హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Iron Man-Style Jet Suit: ప్రత్యేక జెట్ సూట్ తయారు చేసిన బ్రిటన్ కంపెనీ.. డబ్బుంటే ఐరన్ మ్యాన్‌ అయిపోవచ్చు..

Iron Man-Style Jet Suit: ప్రత్యేక జెట్ సూట్ తయారు చేసిన బ్రిటన్ కంపెనీ.. డబ్బుంటే ఐరన్ మ్యాన్‌ అయిపోవచ్చు..

Iron Man-Style Jet Suit: ప్రత్యేక జెట్ సూట్ తయారు చేసిన బ్రిటన్ కంపెనీ.. డబ్బుంటే ఐరన్ మ్యాన్‌ అయిపోవచ్చు..

Iron Man-Style Jet Suit: ప్రత్యేక జెట్ సూట్ తయారు చేసిన బ్రిటన్ కంపెనీ.. డబ్బుంటే ఐరన్ మ్యాన్‌ అయిపోవచ్చు..

‘అవెంజర్స్’ సినిమాలోని క్యారెక్టర్స్ అన్నీ ప్రపంచంలో చాలా మందికి ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఈ హాలీవుడ్ సినిమాలోని ‘ఐరన్ మ్యాన్’లా గాలిలో ఎగిరితే బాగుండని చాలా మందే అనుకుని ఉంటారు. అది సినిమాలోనే సాధ్యం అని అనుకుని ఆ ఆలోచనను అక్కడే వదిలేస్తుంటారు. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ కంపెనీ ఆ ఆలోచనను నిజం చేసింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

‘అవెంజర్స్’ సినిమాలోని క్యారెక్టర్స్ అన్నీ ప్రపంచంలో చాలా మందికి ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఈ హాలీవుడ్ సినిమాలోని ‘ఐరన్ మ్యాన్’లా(Iron Man) గాలిలో ఎగిరితే బాగుండని చాలా మందే అనుకుని ఉంటారు. అది సినిమాలోనే సాధ్యం అని అనుకుని ఆ ఆలోచనను అక్కడే వదిలేస్తుంటారు. కానీ బ్రిటన్‌కు(Britan) చెందిన ఓ కంపెనీ ఆ ఆలోచనను నిజం చేసింది. ఇప్పుడు మనుషులు కూడా ‘ఐరన్ మ్యాన్’లా గాలిలో ఎగిరేలా కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. గాల్లో ఎగిరేందుకు వీలయ్యేలా జెట్ సూట్‌ను తయారు చేసింది. ఆ జెట్ సూట్ ఎలా ధరించాలి, ఖరీదు ఎంత, తదితర వివరాలు తెలుసుకుందాం.

* భారీ ధర

బ్రిటన్‌కు చెందిన హ్యూమన్ ఫ్లైట్ స్టార్ట్-అప్ కంపెనీ గ్రావిటి(Gravity) ప్రత్యేకమైన ఐరన్ మ్యాన్ జెట్ సూట్‌ను తయారు చేసింది. అయితే, ఈ సూట్ ధర చూసి సామాన్యులు భయపడిపోతారు. ధనవంతులు మాత్రమే ఈ సూట్ కొనుగోలు చేయగలరు. 40,0000 డాలర్లు (రూ.3,26,55,360) ధర గల ఈ సూట్ మనిషిని 10 నుంచి 15 అడుగుల ఎత్తుపైకి తీసుకెళ్లి గాలిలో ఎగరవేస్తుంది.

* టెస్టింగ్ సక్సెస్ ఫుల్

ఐరన్ మ్యాన్ స్టైల్ జెట్ సూట్ తయారీ గురించి పలు కంపెనీలకు వివరించినట్లు గ్రావిటీ కంపెనీ ఫౌండర్ చెప్పారు. కార్పొరేట్ కంపెనీలతో పాటు మిలిటరీ ఆర్గనైజేషన్స్‌కు చెప్పినట్లు తెలిపారు. ఈ జెట్ సూట్ టెస్టింగ్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ అయిందని, టెస్టింగ్‌కు 3,000 డాలర్లు(రూ.2,44,915) ఖర్చు అయినట్లు ప్రకటించారు.

Jobs In NAL: బీటెక్(B Tech), బీఎస్సీ(B.Sc) విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ 75 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండిలా.. 

* జెట్ సూట్ స్పెసిఫికేషన్లు

5 గ్యాస్ టర్బైన్ జెట్ ఇంజిన్స్‌తో ఈ జెట్ సూట్‌ను గ్రావిటి కంపెనీ తయారు చేసింది. ఈ ఇంజిన్లు 1,000 హార్స్ పవర్ కలిగి ఉండగా, బరువు ఇంధనంతో కలుపుకుని 75 పౌండ్స్ ఉంటుంది. ఈ సూట్ డీజిల్ లేదా కిరోసిన్‌తో రన్ అవుతుంది. ఈ సూట్‌తో గాలిలో గంటకు 80 మైళ్ల దూరానికి ప్రయాణించవచ్చు. మిలిటరీలో వీటి వినియోగం కోసం అధికారులు పరిశీలిస్తున్నారు. యుద్ధం చేసే సమయంలో సైనికులకు ఈ సూట్స్ ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయమై వారు స్టడీ చేస్తున్నారు.

* చికాగోలో ప్రదర్శన

గ్రావిటి కంపెనీ తయారు చేసిన ఈ జెట్ సూట్‌ను గతవారం చికాగో ట్రేడ్ షోలో ప్రదర్శించారు. సూట్ ధరించిన క్రమంలో మనిషిని వెనుక భాగంలో అది పట్టుకుని ఉంటుంది. సూట్ ఒక మనిషికి సరిపోయే విధంగా మాత్రమే తయారు చేసినట్లు తెలిపారు కంపెనీ ఫౌండర్ రిచర్డ్ బ్రోనింగ్. ఈ సూట్‌తో మనుషులు గుంపుగా గాలిలో ఎగరలేరని ఆయన స్పష్టం చేశారు.

PhD After Graduation: యూజీసీ కొత్త నిబంధనలు.. 4 ఏళ్ల డిగ్రీ తర్వాత నేరుగా పీహెచ్‌డీలో అడ్మిషన్ ..

* జెట్ సూట్ ప్రొడక్ట్స్ తయారీకి భారీ వ్యయం

జెట్‌ప్యాక్స్‌తో గాలిలో ఎగిరేలా టెక్నాలజీతో ప్రొడక్ట్ తయారు చేయాలని కొన్ని కంపెనీలు మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో గ్రావిటి ఒకటి కాగా, మరొకటి జెట్ ప్యాక్ ఏవియేషన్. జెట్ ప్యాక్ ఏవియేషన్ తయారు చేసిన సూట్ ధరను ప్రకటించలేదు. కాగా, గ్రావిటీ ప్రకటించిన ధర మాత్రం రిచ్ పీపుల్‌కు మాత్రమే వర్తించేలా ఉంది. రూ.3 కోట్లకుపైగా డబ్బులు చెల్లించి జెట్ సూట్ కొనుగోలు చేయగల సామర్థ్యం సామాన్య ప్రజలకు అయితే ఉండబోదు. ఈ జెట్ సూట్‌తో గాలిలో ఎగిరేందుకు ఎలాంటి అనుమతులు అక్కర్లేదని కానీ, కొన్ని నిబంధనలు పాటిస్తే చాలని గ్రావిటి(Gravity) కంపెనీ తెలిపింది.

Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Technology, United Kingdom

ఉత్తమ కథలు