Home /News /technology /

Google Maps: మీరు ఎక్కడికి వెళ్లినా గూగుల్ ట్రాక్ చేస్తోందా? సెట్టింగ్స్ ఇలా మార్చండి

Google Maps: మీరు ఎక్కడికి వెళ్లినా గూగుల్ ట్రాక్ చేస్తోందా? సెట్టింగ్స్ ఇలా మార్చండి

Google Maps: మీరు ఎక్కడికి వెళ్లినా గూగుల్ ట్రాక్ చేస్తోందా? సెట్టింగ్స్ ఇలా మార్చండి
(ప్రతీకాత్మక చిత్రం)

Google Maps: మీరు ఎక్కడికి వెళ్లినా గూగుల్ ట్రాక్ చేస్తోందా? సెట్టింగ్స్ ఇలా మార్చండి (ప్రతీకాత్మక చిత్రం)

Google Maps | గూగుల్ మ్యాప్స్ మిమ్మల్ని ట్రాక్ చేస్తోందని డౌట్‌గా ఉందా? గూగుల్ (Google) దగ్గర స్టోర్ అయిన మీ లొకేషన్ డేటాను (Location Data) ఎలా డిలిట్ చేయాలో తెలుసుకోండి.

    మీరు ఏదైనా హోటల్‌కు వెళ్లి, అక్కడ లంచ్ చేసి బయటకు రాగానే గూగుల్ మ్యాప్స్ (Google Maps) నుంచి ఓ నోటిఫికేషన్ వస్తుంది. ఆ హోటల్ గురించి రివ్యూ చేయమని, ఫోటోస్ అప్‌లోడ్ చేయమని ఆ నోటిఫికేషన్‌లో ఉంటంది. మరి మీరు ఆ హోటల్‌కు వెళ్లిన విషయం గూగుల్‌కు ఎలా తెలుసు. చాలా సింపుల్. గూగుల్ (Google) మిమ్మల్ని ట్రాక్ చేస్తోంది. అందుకే మీరు ఎక్కడికి వెళ్లినా ఆ లొకేషన్ డేటా (Location data) గూగుల్ దగ్గర స్టోర్ అయి ఉంటుంది. ఇలా గూగుల్ ట్రాక్ చేస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. గూగుల్ మ్యాప్స్ (Google Maps) పంపే నోటిఫికేషన్స్‌ని పెద్దగా పట్టించుకోరు. గూగుల్ ఇలా మీ లొకేషన్‌ని ట్రాక్ (Location Tracking) చేయడం మీ ప్రైవసీకి ఇబ్బందికరమే. మరి మీరు ఎక్కడికి వెళ్లినా గూగుల్ మ్యాప్స్ ట్రాక్ చేస్తోందా? గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని టిప్స్ పాటిస్తే చాలు.

    WhatsApp: యూజర్లకు షాక్... 30 లక్షల వాట్సాప్‌ అకౌంట్లు బ్యాన్‌... ఎందుకంటే

    Incognito Mode: మీ గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయండి. కుడివైపు టాప్ కార్నర్‌లో మీ ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'Turn on Incognito Mode' ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. అంతే... ఇక గూగుల్ మ్యాప్స్ మిమ్మల్ని ట్రాక్ చేయదు. ఇన్‌కాగ్నిటో మోడ్ క్లోజ్ చేయడానికి కూడా ఇవే స్టెప్స్ ఫాలో కావాలి.

    Location Timeline: గూగుల్ మ్యాప్స్‌లో మీ ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత 'Your Timeline' ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. మీ టైమ్‌లైన్ కనిపిస్తుంది. మీరు ఏ రోజున ఎక్కడెక్కడ తిరిగారో మొత్తం మ్యాప్‌లో కనిపిస్తుంది. అందులో మీరు ఏ రోజుకు సంబంధించిన లొకేషన్ డేటా డిలిట్ చేయాలనుకుంటే త్రీడాట్స్ క్లిక్ చేయాలి. అందులో Delete Day ఆప్షన్ ఉంటుంది. డిలిట్ చేస్తే చాలు. ఆ రోజుకు సంబంధించిన లొకేషన్ డేటా గూగుల్ దగ్గర ఉండదు.

    Samsung Galaxy M32 5G: కాసేపట్లో సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ సేల్... రూ.2,000 డిస్కౌంట్

    Location History: గూగుల్ మ్యాప్స్‌లో మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే సెట్టింగ్స్ కనిపిస్తాయి. సెట్టింగ్స్ క్లిక్ చేయాలి. 'Personal Content' పైన క్లిక్ చేయాలి. అందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. Location is on పైన క్లిక్ చేయాలి. మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. లొకేషన్ ఆఫ్ చేస్తే చాలు. ఇక గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేయదు. ఆ తర్వాత Location History is on ఆప్షన్ క్లిక్ చేయాలి. యాక్టివిటీ కంట్రోల్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ లొకేషన్ హిస్టరీ ఆటో డిలిట్ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

    Google Account: మీ గూగుల్ అకౌంట్‌లో లాగిన్ అయిన తర్వాత Data & Privacy పైన క్లిక్ చేయాలి. మీరు ఏఏ ప్రాంతాలకు వెళ్లారో అన్ని వివరాలు అక్కడ ఉంటాయి. Location History పైన క్లిక్ చేయాలి. అక్కడ్నుంచి మీ లొకేషన్ హిస్టరీ డిలిట్ చేయడంతో పాటు మిమ్మల్ని ట్రాక్ చేయకుండా డిసేబుల్ చేయొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Google, Google Maps

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు