హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: వాట్సప్‌లో లాస్ట్ సీన్ టైమ్ అసలైనదేనా? ఇందులో తప్పులను ఎలా గుర్తించాలి?

WhatsApp: వాట్సప్‌లో లాస్ట్ సీన్ టైమ్ అసలైనదేనా? ఇందులో తప్పులను ఎలా గుర్తించాలి?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Last Seen | వాట్సప్‌లో లాస్ట్ సీన్ టైమ్ తప్పుగా చూపిస్తుందా? అయితే మీ స్మార్ట్‌ఫోన్‌లో (Smartphone) ఉన్న సమస్యే ఇందుకు కారణం. వాట్సప్‌లో లాస్ట్ సీన్ టైమ్ తప్పుగా చూపిస్తే ఏం చేయాలో తెలుసుకోండి.

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్ (Smartphone) యూజర్లు వినియోగిస్తున్న మెసేజింగ్ అప్లికేషన్‌లో వాట్సప్ (WhatsApp) ముందుంటుంది. వాట్సాప్ యూజర్ల కోసం ఆఫర్ చేసే ఫీచర్లు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. అవతలి వ్యక్తి ఆన్‌లైన్‌లో ఉన్నారా? ఏ సమయంలో ఆన్‌లైన్‌లోకి వచ్చి వెళ్లారు? ఏ టైంలో మెసేజ్‌లు చూశారు? ఏ టైంలో మెసేజ్‌లు పంపించారు.. ఇలా ఒకటేంటి అన్ని వివరాలనూ యూజర్లకు అందిస్తుంది వాట్సాప్. అయితే వాట్సాప్ చూపిస్తున్న లాస్ట్ సీన్ (Last Seen) టైం ఒక్కోసారి తప్పు అయ్యుండొచ్చు. వాట్సాప్ మెసేజ్‌ల్లో కింద టైంస్టాంప్స్ కనిపిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఈ టైంస్టాంప్స్ కూడా ఒక్కోసారి తప్పుగా నమోదవుతాయట. మరి వాట్సాప్ ఇలా కచ్చితమైన టైంస్టాంప్స్ కు బదులు రాంగ్ టైంస్టాంప్స్ ఎందుకు చూపిస్తుంది? ఈ సరికాని టైంస్టాంప్స్ సమస్యలను ఎలా పరిష్కరించాలి? వంటి విషయాలు తెలుసుకుందాం. వాట్సాప్ సింపుల్ చాట్ ఫార్మాట్ లో ఉంటుంది. ఇందులోని చాట్ దిగువన ఉన్న లేటెస్ట్ మెసేజ్‌లు టైం తో సహా కనిపిస్తాయి. ప్రతి టెక్స్ట్ మెసేజ్ బాక్స్ లో ఈ టైం అనేది కచ్చితంగా కనిపిస్తుంది. అంతే కాకుండా లాస్ట్ సీన్ టైం వాట్సాప్ చూపిస్తూ ఉంటుంది. ఇది సెండర్, రిసీవర్ ఇద్దరికీ చాలా కీలకంగా ఉంటుంది.

Redmi Note 11T 5G: రూ.15,000 లోపు మరో 5జీ స్మార్ట్‌ఫోన్... రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ప్రత్యేకతలు ఇవే

అలాంటి ఈ టైం ని వాట్సాప్ తప్పుగా చూపిస్తే యూజర్లు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మీ మొబైల్లో టైం జోన్ కాన్ఫిగరేషన్, టైం సెట్(Time) కరెక్ట్ గా లేకపోతే.. వాట్సాప్ టైంస్టాంప్స్ ను తప్పుగా చూపిస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా టైం కరెక్ట్ గా సెట్ చేసుకోవాలని వాట్సాప్ తన యూజర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉంటుంది. మీ ఫోన్ లో టైం తప్పుగా ఉంటే, వాట్సాప్ లాస్ట్ సీన్, లాస్ట్ మెసేజ్ టైం స్టాంప్స్ తప్పుగానే నమోదయ్యే అవకాశం ఉంది.

యూజర్లు తమ మొబైల్ లోని డేట్, టైం ని ఆటోమేటిక్ గా లేదా నెట్‌వర్క్‌కి సెట్ చేయమని వాట్సాప్ సూచిస్తుంది. నెట్‌వర్క్‌ సెట్టింగ్ ఎనేబుల్ చేయడం ద్వారా.. మీ మొబైల్ ప్రొవైడర్ మీ ఫోన్‌ను సరైన సమయానికి సెట్ చేస్తుంది. ఈ సెట్టింగ్ ఎనేబుల్ చేసినప్పుడు కూడా టైం తప్పుగా కనిపిస్తే, మీ నెట్‌వర్క్‌లో సమస్య ఉండవచ్చు. అలాంటప్పుడు, మీరు మీ నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను సంప్రదించాలి. లేదంటే మీరు డేట్, టైంని మాన్యువల్‌గా సెట్ చేయవచ్చు. టైమ్ జోన్ సెలక్ట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇది మీ మొబైల్ ఫోన్ టైంను పూర్తిగా మార్చేయగలదు. అందుకే సెట్టింగ్‌ల్లో సరైన టైం జోన్ సెలెక్ట్ చేసుకోవాలి.

Flipkart Black Friday Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్... ఈ 10 రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు

ఒకవేళ మీ ఫోన్ లో టైం జోన్ మీ ప్రాంతానికి భిన్నంగా ఉంటే.. మీరు టైం జోన్‌ని మాన్యువల్‌గా కాన్ఫిగర్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ లో సెట్టింగ్స్‌లో సిస్టమ్‌లో డేట్ & టైంలోకి వెళ్లండి. ఐఫోన్ లో సెట్టింగ్స్‌లో జనరల్‌లో డేట్ & టైంలోకి వెళ్లండి. వాట్సాప్ యూజర్లు ఫాల్స్ లొకేషన్(false location) వల్ల కూడా సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ లొకేషన్లను కూడా సరిచేసుకుంటే సరిపోతుంది.

First published:

Tags: Smartphone, Whatsapp, Whatsapp tricks

ఉత్తమ కథలు