స్మార్ట్ బ్రాండ్ ఐక్యూ (iQOO) ఇండియాలో వరుసగా కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తోంది. ఇటీవల కంపెనీ ఐక్యూ 9T (iQoo 9T) పేరుతో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు Z6 సిరీస్‌లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి ఐక్యూ సన్నాహాలు చేస్తోంది. ఐక్యూ జెడ్6 లైట్ (iQOO Z6 Lite) పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించడానికి ముందే, కొత్త ఫోన్ స్పెసిఫికేషన్లతో పాటు ధర, ఇతర వివరాలు లీక్ అయ్యాయి. iQOO Z6 4G డివైజ్ ఏప్రిల్‌లో లాంచ్ అయింది. iQOO Z6 సిరీస్‌లో కంపెనీ ప్రస్తుతం iQOO Z6 Pro 5G, iQOO Z6 44W, iQOO Z6 5G, iQOO Z6 4Gలను విక్రయిస్తోంది. త్వరలో మార్కెట్లోకి రానున్న iQOO Z6 Lite ఈ లిస్ట్‌లో చేరనుంది.
* ఐక్యూ Z6 లైట్ స్పెసిఫికేషన్లు
ఐక్యూ Z6 లైట్ ఫోన్ Vivo T1X మోడల్‌కు రీబ్రాండెడ్ వెర్షన్ అని తెలుస్తోంది. వివో T1X ఫోన్ జులైలో ఇండియాలో లాంచ్ అయింది. ఇది క్వాల్‌కామ్ SoC చిప్‌సెట్‌తో రన్ అయ్యే 4G డివైజ్. తాజా స్మార్ట్‌ఫోన్.. Z6 సిరీస్‌లో బెస్ట్ బడ్జెట్ ఫోన్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఇది సెప్టెంబర్ రెండో వారంలో ఇండియాలో లాచ్ అవుతుందని మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఐక్యూ Z6 లైట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ HD+ LCD స్క్రీన్‌తో రావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 2.4GHz క్లాక్ స్పీడ్‌తో స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో రన్ అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇది 6GB RAM, 128 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుందని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి : బాప్ రే.. ఇంటర్నెట్‌లో ప్రతి 10 మందిలో ఆరుగురు తెలుసుకుంటుంది ఇదా..!
వివో T1X ఫోన్ లాగా ఐక్యూ Z6 లైట్ కూడా 4-లేయర్ కూలింగ్ సిస్టమ్‌తో రావచ్చు. కొత్త ఐక్యూ డివైజ్‌లో 50MP ప్రైమరీ కెమెరా, f/2.4తో కూడిన సెకండరీ 2MP మాక్రో సెన్సార్, 8MP సెల్ఫీ స్నాపర్ ఉండవచ్చు. 18W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ యూనిట్ ఈ ఫోన్‌లో ఉంటుందని లీకుల ద్వారా తెలుస్తోంది.
* ఐక్యూ Z6 లైట్ ధర ఎంత..?
ఐక్యూ Z6 లైట్ ఫోన్ ధర రూ. 11,499 నుంచి రూ. 14,499 వరకు ఉంటుంది. ఇది వివో T1X ప్రైస్ ట్యాగ్ కంటే కనీసం రూ. 500 తక్కువ. Z6 లైట్ ఫోన్ ధర T1X కంటే రూ. 500 నుంచి రూ. 700 తక్కువగా ఉంటుంది. కొత్త ఫోన్ గ్రావిటీ బ్లాక్, స్పేస్ బ్లూ కలర్స్‌తో పాటు మరిన్ని కలర్ ఆప్షన్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఫోన్ అధికారికంగా లాంచ్ అయిన తర్వాతే ధర, ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget smart phone, IQoo, Smart phone, Tech news