హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iQoo Z6 Pro 5G: పాపులర్ ప్రాసెసర్‌తో ఐకూ జెడ్6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

iQoo Z6 Pro 5G: పాపులర్ ప్రాసెసర్‌తో ఐకూ జెడ్6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

iQoo Z6 Pro 5G: పాపులర్ ప్రాసెసర్‌తో ఐకూ జెడ్6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్
(image: iQoo India)

iQoo Z6 Pro 5G: పాపులర్ ప్రాసెసర్‌తో ఐకూ జెడ్6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ (image: iQoo India)

iQoo Z6 Pro 5G | పాపులర్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ (Qualcomm Snapdragon 778G) చిప్‌సెట్‌తో ఇండియాలో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. రూ.25,000 లోపు బడ్జెట్‌లో ఐకూ జెడ్6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.

లేటెస్ట్‌గా రిలీజైన 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) కొనాలనుకునేవారికి అలర్ట్. ఐకూ జెడ్ సిరీస్‌లో (iQoo Z series) మరో మొబైల్ రిలీజైంది. ఐకూ ఇండియా ఐకూ జెడ్6 ప్రో 5జీ (iQoo Z6 Pro 5G) స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఐకూ జెడ్6 4జీ (iQoo Z6 4G) మోడల్‌ను రిలీజ్ చేసింది. ఐకూ జెడ్6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.25,000 లోపు బడ్జెట్‌లో పరిచయం చేసింది. ఇందులో ఇటీవల బాగా పాపులర్ అయిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ ఉండటం విశేషం. ఈ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ పెర్ఫామెన్స్ ఇస్తున్న ప్రాసెసర్ ఇది. దీంతో పాటు అమొలెడ్ డిస్‌ప్లే, 4,700ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి.

ఐకూ జెడ్6 ప్రో 5జీ ధర


ఐకూ జెడ్6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.28,999. ఇంట్రడక్టరీ ఆఫర్ కింద రూ.1,000 డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. దీంతో బేస్ వేరియంట్‌ను రూ.22,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్, ఐకూ ఇండియా ఇస్టోర్‌లో కొనొచ్చు. అమెజాన్ సమ్మర్ సేల్‌లో ఆఫర్స్ పొందొచ్చు.

Nokia G21: ఒకసారి ఛార్జింగ్ చేస్తే 3 రోజుల బ్యాటరీ బ్యాకప్... నోకియా జీ21 స్మార్ట్‌ఫోన్ రిలీజ్

ఐకూ జెడ్6 ప్రో స్పెసిఫికేషన్స్


ఐకూ జెడ్6 ప్రో స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.44 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్‌మీ 9 ఎస్ఈ, సాంసంగ్ గెలాక్సీ ఎం52, రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్, ఐకూ జెడ్5, షావోమీ 11 లైట్ ఎన్ఈ, మోటోరోలా ఎడ్జ్ 20 స్మార్ట్‌ఫోన్లలో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

Amazon Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... రూ.1,799 విలువైన ఇయర్‌బడ్స్ ఉచితం

ఐకూ జెడ్6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 64మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

ఐకూ జెడ్6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 4,700ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 66వాట్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ లభిస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. లీజియన్ స్కై, ఫాంటమ్ డస్క్ కలర్స్‌లో కొనొచ్చు.

First published:

Tags: 5G Smartphone, IQoo, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు