IRCTC Rail Connect App: ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ మారింది... కొత్త ఫీచర్స్ ఇవే

IRCTC Rail Connect App | ఈ కొత్త ఫీచర్ ద్వారా ప్రతీసారి లాగిన్ చేయాల్సిన అవసరం లేకుండానే రైళ్ల వివరాలను యూజర్లు తెలుసుకోవచ్చు.

news18-telugu
Updated: November 19, 2019, 1:30 PM IST
IRCTC Rail Connect App: ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ మారింది... కొత్త ఫీచర్స్ ఇవే
IRCTC Rail Connect App: ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ మారింది... కొత్త ఫీచర్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం, image: Playstore)
  • Share this:
రైలు టికెట్లు బుక్ చేసేందుకు మీరు ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ ఉపయోగిస్తుంటారా? యాప్ ఇంటర్‌ఫేస్‌ని మార్చింది ఐఆర్‌సీటీసీ. యూజర్లందరికీ అప్‌డేట్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. యాప్ అప్‌డేట్ చేస్తే యూజర్ ఇంటర్‌ఫేస్ కొత్తగా కనిపిస్తోంది. అంతేకాదు... యూజర్లకు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. గతంలో మీరు ఐఆర్‌సీటీసీ యాప్‌లో రైళ్ల వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా లాగిన్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు మీరు లాగిన్ చేయాల్సిన అవసరం లేకుండానే రైళ్ల వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు యాప్ ఓపెన్ చేయగానే... Plan My Journey ట్యాబ్ కనిపిస్తుంది. ఈ ట్యాబ్ క్లిక్ చేసి మీరు ఎక్కడ్నుంచి ఎక్కడికి, ఎప్పుడు ప్రయాణించాలనుకుంటున్నారో వివరాలు వెల్లడించాలి. మీరు ఏ రైలులో ప్రయాణించాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత లాగిన్ చేసి రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ద్వారా ప్రతీసారి లాగిన్ చేయాల్సిన అవసరం లేకుండానే రైళ్ల వివరాలను యూజర్లు తెలుసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితమే ఇదే ఫీచర్‌ను https://www.irctc.co.in/ వెబ్‌సైట్‌లో అందించింది ఐఆర్‌సీటీసీ. వెబ్‌సైట్‌లో కూడా లాగిన్ చేయాల్సిన అవసరం లేకుండా రైళ్ల వివరాలు చూడొచ్చు.

irctc rail connect app update, irctc rail connect app new features, irctc rail connect app download, irctc rail connect login, irctc rail connect ios, irctc rail connect android, irctc rail connect registration, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ అప్‌డేట్, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ కొత్త ఫీచర్స్, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ డౌన్‌లోడ్, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ లాగిన్, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ ఆండ్రాయిడ్, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ ఐఓఎస్, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ రిజిస్ట్రేషన్
IRCTC Rail Connect: ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ మారింది... కొత్త ఫీచర్స్ ఇవే
(image: Playstore)


ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లో అనేక ఫీచర్స్ ఉన్నాయి. కొత్త యూజర్లు యాప్‌లోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. అకౌంట్ యాక్టివేట్ చేయొచ్చు. అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ప్రతీసారి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక పిన్ క్రియేట్ చేసుకోవచ్చు. పిన్ ద్వారా లాగిన్ కావొచ్చు. డ్యాష్‌బోర్డ్‌లో Plan My Journey, My bookings, PNR enquiry, Cancel Ticket, Refund History, File TDR లాంటి క్విక్ ఆప్షన్స్ ఉంటాయి. వీటి ద్వారా పీఎన్ఆర్ ఎంక్వైరీ చేయడం, పాత బుకింగ్స్ వివరాలు తెలుసుకోవడం లాంటివి సులువు. అంతేకాదు... ఇదే యాప్‌లో ఐఆర్‌సీటీసీకి చెందిన Book Meal ఆప్షన్ వాడుకోవచ్చు. మీరు రైలు టికెట్ బుక్ చేయకముందు, చేసిన తర్వాత మీ టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్‌ను కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ ద్వారా తెలుసుకోవచ్చు. తరచూ ప్రయాణించేవారి పేర్లతో మాస్టర్ ప్యాసింజర్ లిస్ట్ కూడా రూపొందించొచ్చు. యాప్‌లోనే బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకునే సదుపాయం ఉంది.

Indian Railways: రైలు పట్టాలపై ప్రత్యక్షమైన యముడు... బెదిరిపోయిన ప్రయాణికులు





ఇవి కూడా చదవండి:
Loading...
LIC Revival Campaign: గుడ్ న్యూస్... పాలసీ రివైవల్ క్యాంపైన్‌ గడువు పొడిగించిన ఎల్ఐసీ

Indian Railways Tatkal Rules: రైలు టికెట్ తత్కాల్‌లో బుక్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసా?

IRCTC: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త... ఫ్లైట్‌లో తిరుపతి టూర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ
First published: November 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...