Tik Tok : టిక్ టాక్‌కి పోటీగా... త్వరలో ఫేస్‌బుక్ యాప్?

Tik Tok : ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ ప్రభంజనం చూస్తున్నాం. టాలెంట్ ఉన్నవాళ్లంతా దాన్ని టిక్ టాక్ ద్వారా చాటుకుంటున్నారు. ఇది గమనించిన ఫేస్ బుక్ ఏం చేయబోతోంది?

Krishna Kumar N | news18-telugu
Updated: July 17, 2019, 10:02 AM IST
Tik Tok : టిక్ టాక్‌కి పోటీగా... త్వరలో ఫేస్‌బుక్ యాప్?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Facebook : ప్రపంచంలో ఎక్కువ మంది యూజర్లతో ఒకప్పుడు ఫేస్ బుక్కే ఓ ప్రభంజనం. తర్వాత వాట్సాప్ వచ్చి... ఫేస్ బుక్ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. దాంతో... వాట్సాప్‌ని కొనేసింది ఫేస్ బుక్. ఇప్పుడు టిక్ టాక్ వచ్చి... అటు ఫేస్ బుక్, ఇటు వాట్సాప్ రెండింటికీ గట్టి పోటీ ఇస్తోంది. దీనికి తోడు... హెలో, రోపోసో, షేర్ చాట్ లాంటివి కూడా వీడియోలతో నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు ఫేస్ బుక్‌ని దాదాపు మర్చిపోతున్నారు. వాట్సాప్ కూడా ఎప్పుడో ఓసారి అలా చూసి ఇలా క్లోజ్ చేస్తున్నారు. ఈ పోటీని తట్టుకోవాలంటే టిక్ టాక్ లాంటిదే ఓ యాప్ తేవాలని ఫేస్ ‌బుక్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. తాము సరికొత్త యాప్స్ తేబోతున్నట్లు గతవారం ఫేస్ బుక్ ప్రకటించింది. ఇందుకోసం ప్రత్యేకించి న్యూ ప్రొడక్ట్ ఎక్స్‌పెరిమెంటేషన్ (NPE) టీంని ఏర్పాటు చేసింది.

ఒకప్పుడు గూగుల్, తత్వాత ట్విట్టర్ వీడియో విభాగంలో పనిచేసిన టాఫ్ఫ్... ఇప్పుడు ఫేస్‌ బుక్‌లో చేరారు. ఆయనే సరికొత్త యాప్స్ తెచ్చే పనిలో ఉన్నారు. ఇందుకోసం UX డిజైనర్లను, ఇంజినీర్లను రిక్రూట్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టీ... టిక్ టాక్ లాంటి యాప్స్ తేబోతున్నట్లు అర్థమవుతోంది.




ఈ రోజుల్లో ప్రజలకు ఏది ఇష్టమో అది మాత్రమే చెయ్యాలంటున్న టాఫ్ఫ్... లేదంటే... యూజర్లు దూరం అవుతారని పరోక్షంగా ఫేస్ బుక్‌ని ఉద్దేశించి మాట్లాడారు. బీజింగ్‌కి చెందిన స్టార్టప్ కంపెనీ బైట్ డాన్స్... టిక్ టాక్‌ని తెచ్చింది. 2019లో హాఫ్ ఇయర్‌కి టిక్ టాక్‌లో యూజర్ల సంఖ్య 28 శాతం పెరిగింది. మొత్తంగా 34కోట్ల 40లక్షల మంది యూజర్లున్నారు. ఐతే... ఆమధ్య ఇండియాలో రెండు వారాల పాటూ టిక్ టాక్ పై బ్యాన్ విధించారు. అయినప్పటికీ... టిక్ టాక్ ప్రభంజనం మాత్రం ఆగలేదు. కోట్ల మంది డాన్సులు, పాటలు, రకరకాల టాలెంట్‌లను టిక్ టాక్ ద్వారా షార్ట్ వీడియాల్లో పంచుకుంటున్నారు. నెటిజన్లు కూడా ఆ వీడియోలను తెగ చూస్తున్నారు.
First published: July 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...