మీరు ఎక్కడున్నా మిమ్మల్ని గూగుల్ ట్రాక్ చేస్తుందా? అనే ప్రశ్నలపై పోలింగ్ నిర్వహిస్తే.. విభిన్న రకాల సమాధానాలు వినిపిస్తాయి. గత కొన్నేళ్లుగా ప్రజల గోప్యత విషయంలో న్యాయవాదులు, కమ్యూనిటీలు ఈ అంశంపై బలంగా వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో యూజర్ ప్రైవసీ విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థల్లో ఒకటైన గూగుల్.. వినియోగదారుల సమాచార భద్రతపై చేస్తున్న ప్రయత్నాల గురించి వివరించింది. ఫేస్ బుక్, గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలు విస్తృతమైన రీతిలో కస్టమర్ల సమాచారాన్ని సేకరిస్తున్నాయి. అయితే యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీ కోసం గూగుల్ ఎన్నో కంట్రోల్స్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్ల టోగుల్, థర్డ్ పార్టీ గూగుల్ ట్రాకింగ్, ఫెడరేటెట్ లెర్నింగ్ ఆఫ్ కోహార్ట్స్ (FLoC) లాంటి కంట్రోల్స్‌ను ప్రవేశపెట్టింది.
అయితే మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం చూస్తున్న గూగుల్.. ప్రైవసీ కమ్యూనిటీల పరంగా కొన్ని ఎదురుదెబ్బలు ఎదుర్కొంటోంది. గూగుల్ అతిపెద్ద యాంటీ కాంపీటిషన్ దర్యాప్తు పెండింగులో ఉన్నందున తరచూ ఉత్పన్నమవుతున్న ప్రశ్నల జాబితాను ఈ సంస్థ ప్రచురించింది. అంతేకాకుండా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెల్లడించింది. అవేంటో చూద్దాం.
Mi Watch Revolve: రూ.15,999 విలువైన స్మార్ట్ వాచ్ రూ.999 ధరకే... ఫ్లాష్ సేల్ ఎప్పుడంటే
Nokia G20: నోకియా జీ20 సేల్ మొదలైంది... డిస్కౌంట్ వివరాలు ఇవే
గూగుల్ అసిస్టెంట్ ప్రతి విషయాన్ని రికార్డు చేయదు. ఎందుకంటే ఇది యాక్టివ్ అయ్యేంత వరకు స్టాండ్ బై మోడ్‌లో ఉంటుంది. మీరు 'హే గూగుల్', లేదా 'ఓకే గూగుల్' అని చెప్పేంత వరకు స్టాండ్ బై మోడ్‌లో ఉంటుంది. దీని యాక్టివ్ ను గుర్తించడానికి ఆడియో చిన్న స్నిప్పెట్లను(కొన్ని సెకన్ల వ్యవధి ఉన్న ఆడియో) ప్రాసెస్ చేస్తుంది. యాక్టివ్‌ను కనుగొనకపోతే ఈ ఆడియో స్నిప్పెట్లు గూగుల్‌ను చేరలేవు లేదా వాటిని సంస్థ సేవ్ చేసుకోదు. యాక్టివ్‌ను కనుగొన్నప్పుడు మీ రిక్వెస్ట్ ను తీర్చడానికి గూగుల్ అసిస్టెంట్ స్టాండ్ బై మోడ్ నుంచి బయటకు వస్తుంది.
మీ వాయిస్‌ను ఉపయోగించి గూగుల్ అసిస్టెంట్ యాక్టివిటీని డిలీట్ చేయడం కూడా చాలా సులభం. 'హే గూగుల్ డిలీట్ దిస్ వీక్ యాక్టివిటీ' లేదా 'హే గూగుల్ డిలీట్ మై లాస్ట్ కన్వర్జేషన్' లాంటి పదాలు ఉపయోగించడం ద్వారా యాక్టివిటీని డిలీట్ చేసుకోవచ్చు. గూగుల్ ఉత్పత్తుల్లో యాక్టివిటీని రివ్యూ చేయడానికి, తొలగించడానికి మీరు ఈ పేజీని ఉపయోగించవచ్చు. గూగుల్ అసిస్టెంట్ గెస్ట్ మోడ్ ని కూడా యాక్టివ్ చేయవచ్చు. 'హే గూగుల్ గెస్ట్ మోడ్ ఆన్ చేయండి' అని చెప్పడం ద్వారా గూగుల్ అసిస్టెంట్ ఇంటరాక్షన్ వివరాలు మీ అకౌంట్లో సేవ్ కావు.
Mi 11 Ultra 5G: కాసేపట్లో ఎంఐ 11 అల్ట్రా సేల్... రూ.5000 డిస్కౌంట్ పొందండి ఇలా
Smartphone Tips: మీ పాత స్మార్ట్‌ఫోన్ అమ్ముతున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకోండి
గతంలో మీరు చేసిన సెర్చ్‌లు, సందర్శించిన వెబ్ సైట్లు, క్లిక్ చేసిన ప్రకటనల ఆధారంగా మీకు యాడ్స్ కనిపిస్తాయి. ఉదాహరణకు మీరు ఏదైనా కెమెరా యాడ్ ను చూసినట్లయితే గతంలో మీరు కెమెరాల గురించి శోధించి ఉండవచ్చు, వెబ్ సైట్లో ఫోటోలను సందర్శించి ఉండవచ్చు. 'వై దిస్ యాడ్' ఫీచర్ ద్వారా మీకు ఇచ్చిన ప్రకటన గురించి తెలుసుకోవచ్చు. ప్రకటనలు మీకు మరింత ఉపయోగకరంగా ఉండటానికి డేటా మీకు సహాయపడుతుంది. మీ ఈ-మెయిల్స్ లేదా డాక్యుమెంట్ల కంటెంట్ లేదా ఆరోగ్యం, జాతి, మతం, సెక్సువల్ ఓరియెంటేషన్ సమాచారాన్ని మీకు అనుకూలంగా మార్చడానికి ఉపయోగించవచ్చు. యాడ్ సెట్టింగ్స్ పేజీని సందర్శించి పర్సనలైజ్ యాడ్స్ పూర్తిగా నిలిపివేయవచ్చు.
కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఎవ్వరికీ విక్రయించమని, ముఖ్యంగా ప్రకటనదారులకు అందించమని గూగుల్ చెబుతోంది. ‘యాడ్స్ బెనిఫిట్స్ కోసం.. జీమెయిల్, క్యాలెండర్, డ్రైవ్, ఫొటోస్ లాంటి వాటిని స్టోర్ చేసే యాప్స్‌లో మీరు స్టోర్ చేసుకునే సమాచారాన్ని మేము ఉపయోగించం. మీతో పాటు ప్రతి ఒక్కరికి మా సేవలను మెరుగుపరచడానికి సమాచారాన్ని ఉపయోగిస్తాం. ఇలా చేయడానికి అనామక(anonymous) డేటా, సమగ్ర సమాచారాన్ని ఉపయోగిస్తాం’ అని గూగుల్ తెలిపింది.
Oppo Reno 6 5G: అదిరిపోయే ఫీచర్స్‌తో ఒప్పో రెనో 6, రెనో 6 ప్రో 5జీ స్మార్ట్ఫోన్లు వచ్చేశాయి
Google: ఈ సెట్టింగ్స్ మారిస్తే మీ గూగుల్ అకౌంట్ సేఫ్... వెంటనే మార్చండి ఇలా
‘మీకు ప్రకటనలు చూపించడానికి మేము మీ జీమెయిల్ మెస్సేజ్‌లను చదవం, స్కాన్ చేయం. వాస్తవానికి మీ వ్యక్తిగత కంటెంట్ స్టోర్ చేయడానికి రూపొందించిన జీమెయిల్, డ్రైవ్, ఫొటోస్ వంటి గూగుల్ ఉత్పత్తుల హోస్ట్ మాకు ఉంది. యాడ్స్ పంపడానికి ఈ కంటెంట్ ను ఎప్పటికీ ఉపయోగించం. మీరు మీ వ్యక్తిగత గూగుల్ ఖాతాను ఉపయోగించినప్పుడు, జీమెయిల్లో ప్రమోషన్లు లేదా సోషల్ ట్యాబ్ల్ లను తెరిచినప్పుడు.. మీకు అత్యంత ఉపయోగకరమైన, సంబంధిత ఎంచుకున్న ప్రకటనలే చూస్తారు. జీమెయిల్లోని పర్సనలైజ్డ్ యాడ్స్ పూర్తిగా ఆటోమేటెడ్ గా ఉంటాయి. జీమెయిల్లో మీరు చూసిన ప్రకటనలు మీ గూగుల్ ఖాతాతో లింక్ చేసిన డేటాపై ఆధారపడి ఉంటాయి’ అని సంస్థ తెలిపింది. గూగుల్ సర్వీసుల్లో మీ యాక్టివిటీలు మీ జీమెయిల్ ప్రకటనలను ప్రభావితం చేస్తాయి. మీకిష్టం లేకపోతే ఎప్పుడైనా మీరు మీ యాడ్ సెట్టింగ్స్ సర్దుబాటు చేసుకోవచ్చు.
