Home /News /technology /

IRCTC E WALLET HOW TO ADD MONEY TO IRCTC WALLET LEARN STEP BY STEP PROCESS HERE GH VB

IRCTC E Wallet: IRCTC ఈ వాలెట్‌కి మనీ ఎలా యాడ్ చేయాలి..? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకోండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

రైల్వేస్ అందుబాటులోకి తీసుకువచ్చిన IRCTC వెబ్‌సైట్ ద్వారా ప్రయాణికులు తమ రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. అయితే రైల్వేస్ సొంత పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ అయిన IRCTC ఈ వాలెట్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.

భారతదేశంలో తక్కువ ధరలో సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణానికి గుర్తింపు పొందాయి ఇండియన్ రైల్వేస్(Indian Railways). ఇండియాలోని దాదాపు అన్ని ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ విస్తృతంగా అందుబాటులో ఉంది. రైల్వేస్ అందుబాటులోకి తీసుకువచ్చిన IRCTC వెబ్‌సైట్(Website) ద్వారా ప్రయాణికులు తమ రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. అయితే రైల్వేస్ సొంత పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ అయిన IRCTC ఈ వాలెట్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఇది పేటీఎం ఈవాలెట్, ఇతర ఈవాలెట్‌ల మాదిరిగానే టిక్కెట్‌ బుకింగ్, పేమెంట్ సేవలను అందిస్తోంది. ప్రయాణికులు IRCTC eWalletకి మనీ ట్రాన్స్‌ఫర్ చేసి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దీనికి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

AP SSC Results 2022: ఏపీ టెన్త్ ఫలితాలు.. ఎవరైనా అలా చేస్తే ఏడేళ్ల జైలు.. జగన్ సర్కార్ సీరియస్ వార్నింగ్

* IRCTC ఈవాలెట్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?

స్టెప్ 1: మీ IRCTC అకౌంట్‌కు లాగిన్ అవ్వండి.

స్టెప్ 2: IRCTC eWallet విభాగానికి వెళ్లి ‘రిజిస్టర్ నౌ’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: IRCTC eWallet రిజిస్ట్రేషన్ కోసం పాన్ లేదా ఆధార్‌ను ధ్రువీకరించే ఆప్షన్ ఓపెన్ అవుతుంది.

స్టెప్ 4: ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, IRCTC ఈవాలెట్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించే పేమెంట్ పేజీ కనిపిస్తుంది. పన్నులు మినహా రుసుము రూ.50గా ఉంటుంది.

ఈ పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత, యూజర్లు ఆటోమెటిక్‌గా లాగవుట్ అవుతారు. తర్వాత eWalletలను రీఛార్జ్ చేయడానికి IRCTC అకౌంట్‌కు మళ్లీ లాగిన్ అవ్వాలి.

* IRCTC eWalletలో డబ్బు ఎలా డిపాజిట్ చేయాలి?

స్టెప్ 1: మీ IRCTC అకౌంట్‌కు లాగిన్ అవ్వండి.

స్టెప్ 2: IRCTC eWallet విభాగానికి వెళ్లి, *IRCTC Ewallet DEPOSIT’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: ఇప్పుడు మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంచుకోండి.

స్టెప్ 4: తర్వాత డ్రాప్‌డౌన్ మెనూ నుంచి పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకుని, ‘సబ్‌మిట్’ బటన్‌పై క్లిక్ చేయండి.

ఈ పేమెంట్ పూర్తయిన తర్వాత స్క్రీన్‌పై దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కనిపిస్తుంది. వినియోగదారులు తమ IRCTC ఈవాలెట్లలో రూ. 100 నుంచి రూ. 10,000 వరకు డిపాజిట్ చేయవచ్చు.

* IRCTC eWallet ద్వారా ట్రైన్ టిక్కెట్‌ను ఎలా బుక్ చేసుకోవాలి?

స్టెప్ 1: మీ IRCTC అకౌంట్‌కు లాగిన్ అవ్వండి.

స్టెప్ 2: ట్రైన్, సోర్స్, డెస్టినేషన్, ప్రయాణికుల వివరాలు, తేదీని ఎంచుకోండి.

స్టెప్ 3: అన్ని వివరాలను రివ్యూ చేసిన తర్వాత క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి, పేమెంట్ ఆప్షన్‌కు వెళ్లండి.

స్టెప్ 4: పేమెంట్ విభాగం కింద IRCTC eWallet ఆప్షన్‌ను ఎంచుకోండి.

స్టెప్ 5: పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయండి.

ఇప్పుడు టికెట్ రుసుము మొత్తం మీ eWallet నుంచి డెబిట్ అవుతుంది. ఇదే సమయంలో టికెట్ బుకింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది. ట్రాన్సాక్షన్ ఫీజుగా రూ. 10 అదనంగా డెబిట్ అవుతుంది.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Indian Railways

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు