IRCTC Apps: ఈ ఐఆర్‌సీటీసీ యాప్స్ ట్రై చేశారా? ఫీచర్స్ ఇవే...

IRCTC Android Apps | 2014లో ఐఆర్‌సీటీసీ మొదట IRCTC Connect యాప్‌ను రిలీజ్ చేసింది. 2017లో ఆ యాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. IRCTC Rail Connect పేరుతో రిలీజ్ చేసింది ఐఆర్‌సీటీసీ.

news18-telugu
Updated: March 23, 2019, 9:51 AM IST
IRCTC Apps: ఈ ఐఆర్‌సీటీసీ యాప్స్ ట్రై చేశారా? ఫీచర్స్ ఇవే...
IRCTC Apps: ఈ ఐఆర్‌సీటీసీ యాప్స్ ట్రై చేశారా? ఫీచర్స్ ఇవే...
news18-telugu
Updated: March 23, 2019, 9:51 AM IST
IRCTC... ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ప్రయాణికులకు రైల్వేకు సంబంధించిన సమస్త సేవలు అందించే ప్లాట్‌ఫామ్. రైల్వే మాత్రమే కాదు భోజన సేవలు, ఫ్లైట్ టికెట్లు ఇలా అనేక రకాల సేవల్ని విస్తరిస్తోంది ఐఆర్‌సీటీసీ. వాటి కోసం వేర్వేరుగా యాప్స్ రిలీజ్ చేసింది. అవన్నీ ప్యాసింజర్ ఫ్రెండ్లీ యాప్స్. మీరు తరచూ ప్రయాణించేవారైతే ఆ యాప్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉండాల్సిందే. ఆ యాప్స్ మీ దగ్గరుంటే ఐఆర్‌సీటీసీకి సంబంధించిన సేవలు ఇంకా మెరుగ్గా పొందొచ్చు. మరి ఆ ఐఆర్‌సీటీసీ యాప్స్ ఏవి? వాటి వల్ల ఉపయోగాలు ఏంటీ? తెలుసుకోండి.

IRCTC Rail Connect: ఈ యాప్ గురించి అందరికీ తెలిసిందే. 2014లో ఐఆర్‌సీటీసీ మొదట IRCTC Connect యాప్‌ను రిలీజ్ చేసింది. 2017లో ఆ యాప్‌ను అప్‌గ్రేడ్ చేసింది. IRCTC Rail Connect పేరుతో రిలీజ్ చేసింది ఐఆర్‌సీటీసీ. మొదట నిమిషానికి 2,000 టికెట్లు బుక్ చేసే సామర్థ్యం ఉంటే... కొత్త యాప్ ద్వారా నిమిషానికి 20,000 బుక్ చేయగల సామర్థ్యం కొత్త యాప్‌ది. టికెట్ బుకింగ్‌తో పాటు క్యాన్సలేషన్, తత్కాల్ బుకింగ్, రైలు ఎక్కే ప్రదేశంలో మార్పు లాంటి సేవలు కూడా ఈ యాప్ ద్వారా సాధ్యం. 4 అంకెల పిన్‌తో యాప్‌లో లాగిన్ చేయొచ్చు.

Read this: IRCTC Tatkal Rules: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? రూల్స్, ఛార్జెస్ వివరాలు తెలుసుకోండి

IRCTC Android Apps, IRCTC Rail Connect APP Features, IRCTC Tourism APP Features, IRCTC Food on Track APP Features, IRCTC UTS APP Features, IRCTC Menu on Rails APP Features, IRCTC Air APP Features, indian railways, ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్, ఐఆర్‌సీటీసీ టూరిజం యాప్ ఫీచర్స్, ఐఆర్‌సీటీసీ ఫుడ్ ఆన్ ట్రాక్ ఫీచర్స్, ఐఆర్‌సీటీసీ యూటీఎస్ యాప్ ఫీచర్స్, ఐఆర్‌సీటీసీ మెనూ ఆన్ రైల్స్, ఐఆర్‌సీటీసీ ఎయిర్, ఇండియన్ రైల్వేస్, ఐఆర్‌సీటీసీ ఆండ్రాయిడ్ యాప్



IRCTC Air: ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్ టికెట్లు మాత్రమే కాదు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ ఎయిర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. హాలిడేస్ కోసం ఎల్‌టీసీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు.