మీరు ఒక ప్రదేశం నుంచి మరోక ప్రదేశానికి వెళ్లాలనుకున్నప్పుడు మీ చిరునామా లేదా లొకేషన్ గుర్తించడం కంటే మీరు ఎక్కడ ఉన్నారో మీ ఫోన్ మాకు చెప్పడం త్వరగా జరుగుతుంది. ట్రాఫిక్ ఎంత బిజీగా ఉందో గుర్తించడంలో లొకేషన్ సమాచారం మాకు ఎంతో సహాయపడుతుంది. లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేసినట్లయితే ఆ సమాచారాన్ని అనామక బిట్స్ రూపంలో ఫోన్ గూగుల్ కు తిరిగి పంపుతుంది. ట్రాఫిక్ నమూనాలను గుర్తించడానికి ఇది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల డేటాతో కలిపి ఉంటుంది. అయితే లొకేషన్ ఆన్ చేసిన వారికి మాత్రమే ఇలా జరుగుతుంది. లేకుంటే అప్రమేయంగా ఆఫ్ లో ఉంటుంది. ఒకవేళ మీరు మనస్సు మార్చుకొని లొకేషన్ ఆన్ చేసుకుంటే మ్యాప్స్ లో మీ సమాచారం కనిపిస్తుంది.
మీరు ఉపయోగించే గూగుల్ సర్వీసులు, మీ ఖాతాలో సేవ్ చేసిన డేటా సారాంశాన్ని మీ గూగుల్ డ్యాష్ బోర్డు నుంచి చూడవచ్చు. యాక్టివిటీ కంట్రోల్స్, యాడ్ సెట్టింగ్స్ లాంటి ప్రైవసీ కంట్రోల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇవి గూగుల్ మీకు ఏ విధంగా బాగా పనిచేయగలదో నిర్ణయించడానికి డేటా ఆన్ లేదా ఆఫ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు ఉపయోగించే ప్రతి గూగుల్ సేవలోనూ మీ సమాచారం గురించి నేరుగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉదాహరణకు సెర్చ్ వివరాలు ట్రాక్ చేయకుండా, వాటిని డిలీట్ చేసుకోవచ్చు, సమీక్షించుకోవచ్చు.
‘ప్రైవసీ ఫీచర్లు, కంట్రోల్స్ లాంటి సేవలు.. మీ గోప్యత, భద్రతను నియంత్రించడం, సులభతరం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఈ విషయంపై కొన్ని అసాంఘిక కార్యకలాపాలు, బెదిరింపులు వస్తున్నాయి. అయితే వీలైనంత సురక్షితంగా ఉంచేందుకు మా సేవలు ద్వారా కృషి చేస్తున్నాం. మీ సమాచారాన్ని ఏ విధంగా సురక్షితంగా ఉంచుతున్నామో తెలుసుకోవడానికి గూగుల్ సేఫ్టీ సెంటర్ ను సందర్శించండి’ అని గూగుల్ బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Google Assistant, Google Drive, Google Maps, Google news, Google pay, Google search