ChatGPT: గత ఏడాదిలో రిలీజ్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఇది లాంచ్ అయిన సమయం నుంచి ఉద్యోగాలు(Jobs) కోల్పోతామనే భయం సర్వత్రా వ్యక్తం అయింది. అయితే అసలు దీనివల్ల కొలువులు ఊడిపోతాయా అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు. ఒకవేళ జాబ్స్ పోతే ఏ రంగాలలో ఉద్యోగులు ప్రభావితమవుతారో కూడా ఎక్కువ మందికి ఐడియా లేదు. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ ఉద్యోగులను తగ్గిస్తుందా, ఏయే రంగాలలోని ఉద్యోగులకు ఎక్కువ ముప్పు ఉంది, ఉద్యోగుల తొలగింపులకు ఇది కారణమవుతుందా? అనే కామన్ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అమెరికన్ మ్యాగజైన్ ది అట్లాంటిక్ (The Atlantic) రిపోర్ట్ ప్రకారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) జాబ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా డిగ్రీ లేదా ఆపై ఉన్నత చదువులు చదివిన ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. అయితే, ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లతో చేసిన మరో సర్వే AIతో జాబ్ మార్కెట్ మారుతుందని, అయితే ఉద్యోగాల తొలగింపు పెద్దగా ఉండదని పేర్కొంది.
* చాట్‌జీపీటీ ఉద్యోగుల తొలగింపులకు కారణమవుతుందా..?
ResumeBuilder.com నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, యునైటెడ్ స్టేట్స్‌లోని దాదాపు 48% కంపెనీలు ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో చాట్‌జీపీటీని తీసుకొచ్చాయి. లేదా ఈ కంపెనీలు వారి పనిని ChatGPTతో భర్తీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి. సర్వే వ్యాపార నాయకులను వారి అభిప్రాయాన్ని కూడా కోరింది. వారిలో 9% మంది చాట్‌జీపీటీ కచ్చితంగా ఎక్కువ ఉద్యోగాల తొలగింపులకు దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే 19% మంది అధిక మంది ఉద్యోగుల తొలగింపులకు కారణమవ్వచ్చని సందేహం వ్యక్తం చేశారు.
* ఏ ఉద్యోగులకు రిస్క్ ఎక్కువ?
ఓపెన్ఏఐ, ఓపెన్ రీసెర్చ్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా చాట్‌జీపీటీ ద్వారా భర్తీ అయ్యే ప్రమాదం ఉన్న ఉద్యోగాలపై పరిశోధనలు చేశాయి. వాటి పరిశోధనలలో రచయితలు, అకౌంటెంట్లు, జర్నలిస్ట్‌ల వంటి ఇతర ఉద్యోగాల కంటే ఇంటర్‌ప్రెటర్లు, PR నిపుణులు, జంతు శాస్త్రవేత్తలు వంటి కొన్ని ఉద్యోగాలు ChatGPT ద్వారా భర్తీ చేయబడే అవకాశం తక్కువగా ఉందని కనుగొన్నాయి. అంటే రచయితలు, అకౌంటెంట్లు, జర్నలిస్టులు చాలా ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ISRO - Earth : భూమి ఎందుకు ఇలా ఉంది?.. ఇస్రో ఫొటోలు ఏం చెబుతున్నాయి?
* డేటా అనలిస్టుల పరిస్థితి ఏంటి?
చాట్‌జీపీటీ పెద్ద మొత్తంలో డేటాను చాలా తక్కువ సమయంలోనే ప్రాసెస్ చేయగలదు. దీనివల్ల అది డేటా అనలిస్టులను భర్తీ చేసే అవకాశం ఎక్కువ ఉంది. ResumeBuilder.com సర్వే ప్రకారం, చాట్‌జీపీటీ వల్ల ఉద్యోగాలు కోల్పోయే చాలా మంది వ్యక్తులు డేటా అనలిటిక్స్ విభాగంలోనే ఉన్నారు. ఫోర్బ్స్ కూడా చాట్‌జీపీటీ డేటాను ఆసక్తికరమైన రీతిలో ప్రదర్శించగలదని నివేదిస్తుంది. మొత్తం మీద ఈ చాట్‌బాట్ ఈ అంశంలో చాలా మంది మానవుల కంటే మెరుగైనదిగా ఉంటుంది.
* వెబ్ డెవలపర్స్ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమేనా
చాట్‌జీపీటీ కోడ్స్ రాయడం, వెబ్‌సైట్‌లు లేదా అప్లికేషన్లను అభివృద్ధి చేయడంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కనబరుస్తోంది. అయితే, నిపుణులు చాట్‌జీపీటీ ప్రస్తుత సామర్థ్యాలు పరిమితంగా ఉన్నాయని, ఇది ప్రాథమిక ప్రోగ్రామింగ్ పనులను మాత్రమే చేయగలదని విశ్వసిస్తున్నారు. టెక్నాలజీ కన్సల్టెంట్ Rob Zazueta ప్రకారం, చాట్‌జీపీటీ బ్యాంకింగ్ అప్లికేషన్లకు అవసరమైన సంక్లిష్ట కోడ్‌ను ఇంకా రాయలేకపోతోంది. అయితే, వచ్చే పదేళ్లలో చాట్‌జీపీటీ నైపుణ్యం, కోడింగ్‌లో ప్రావీణ్యం పొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Artificial intelligence, Chatgpt, JOBS