా

ludo banned, ludo king banned, ludo banned in india, india banned apps list, apps banned in india list, ludo king ban in india, is ludo banned, ludo king banned in india, is ludo banned in india, ludo ban india, 118 apps ban, 118 apps banned, made in china, who owns ludo king, లూడో కింగ్ బ్యాన్, లూడో కింగ్ యాప్
Google Trends


కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన 118 యాప్స్ జాబితాలో Ludo అనే పేరు చూసి లూడో కింగ్ లవర్స్ షాకయ్యారు. అయితే ఆ జాబితాలో Ludo World-Ludo Superstar, Ludo All Star- Play Online Ludo Game & Board Games యాప్స్ ఉన్నాయి. ఆ లిస్ట్‌లో Ludo King లేదు. కరోనా వైరస్ లాక్‌కౌన్ సమయంలో లూడో కింగ్ యాప్ బాగా పాపులర్ అయింది. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం నిషేధించిన యాప్స్‌లో లూడో కింగ్ లేదు. లూడో కింగ్ యాప్ Gametion Technologies Pvt Ltd పేరుతో ఉన్న భారతీయ కంపెనీ రూపొందించిన యాప్. ఇది మేడ్ ఇన్ ఇండియా యాప్.
Published by: Santhosh Kumar S
First published: September 3, 2020, 12:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading