IRCTC iPay: పేమెంట్ గేట్‌వే ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ

ఇకపై రైలు ప్రయాణికులు థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఐఆర్‌సీటీసీ iPay ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నేషనల్ కార్డులు ఉపయోగించి పేమెంట్స్ చేయొచ్చు.

news18-telugu
Updated: February 28, 2019, 9:18 PM IST
IRCTC iPay: పేమెంట్ గేట్‌వే ప్రారంభించిన ఐఆర్‌సీటీసీ
ఇకపై రైలు ప్రయాణికులు థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఐఆర్‌సీటీసీ iPay ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నేషనల్ కార్డులు ఉపయోగించి పేమెంట్స్ చేయొచ్చు.
  • Share this:
ఐఆర్‌సీటీసీ 'iPay' పేరుతో డిజిటల్ పేమెంట్ గేట్‌వే ప్రారంభించింది. ఆన్‌లైన్ ట్రావెల్ సంబంధిత సేవల్ని మరింత సులభంగా పొందేందుకు ప్రత్యేకంగా రైలు ప్రయాణికుల కోసం రూపొందించిన సర్వీస్ అని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. ఇకపై రైలు ప్రయాణికులు థర్డ్ పార్టీ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఐఆర్‌సీటీసీ iPay ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నేషనల్ కార్డులు ఉపయోగించి పేమెంట్స్ చేయొచ్చు. ఈ పేమెంట్ సర్వీస్ ప్రారంభించేందుకు ఐఆర్‌సీటీసీ చాలాకాలంగా కసరత్తు చేస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.

Read this: Link PAN: బ్యాంక్ అకౌంట్‌కి పాన్ లింక్ చేస్తేనే ఐటీఆర్ రీఫండ్

పేమెంట్ వ్యవస్థపై ఐఆర్‌సీటీసీకి పూర్తి కంట్రోల్ ఉంటుందని, నేరుగా బ్యాంకులు, కార్డ్ నెట్‌వర్క్స్, ఇతర భాగస్వాములతో సంబంధాలు కొనసాగిస్తామని ఐఆర్‌సీటీసీ చెబుతోంది. ఈ వ్యవస్థ వల్ల బ్యాంకులు, ఐఆర్‌సీటీసీ మధ్య దూరం తగ్గినట్టవుతుందని, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌లో లోపాలుంటే నేరుగా బ్యాంకును సంప్రదిస్తామని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. iPay వేగంగా, సులభంగా ఉపయోగించొచ్చని ఐఆర్‌సీటీసీ హామీ ఇస్తోంది. త్వరలో ఐఆర్‌సీటీసీ ప్రీపెయిడ్ కార్డ్ కమ్ వ్యాలెట్ వస్తుందని, ఆటో డెబిట్ సదుపాయం కూడా ఉంటుందని వెల్లడించింది.

Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Redmi Note 7 Pro: షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్ATM Rules: మీ ఏటీఎం కార్డును మీ భార్య వాడినా తప్పే... RBI రూల్స్ తెలుసుకోండి

Samsung Galaxy A Series: సాంసంగ్ గెలాక్సీ నుంచి మరో 3 స్మార్ట్‌ఫోన్లు
First published: February 28, 2019, 9:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading