ఐకూ ఇండియా నుంచి ఇటీవల ఐకూ జెడ్7 5జీ (iQOO Z7 5G) స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అమెజాన్‌లో ఇదే బెస్ట్ మొబైల్ అని ఐకూ ప్రకటించింది. అమెజాన్‌లో హయ్యెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ (Highest Selling Smartphone) ఐకూ జెడ్7 5జీ మోడల్ అని ఐకూ చెబుతోంది. 2023లో రూ.15,000 నుంచి రూ.20,000 మధ్య లాంఛ్ అయిన మొబైల్స్‌లో ఈ రికార్డ్ సృష్టించినట్టు వెల్లడించింది. ఐకూ జెడ్7 5జీ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ కలర్స్‌లో లభిస్తోంది. అమెజాన్ ఇండియా, ఐకూ ఇ-స్టోర్లలో కొనొచ్చు.
అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డులతో (SBI Card) కొంటే రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.17,499 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.18,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. 6 నెలల నోకాస్ట్ ఈఎంఐతో ఈ మొబైల్ కొనొచ్చు.
Jio IPL Plans: ఐపీఎల్ ప్లాన్స్ ప్రకటించిన రిలయన్స్ జియో... 40జీబీ వరకు డేటా ఉచితం
#iQOOZ7 5G is the Highest Selling Smartphone* on @amazonIN, a big thank you for showing your love to us. Get the #FullyLoaded #iQOOZ7 5G at just ₹17,499*. Buy Now: https://t.co/ghZ1I8OiXl *On day 1 sale among the smartphones launched @amazonIN in 15-20K price segment in 2023 pic.twitter.com/h2N6qc1Tii
— iQOO India (@IqooInd) March 22, 2023
ఐకూ జెడ్7 5జీ స్పెసిఫికేషన్స్
ఐకూ జెడ్7 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.38 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫీచర్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిడీ 920 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియల్‌మీ 9 ప్రో+, రెడ్‍మీ నోట్ 11 ప్రో+, రియల్‌మీ నార్జో 50 ప్రో, వివో వీ23 లాంటి మోడల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 13 + ఫన్‌టచ్ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఐకూ జెడ్7 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 44వాట్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది.
Exchange Offer: ఈ మొబైల్ కొంటే రూ.15,000 పైనే ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్
ఐకూ జెడ్7 5జీ స్మార్ట్‌ఫోన్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 64మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 2మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో ఫోటో, పోర్ట్రెయిట్, నైట్, వీడియో, 64MP, పనో, లైవ్ ఫోటో, స్లో-మో, టైమ్-లాప్స్, ప్రో, వ్లాగ్ మూవీ, డాక్యుమెంట్స్, డబుల్ ఎక్స్‌పోజర్, డ్యూయల్ వ్యూ, 4కే వీడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో ఫోటో, వీడియో, పోర్ట్రెయిట్, రానైట్, లైవ్ ఫోటో, వ్లాగ్ మూవీ, డబుల్ ఎక్స్‌పోజర్, డ్యూయల్ వ్యూ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Amazon, IQoo, Smartphone