చైనీస్ స్మార్ట్ బ్రండ్ ఐక్యూ (iQOO) వరుసగా బడ్జెట్ ఫోన్ల (Budget Phones)ను రిలీజ్ చేస్తోంది. ఈ కంపెనీ Z6 సిరీస్‌లో రెండు కొత్త ప్రొడక్ట్స్‌ను రిలీజ్‌కు రెడీ చేసింది. అయితే ఈ రెండు ఫోన్లు ఈ వారంలోనే చైనా(China)లో లాంచ్ అవుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. iQOO Z6x, iQOO Z6 పేరుతో ఇవి మార్కెట్లోకి రానున్నాయి.
* ఐక్యూ Z6 సిరీస్ లాంచ్ డేట్
ఐక్యూ Z6 ఫోన్ చైనాలో మొట్టమొదటిసారి అధికారికంగా అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్ iQOO Z5, Z5x ఫోన్‌లకు సక్సెసర్‌గా రానుంది. ఆగస్టు 25న రాత్రి 7:30 గంటలకు ఐక్యూ Z6x, ఐక్యూ Z6 ఫోన్లు చైనాలో లాంచ్ అవుతాయని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.
వీటి ధరలు రూ.15వేల నుంచి రూ.20వేల మధ్యలో ఉండవచ్చు. ప్రస్తుతానికి Z6 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లను ఐక్యూ లాంచ్ చేస్తుంది. వాస్తవానికి iQOO Z6 సిరీస్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలోనే లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఐక్యూ Z6 5G, ఐక్యూ Z6 44W, ఐక్యూ Z6 ప్రో 5G వంటి మూడు ఫోన్‌లు మార్కెట్లోకి వచ్చాయి.
* ఐక్యూ Z6 స్పెసిఫికేషన్లు
చైనీస్ వెర్షన్ iQOO Z6 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫుల్-HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 64MP ప్రైమరీ లెన్స్‌తో కూడినా ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉంది. దీనికి OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ ఉంటుంది. ఈ డివైజ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G+ SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8GB/12GB RAM, 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లలో ఫోన్ లభించనుంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేసే పెద్ద బ్యాటరీతో రావచ్చని భావిస్తున్నారు.
* ఐక్యూ Z6x ప్రత్యేకతలు
మరోవైపు, iQOO Z6x పూర్తిగా భిన్నమైన స్పెక్స్ షీట్‌తో రానుంది. ఈ ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో రావచ్చు. కాన్ఫిగరేషన్‌ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్ 6GB/128GB, 8GB/128GB, 8GB/256GB ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో లభించే అవకాశం ఉంది. USB-C పోర్ట్ సాయంతో బ్యాటరీ ఛార్జ్ కానుంది.
3.5mm ఆడియో జాక్, ఇతర కనెక్టివిటీ ఫీచర్లతో తాజా ఫోన్లు రావచ్చని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీని కీలక స్పెసిఫికేషన్‌లు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు డివైజ్‌ల ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలను ఐక్యూ వెల్లడించలేదు. అయితే ఆగస్టు 25న ఫోన్లు లాంచ్ అయ్యాక, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, IQoo, Smart phones, Tech news