IRCTC APP: ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌‌తో ఉపయోగాలు ఇవే...

IRCTC Rail connect app | మీ రైలు ప్రయాణాన్ని ఇంకా బాగా ప్లాన్ చేసుకోవచ్చు. ముందుగానే కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లాలో రైల్వే స్టేషన్ల పేర్లు, తేదీ ఎంటర్ చేయాలి. మీరు కోరుకునే రైలు, క్లాస్‌లో కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ చూడొచ్చు.

news18-telugu
Updated: February 23, 2019, 6:09 PM IST
IRCTC APP: ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌‌తో ఉపయోగాలు ఇవే...
IRCTC APP: ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌‌తో ఉపయోగాలు ఇవే...
news18-telugu
Updated: February 23, 2019, 6:09 PM IST
మీరు తరచూ రైలులో ప్రయాణం చేస్తుంటారా? మీ దగ్గర ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌‌ ఉందా? లేకపోతే వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి. ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌‌‌తో చాలా ఉపయోగాలు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ యూజర్లు పెరిగిపోతుండటంతో ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌లోనూ మార్పులు తీసుకొచ్చింది. ట్రైన్ టికెట్ల బుకింగ్ ప్రక్రియను ఇంకా సులభతరం చేసింది. కేవలం టికెట్ బుకింగ్ మాత్రమే కాదు... మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరి ఐఆర్‌సీటీసీ యాప్‌తో ఉపయోగాలు ఏంటో తెలుసుకోండి.

Read this: LIC Renewal: ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయిందా? ఇలా రెన్యువల్ చేయొచ్చు

IRCTC, irctc rail connect app, indian railways, irctc android app, how to book tatkal ticket in irctc mobile app, how many tickets can be booked in irctc app, how to cancel ticket in irctc app, irctc rail connect app for iphone, irctc app for ticket booking, ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్, ఇండియన్ రైల్వేస్, ఐఆర్‌సీటీసీ ఆండ్రాయిడ్ యాప్, ఐఆర్‌సీటీసీ ఐఫోన్ యాప్

ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌ని మొదటిసారి ఇన్‌స్టాల్ చేసుకొని లాగిన్ చేస్తే... ఆ తర్వాత ప్రతీసారి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. లాగిన్ కోసం ఓ పిన్ మీరే క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఆ పిన్‌తో లాగిన్ చేయొచ్చు.ఇక మీ రైలు ప్రయాణాన్ని ఇంకా బాగా ప్లాన్ చేసుకోవచ్చు. ముందుగానే కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లాలో రైల్వే స్టేషన్ల పేర్లు, తేదీ ఎంటర్ చేయాలి. మీరు కోరుకునే రైలు, క్లాస్‌లో కన్ఫర్మేషన్ ప్రాబబిలిటీ చూడొచ్చు. మీరు టికెట్ బుక్ చేస్తే కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎంత శాతం ఉన్నాయో తెలిసిపోతుంది.

సీటు లభ్యతను బట్టి మీరు టికెట్ బుక్ చేయడానికి నెక్స్ట్ స్టెప్‌కి వెళ్లొచ్చు. పేరు, వయస్సు, జెండర్, బెర్త్ ప్రిఫరెన్స్ లాంటి ప్రయాణికుల వివరాలు ఎంటర్ చేసి టికెట్ బుక్ చేయొచ్చు.

Read this: RuPay Card: రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్, మరెన్నో లాభాలు... రూపే కార్డ్ మీ దగ్గర ఉందా?
Loading...
IRCTC, irctc rail connect app, indian railways, irctc android app, how to book tatkal ticket in irctc mobile app, how many tickets can be booked in irctc app, how to cancel ticket in irctc app, irctc rail connect app for iphone, irctc app for ticket booking, ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్, ఇండియన్ రైల్వేస్, ఐఆర్‌సీటీసీ ఆండ్రాయిడ్ యాప్, ఐఆర్‌సీటీసీ ఐఫోన్ యాప్

మీరు ఒకేసారి ఆరుగురు ప్రయాణికులకు టికెట్లు తీసుకోవచ్చు.

ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌లో మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు లోయర్ బెర్త్, తత్కాల్ కోటా, ప్రీమియం తత్కాల్ కోటా లాంటి ఫీచర్లున్నాయి.

ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌లో పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవడంతో పాటు, టీడీఆర్ కూడా ఫైల్ చేయొచ్చు.

టికెట్లు బుక్ చేయడం మాత్రమే కాదు... బుక్ చేసిన టికెట్లను క్యాన్సిల్ చేయడం కూడా ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్‌తో సాధ్యం.

రైల్ కనెక్ట్ యాప్‌లో 'బుక్ ఎ మీల్' పేరుతో కొత్త ఫీచర్ ఉంది. రెస్టారెంట్ ఫుడ్‌ నేరుగా మీ సీటు దగ్గరకే వస్తుంది. ఈ సర్వీస్ ఉపయోగించడానికి మీరు మీ 10 అంకెల పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు.

Read this: PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి

IRCTC, irctc rail connect app, indian railways, irctc android app, how to book tatkal ticket in irctc mobile app, how many tickets can be booked in irctc app, how to cancel ticket in irctc app, irctc rail connect app for iphone, irctc app for ticket booking, ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్, ఇండియన్ రైల్వేస్, ఐఆర్‌సీటీసీ ఆండ్రాయిడ్ యాప్, ఐఆర్‌సీటీసీ ఐఫోన్ యాప్

వికల్ప్ స్కీమ్‌లో భాగంగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులు ప్రత్యామ్నాయ రైళ్లను ఎంచుకోవచ్చు. పీఎన్ఆర్, ట్రెయిన్ నెంబర్ లాంటి టికెట్ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఐఆర్‌సీటీసీ ఆథరైజ్డ్ ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్స్‌ దగ్గర బుగ్ చేసిన ఇ-టికెట్స్ స్టేటస్ కూడా ఐఆర్‌సీటీసీ కొత్త యాప్‌లో తెలుసుకోవచ్చు. అంతేకాదు మీ పాత టికెట్ల వివరాలు కూడా యాప్‌లో ఉంటాయి.

Photos: ఫోటోగ్రాఫర్లు కెమెరాల్లో బంధించిన శీతాకాల అందాలు

ఇవి కూడా చదవండి:

Save Money: జీతం మొత్తం ఖర్చయిపోతుందా? డబ్బు ఆదా చేయడానికి 5 టిప్స్

LIC Payment: ఎల్ఐసీ ప్రీమియం కట్టడం మర్చిపోయారా? ఇలా చేయొచ్చు

Elections 2019: మీ ఓటు ఉందా... లేదా? ఇలా చెక్ చేసుకోండి
First published: February 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...