iQOO Z6 | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఐకూ జెడ్ 6 5జీ మోడల్ రిలీజైంది. ఇందులో పాపులర్ ప్రాసెసర్ అయిన స్నాప్‌డ్రాగన్ 695 (Snapdragon 695) చిప్సెట్ ఉండటం విశేషం. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.
లేటెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఇటీవల క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 (Snapdragon 695) ప్రాసెసర్ బాగా పాపులర్ అయింది. ఈ ప్రాసెసర్‌తో వరుసగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కొత్త మొబైల్స్ రిలీజ్ అవుతున్నాయి. లేటెస్ట్గా ఐకూ జెడ్6 (iQOO Z6) స్మార్ట్‌ఫోన్ కూడా ఇదే ప్రాసెసర్‌తో రిలీజ్ కావడం విశేషం. ఈ మొబైల్ బేస్ వేరియంట్‌ను రూ.13,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో లభిస్తున్న చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే. ఇందులో స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పాటు 50మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఐకూ జెడ్6 ధర
ఐకూ జెడ్6 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999. మార్చి 22న సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్‌తో పాటు ఐకూ ఇండియా ఇ-స్టోర్‌లో కొనొచ్చు. మార్చి 22న సేల్ ప్రారంభం అవుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో ఐకూ జెడ్6 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.13,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.14,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.
ఐకూ జెడ్6 స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ Samsung ISOCELL JN1 మెయిన్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2మెగాపిక్సెల్ బొకే సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఐకూ జెడ్6 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. క్రోమాటిక్ బ్లూ, డైనమో బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.