IQOO Z6 VS VIVO T1 KNOW WHICH IS THE BEST SMARTPHONE WITH SNAPDRAGON 695 PROCESSOR UNDER RS 15000 SS
iQOO Z6 vs Vivo T1: ఒకే ప్రాసెసర్‌తో రెండు స్మార్ట్ఫోన్లు... రూ.15,000 లోపు ఏది బెస్ట్ మోడల్ తెలుసుకోండి
iQOO Z6 vs Vivo T1: ఒకే ప్రాసెసర్‌తో రెండు స్మార్ట్ఫోన్లు... రూ.15,000 లోపు ఏది బెస్ట్ మోడల్ తెలుసుకోండి
iQOO Z6 vs Vivo T1 | మీరు రూ.15,000 లోపు 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) కొనాలనుకుంటున్నారా? పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో ఐకూ జెడ్6, వివో టీ1 మోడల్స్ లభిస్తున్నాయి. వీటిలో ఏది బెస్ట్? తెలుసుకోండి.
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 (Snapdragon 695) ప్రాసెసర్‌తో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఐదు స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయ్యాయి. లేటెస్ట్గా ఐకూ జెడ్6 (iQOO Z6) స్మార్ట్‌ఫోన్‌లో ఇదే ప్రాసెసర్ ఉండగా అంతకన్నా ముందే రెడ్మీ నోట్ 11 ప్రో+, వివో టీ1, రియల్మీ 9 ప్రో, మోటో జీ71 రిలీజ్ అయ్యాయి. గతంలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో రూ.20,000 బడ్జెట్లో స్మార్ట్ఫోన్లు వచ్చాయి. కానీ వివో ఇండియా ఏకంగా రూ.15,000 లోపు బడ్జెట్లో వివో టీ1 5జీ (Vivo T1 5G) మోడల్‌ను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఐకూ జెడ్6 కూడా రూ.15,000 లోపు బడ్జెట్లో లభిస్తోంది. దీంతో ఐకూ జెడ్6, వివో టీ1 మోడల్స్ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. మరి ఈ రెండు స్మార్ట్ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి.
ఐకూ జెడ్6, వివో టీ1 స్మార్ట్ఫోన్ల మధ్య స్పెసిఫికేషన్స్ చూస్తే రెండు మొబైల్స్ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. రెండు మోడల్స్‌లో ఫీచర్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. డిస్ప్లే, ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్, రియర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ అన్నీ ఒకేలా ఉండటం విశేషం. ధర కూడా ఒకే రేంజ్లో ఉండటంతో ఐకూ జెడ్6, వివో టీ1 స్మార్ట్ఫోన్ల మధ్య పోటీ తప్పదు. అయితే 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర చూస్తే ఐకూ జెడ్6 మొబైల్ వివో టీ1 కన్నా రూ.2,000 తక్కువ ధరకే లభిస్తోంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.