గూగుల్ క్రోమ్(Google Chrome), మొజిల్లా ఫైర్‌ఫాక్స్(Mozilla Firefox) వంటి ఇంటర్నెట్ బ్రౌజర్ల(Internet Browser) ద్వారా మనం వేగంగా వెబ్‌సైట్లను యాక్సెస్ చేయవచ్చు. అయితే ఇందుకు ఈ బ్రౌజర్లు యూజర్ నేమ్స్, పాస్‌వర్డ్స్ స్టోర్ చేస్తుంటాయి. కొన్నిసార్లు ఈ వివరాలను సైబర్ నేరగాళ్లు(Cyber) చేజిక్కించుకుంటే.. యూజర్ ప్రమాదంలో పడినట్లే. ఈ నేపథ్యంలో వెబ్ బ్రౌజర్లలో(Web Browsers) లాగిన్ వివరాలు స్టోర్ చేయడం ఎంతవరకు సురక్షితమనే వివరాలు తెలుసుకుందాం. పాస్‌వర్డ్(Password) చికాకు లేకుండా ఉండేందుకు లాగిన్(Login) వివరాలను గూగూల్(Google), ఇతర ప్లాట్‌ఫాంలు తమ సర్వర్లలో మీ లాగిన్ వివరాలు నిక్షిప్తం చేస్తాయి. ఈ సందర్భంలో మీ యూజర్ నేమ్(User Name), పాస్‌వర్డ్‌ను ఒక సీక్రెట్ కీతో క్రోమ్ ఎన్‌క్రిప్ట్ (Encrypt) చేస్తుందని, అది కేవలం మీ డివైజ్‌కు మాత్రమే తెలుస్తుందని గూగుల్ చెబుతోంది. గూగుల్ సర్వర్లలో డేటా స్టోర్(Data Store) కావడానికి ముందే ఇది జరుగుతుంది కాబట్టి గూగుల్ సహ ఇతరులెవరికి మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ తెలిసే అవకాశం లేదు.
గూగుల్ అకౌంట్‌లోని పాస్‌వర్డ్ మేనేజర్ సెక్షన్ చూస్తే.. మీ ఐడీ లేదా పాస్‌వర్డ్‌తో దాన్ని యాక్సెస్ చేయలేరనే విషయం అర్థమవుతుంది. ముందు మీ Gmail అకౌంట్ పాస్‌వర్డ్ ఎంటర్ చేయమంటుంది, ఆ తర్వాత మాత్రమే మీరు మీ వివరాలు పరిశీలించగలుగుతారు.
మీ పాస్‌వర్డ్‌ను మీరు లేదా ఏదైనా బ్రౌజర్ యాక్సెస్ చేస్తే, దీని గురించి గూగుల్ మీకు ఎటువంటి అలర్ట్ పంపించదు. కానీ అన్ని పాస్‌వర్డ్స్‌కు ఒకేసారి యాక్సెస్ దొరకదు. మీ Facebook యూజర్ నేమ్, పాస్‌వర్డ్ చెక్ చేయాలనుకుంటే, ఈ విభాగంలో Gmail పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మీరు మీ లాగిన్ వివరాలు చెక్ చేయగలుగుతారు. ఇది మంచి విధానమే అయినప్పటికీ ప్రత్యేకమైన అలర్ట్స్ రావు. ఫైర్‌ఫాక్స్ వంటి బ్రౌజర్లు ఇలాంటి విధానాన్ని పాటించవు.
ఐడీ, పాస్‌వర్డ్ కాపాడుకునేందుకు సెక్యూరిటీ PIN ఏర్పాటు చేసుకునే సౌలభ్యం కూడా లేదు. మీ డేటా సురక్షితమని ఫైర్‌ఫాక్స్ చెబుతున్నాఅది అంత సురక్షితమేమీ కాదు. ఎవరైనా సరే మీ ల్యాప్‌టాప్‌ను సులభంగా ఒపెన్ చేయవచ్చు లేదా హ్యాక్ చేసి Settings > Privacy & Security > Logins & passwords నుంచి సునాయాసంగా మీ లాగిన్ వివరాలు తీసుకోవచ్చు.
ఏది ఏమైనా క్రోమ్ సహ ఏ బ్రౌజర్‌లోనూ లాగిన్ వివరాలు సేవ్ చేయడం అంత సురక్షితం కాదు. Gmail అకౌంట్ హ్యాక్ అయితే సదరు వ్యక్తి మీ అకౌంట్‌లోకి సులభంగా లాగిన్ అవ్వొచ్చు. మీరు ఒకసారి ఒక కొత్త డివైజ్ ద్వారా Gmail అకౌంట్‌లోకి లాగిన్ అయితే.. ప్లే స్టోర్, క్రోమ్ లేదా గూగుల్ ఫొటోస్ లేదా డ్రైవ్‌లోకి లాగిన్ అవాల్సిన అవసరం ఉండదు. అంటే Gmail మెయిల్ ద్వారా లాగిన్ అయి ప్రతి విభాగాన్ని సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
మరి ఏం చేయవచ్చు?
ఫేస్‌బుక్, ఔట్‌లుక్, బ్యాంక్, ఇతర అకౌంట్ పాస్‌వర్డ్స్ గూగుల్‌లో సేవ్ అయి ఉంటే వెంటనే వాటిని తొలగించండి. అనేక బ్యాంకులు టూ-స్టెప్ వెరిఫికేషన్ సిస్టమ్‌తో పాటు కొన్ని సెక్యూరిటీ ప్రొటోకాల్స్ పాటిస్తాయి కాబట్టి వాటిని క్రాక్ చేయడం హ్యాకర్లకు కొంత కష్టమే. అంత ముఖ్యమైనవి కావని భావించే అకౌంట్లు లేదా సైట్స్‌కు సంబంధించిన పాస్‌వర్డ్స్ మేనేజర్ లిస్ట్‌లో ఉంచుకోవచ్చు. అందుకే టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) ఎనేబుల్ చేసి ఉంచాలని నిపుణులు చెబుతారు. ఇలా చేస్తే మీరు మీ ప్రైమరీ పాస్‌వర్డ్ మాత్రమే కాదు సెకండరీ పాస్‌వర్డ్ PIN లేదా OTP కూడా ఎంటర్ చేస్తేనే లాగ్ ఇన్ అవగలుగుతారు. అలా అని ఈ 2FA పూర్తి సురక్షితమేమి కాదు. Man-in-the-Middle (MITM) వంటి పిషింగ్ టూల్‌కిట్స్ ద్వారా దాన్ని చేధించగవచ్చని స్టోనీబ్రూక్ యూనివర్సిటీ, సైబర్ సెక్యూరిటీ సంస్థ పాలో ఆల్టో నెట్‌వర్క్స్ గుర్తించాయి.
వీటి విషయంలో ఏం చేయలేకపోయినా కొన్ని ప్రాథమిక విషయాలు పాటించడం ద్వారా కొంత వరకు సురక్షితంగా ఉండవచ్చు. మీకున్న ప్రతీ అకౌంట్‌కు 2FA ఎనేబుల్ చేసుకోవాలి, అలాగే ప్రతీ నెల పాస్‌వర్డ్స్ మార్చాలి. పాస్‌వర్డ్స్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలి, రెండో పాస్‌వర్డ్స్ లేదా PIN కోడ్స్ ఉండాలి. మీ గూగుల్ అకౌంట్‌కు 2FA ఉంచుకోవడం ముఖ్యం, అలాగే ఆ అకౌంటుకు ఒక రీకవరీ ఈమెయిల్ అకౌంట్ కూడా చేర్చాలి. ఒకవేళ మీ అకౌంట్ హ్యాక్ అయితే, మీరు వెంటనే సెకండరీ జీమెయిల్ అకౌంట్ ద్వారా దాన్ని రీకవర్ చేయవచ్చు.
క్రోమ్ నుంచి పాస్‌వర్డ్స్ తొలగించడం ఎలా?
మీ బ్రౌజర్‌లో Google Password Manager అని టైప్ చేయండి. అప్పుడు మీకు పై భాగంలో గూగుల్ అధికారిక సైటు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి, క్రోమ్ తన సర్వర్లలో నిక్షిప్తం చేసిన అకౌంట్ లేదా సైటుకు సంబంధించి మీరు తొలగించాలనుకున్నదాన్ని సెలక్ట్ చేయండి. ఆ తర్వాత Gmail పాస్‌వర్డ్ ఎంటర్ చేయమని క్రోమ్ చెప్తుంది. పాస్‌వర్డ్ ఎంటర్ చేసి మీరు వాటిని డిలీట్ చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.