IRCTC Tourism: తరచూ హాలిడే టూర్లకు వెళ్లేవారికి ఉపయోగపడే యాప్ ఇది. ఐఆర్‌సీటీసీ టూరిజం యాప్ ద్వారా టూర్ ప్యాకేజీలు, హోటళ్లు బుక్ చేయొచ్చు. 'భారత్ దర్శన్' బుకింగ్స్ కూడా ఈ యాప్‌లో చేయొచ్చు. మిగతా సంస్థలతో పోలిస్తే చౌకగా నేషనల్, ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజీలు బుక్ చేసుకోవచ్చు.

Food on Track: మీరు రైలు ప్రయాణంలో ఉండగా ఫుడ్ బుక్ చేసుకొని మీ సీటు దగ్గరకు తెప్పించుకునేందుకు ఉపయోగపడేదే ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్. ఇందులో మీ పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి ఫుడ్ బుక్ చేస్తే చాలు. ఒకవేళ మీరు ముందే ఫుడ్ బుక్ చేసినా... మీరు టికెట్ క్యాన్సిల్ చేస్తే మీ ఫుడ్ ఆర్డర్ కూడా క్యాన్సిల్ అవుతుంది.
Loading...
Read this: IRCTC PNR Linking: ఏప్రిల్ 1 నుంచి అమలులోకి... ప్రయాణికులకు ఎంత లాభం?

IRCTC Android Apps, IRCTC Rail Connect APP Features, IRCTC Tourism APP Features, IRCTC Food on Track APP Features, IRCTC UTS APP Features, IRCTC Menu on Rails APP Features, IRCTC Air APP Features, indian railways, ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్, ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్ యాప్, ఐఆర్‌సీటీసీ టూరిజం యాప్ ఫీచర్స్, ఐఆర్‌సీటీసీ ఫుడ్ ఆన్ ట్రాక్ ఫీచర్స్, ఐఆర్‌సీటీసీ యూటీఎస్ యాప్ ఫీచర్స్, ఐఆర్‌సీటీసీ మెనూ ఆన్ రైల్స్, ఐఆర్‌సీటీసీ ఎయిర్, ఇండియన్ రైల్వేస్, ఐఆర్‌సీటీసీ ఆండ్రాయిడ్ యాప్

Menu on Rails: గతేడాది రిలీజ్ చేసిన యాప్ ఇది. రైలు ప్రయాణంలో తమకు అందించే ఫుడ్ ఐటమ్స్, వాటి ధరల్ని తెలుసుకోవచ్చు. భారతీయ రైళ్లల్లో ఐఆర్‌‌సీటీసీ క్యాటరింగ్ సేవలు అందుబాటులో ఉన్న అన్న రైళ్లలో మెనూ వివరాలుంటాయి.

UTS: ఇండియన్ రైల్వేస్ రిలీజ్ చేసిన యూటీఎస్ యాప్ అన్‌రిజర్వ్‌డ్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముందుగా రిజర్వేషన్ చేయించకుండా మీరు రైల్వే స్టేషన్‌లో తీసుకునే జనరల్ టికెట్‌ను అన్‌రిజర్వ్‌డ్ టికెట్ అంటారు. అన్‌రిజర్వ్‌డ్ టికెట్లను క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే తీసుకోవచ్చు. ఈ సేవలు దేశమంతా అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం యూటీఎస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసి అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు కొనుక్కోవచ్చు. రైలు టికెట్లు మాత్రమే కాదు... ప్లాట్‌ఫామ్ టికెట్స్, మంత్లీ పాస్ కూడా తీసుకోవచ్చు. https://www.utsonmobile.indianrail.gov.in వెబ్‌సైట్‌లో కూడా మొబైల్ నెంబర్, పేరు, పాస్‌వర్డ్ లాంటి వివరాలతో రిజిస్టర్ చేసుకోవచ్చు.

Photos: ఈ లేడీ బైకర్ ఆన్‌‌లైన్ సెన్సేషన్... అమ్మాయిలకు ఇన్‌స్పిరేషన్

ఇవి కూడా చదవండి:

Paytm App: పేటీఎం నుంచి మరో యాప్... ఫీచర్లు ఇవే

Redmi Go: షావోమీ నుంచి లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ గో'

SBI YONO Cash: ఏటీఎం కార్డు లేదా? అయినా డబ్బులు డ్రా చేయొచ్చు ఇలా...
First published: March 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...