ఫోన్ నంబర్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా? సింపుల్ ట్రిక్

WhatsApp Tricks : వాట్సాప్ వాడకంపై ఇప్పటికే మనం చాలా ట్రిక్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మరొకటి తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: March 4, 2019, 8:51 AM IST
ఫోన్ నంబర్ లేకుండా వాట్సాప్ వాడటం ఎలా? సింపుల్ ట్రిక్
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: March 4, 2019, 8:51 AM IST
ఫేస్‌బుక్ సంస్థకు చెందిన వాట్సాప్ వాడాలంటే మనకు కచ్చితంగా ఫోన్ నంబర్ అవసరం. వాట్సాప్ ఇన్స్‌స్టాలేషన్ సమయంలో తప్పనిసరిగా ఫోన్ నంబర్ అవసరం అవుతుంది. ఆ తర్వాత చేసే చాటింగ్‌లు, షేరింగ్‌లూ అన్నింటికీ మొబైల్ నంబర్ తప్పనిసరి అని మనం అనుకుంటూ ఉంటాం. అది నిజం కాదు. మొబైల్ నంబర్ లేకపోయినా వాట్సాప్‌ని రన్ చెయ్యవచ్చు. అందుకు వాట్సాప్ స్వయంగా ఒప్పుకోకపోయినా... థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఈ పని జరుగుతోంది. కొంతమందికి తమ వివరాలు వాట్సాప్ మేనేజ్‌మెంట్‌కి తెలియడం నచ్చదు. తాము చేసే చాటింగ్ వివరాల్ని మొబైల్ నంబర్ ద్వారా వాట్సాప్ మేనేజ్‌మెంట్ తెలుసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ల కోసం ఓ యాప్ తయారైంది. అదెలా వాడాలో తెలుసుకుందాం.

ఇలా చెయ్యండి :
* ముందుగా మీ మొబైల్‌లో వాట్సాప్ ఉంటే దాన్ని అన్ ఇన్‌స్టాల్ (Uninstall) చెయ్యండి.

* ఇప్పుడు ప్లే స్టోర్ నుంచీ వాట్సాప్‌ని డౌన్‌లోడ్ చెయ్యండి.
* ఇప్పుడు మొబైల్‌లో ఫ్లైట్ మోడ్ (Flight Mode) ఆన్ చెయ్యండి.


* Spoof Text Message యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుంచీ డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చెయ్యండి.
* ఇప్పుడు వాట్సాప్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ మొదలుపెట్టండి.
Loading...
* ఇప్పుడు వాట్సాప్ మిమ్మల్ని ఇంటర్నెట్ ద్వారా వెరిఫై చెయ్యలేదు. అందువల్ల ప్రత్యామ్నాయంగా SMS విధానం ఎంచుకోమని చెబుతుంది.
* అప్పుడు మీరు SMS మెథడ్ (check through sms) ఎంచుకోండి. మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చెయ్యండి.
* ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెంటనే cancelపై క్లిక్ చెయ్యండి. ఫలితంగా ఆథరైజేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది.
* ఇప్పుడు spoof messaging appని ఓపెన్ చెయ్యండి. కింది వివరాలు ఎంటర్ చెయ్యండి.

To: +447900347295
From: +(Country code) (mobile number)
Message: Your email address

తద్వారా మీ బదులు అది వాట్సాప్‌ని వెరిఫై చేస్తుంది. ఆ తర్వాత మీరు వాట్సాప్‌ని వాడుకోవచ్చు. అందువల్ల మీరు ఏ మొబైల్ నంబర్ నుంచీ వాట్సాప్ వాడుతున్నారో ఎవరికీ తెలియదు.

 

ఇవి కూడా చదవండి :

యూట్యూబ్‌ వీడియోలో కొంత భాగమే డౌన్‌లోడ్ చెయ్యాలా... సింపుల్ ట్రిక్

వాట్సాప్ స్టేటస్ వీడియోలు, ఫొటోలూ డౌన్‌లోడ్ చెయ్యడం ఎలా?

యూట్యూబ్‌ లో సైన్ ఇన్ అవ్వకుండా ఆ వీడియోలు చూడటం ఎలా... ఇలా చెయ్యండి

వాట్సాప్ సీక్రెట్ ట్రిక్... అవతలి వాళ్లకు తెలియకుండా వాళ్ల స్టేటస్ చూడటం ఎలా?
First published: March 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...