హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

IRCTC Zoop Food Delivery: రైలు ఎక్కుతున్నారా? వాట్సప్‌లో ఫుడ్ ఆర్డర్ చేయండిలా

IRCTC Zoop Food Delivery: రైలు ఎక్కుతున్నారా? వాట్సప్‌లో ఫుడ్ ఆర్డర్ చేయండిలా

IRCTC Zoop food delivery: రైలు ఎక్కుతున్నారా? వాట్సప్‌లో ఫుడ్ ఆర్డర్ చేయండిలా
(image: Zoop)

IRCTC Zoop food delivery: రైలు ఎక్కుతున్నారా? వాట్సప్‌లో ఫుడ్ ఆర్డర్ చేయండిలా (image: Zoop)

IRCTC Zoop Food Delivery | రైల్వే ప్రయాణికులు ఇక వాట్సప్‌లో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ గుర్తింపు పొందిన ఫుడ్ డెలివరీ సంస్థ జూప్, జియో హాప్టిక్‌తో (Jio Haptik) ఒప్పందం కుదుర్చుకుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఒకప్పుడు రైలులో ఏ ఫుడ్ సర్వ్ చేస్తే ఆ ఫుడ్ కొని తినాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి కాస్త మారింది. వెళ్లే దారిలో మంచి రెస్టారెంట్లు ఉంటే ఆ రెస్టారెంట్ల నుంచి ఫుడ్ తెప్పించుకునే సదుపాయం వచ్చింది. ప్రధాన రైల్వే స్టేషన్ల పరిధిలో ఉండే హోటళ్ల నుంచి ప్రయాణికులు ఫుడ్ ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటున్నారు. రైల్వే ప్రయాణికులకు ఫుడ్ డెలివరీ (Food Deilvery) సర్వీస్‌ను మరింత మెరుగు పర్చేందుకు ఐఆర్‌సీటీసీ మరో ముందడుగు వేసింది. ఐఆర్‌సీటీసీ ఫుడ్ డెలివరీ సర్వీస్ అయిన జూప్ (Zoop) జియో హాప్టిక్‌తో (Jio Haptik) ఒప్పందం కుదుర్చుకుంది. రైల్వే ప్రయాణికులు పీఎన్ఆర్ నెంబర్ ద్వారా వాట్సప్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే పార్శిల్ నేరుగా తాము కూర్చున్న సీటు దగ్గరకే వస్తుంది.


రాబోయే స్టేషన్‌లో ఫుడ్ కావాలనుకునేవారు జూప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. అయితే ఈ యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన అసరం లేకుండా వాట్సప్‌లోనే ఫుడ్ ఆర్డర్ చేసే సదుపాయం వచ్చేసింది. ఫుడ్ ఆర్డర్ చేయడం మాత్రమే కాదు, తమ పార్శిల్ ఎక్కడ ఉందో చెక్ చేయొచ్చు. పార్శిల్ పొందిన తర్వాత ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వొచ్చు. మరి జూప్ వాట్సప్ సర్వీస్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.


IRCTC Shirdi Tour: సాయిభక్తులకు గుడ్ న్యూస్... విజయవాడ నుంచి షిరిడీకి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ


జూప్ వాట్సప్ సర్వీస్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయండిలా


Step 1- రైల్వే ప్రయాణికులు ముందుగా జూప్ ఛాట్‌బాట్ నెంబర్ +917042062070 తమ ఫోన్‌లో సేవ్ చేయాలి.


Step 2- మీ 10 అంకెల పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి.


Step 3- పీఎన్ఆర్ నెంబర్ సాయంతో మీరు ప్రయాణిస్తున్న రైలు, బెర్త్, సీట్ వివరాలను ఈ ఛాట్‌బాట్ సేకరిస్తుంది.


Step 4- రాబోయే స్టేషన్ ఎంచుకోవాలి.


Step 5- ఆ తర్వాత ఫుడ్ సెలెక్ట్ చేసి ఆర్డర్ చేయాలి.


Step 6- పేమెంట్ పూర్తి చేసిన తర్వాత ఆర్డర్ ప్లేస్ అవుతుంది.


ఆర్డర్ చేసిన తర్వాత ఛాట్‌బాక్స్‌లోనే మీ పార్శిల్ ఎక్కడ ఉందో ట్రాక్ చేయొచ్చు. మీరు సెలెక్ట్ చేసిన స్టేషన్‌కు మీరు చేరుకునేసరికి మీ ఫుడ్ పార్శిల్ వచ్చేస్తుంది. నేరుగా మీ సీటు దగ్గర డెలివరీ చేసి వెళ్తారు. వాట్సప్‌లో కాకుండా జూప్ యాప్‌లో కూడా ఇలాగే ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. యాప్ ఇన్‍‌స్టాల్ చేయకూడదనుకుంటే సింపుల్‌గా వాట్సప్‌లోనే ఆర్డర్స్ చేయొచ్చు.


Samsung Price Cut: ఆ పాపులర్ మొబైల్ ధర తగ్గించిన సాంసంగ్... ఒకేసారి రూ.3,000 తగ్గింపుజూప్ ఐఆర్‌సీటీసీ గుర్తింపు పొందిన ఫుడ్ డెలివరీ సంస్థ. రైల్వే ప్రయాణికులకు ఫుడ్ డెలివరీ సేవల్ని అందిస్తోంది. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, చైనీస్, మొఘలాయి, వెజ్ థాలీ, నాన్ వెజ్ థాలి లాంటి ఆహార పదార్థాలను డెలివరీ చేస్తోంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Food delivery, Indian Railways, IRCTC, Whatsapp

ఉత్తమ కథలు