హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iQOO Z6 Lite: ఐకూ జెడ్6 లైట్ ధర ఎంతో తెలిసిపోయింది... లేటెస్ట్ ప్రాసెసర్‌తో చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్

iQOO Z6 Lite: ఐకూ జెడ్6 లైట్ ధర ఎంతో తెలిసిపోయింది... లేటెస్ట్ ప్రాసెసర్‌తో చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్

iQOO Z6 Lite: ఐకూ జెడ్6 లైట్ ధర ఎంతో తెలిసిపోయింది... లేటెస్ట్ ప్రాసెసర్‌తో చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్
(image: iQoo India)

iQOO Z6 Lite: ఐకూ జెడ్6 లైట్ ధర ఎంతో తెలిసిపోయింది... లేటెస్ట్ ప్రాసెసర్‌తో చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ (image: iQoo India)

iQOO Z6 Lite | స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 (Snapdragon 4 zen 1) ప్రాసెసర్‌తో ప్రపంచంలోనే తొలి స్మార్ట్‌ఫోన్ ఐకూ జెడ్6 లైట్ (iQOO Z6 Lite) లాంఛ్ అయింది. ఆఫర్ ధరను కూడా ప్రకటించింది ఐకూ ఇండియా.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఐకూ ఇండియా కొన్ని రోజులుగా ఐకూ జెడ్6 లైట్ (iQOO Z6 Lite) స్మార్ట్‌ఫోన్ టీజర్లు రిలీజ్ చేస్తోంది. ఇప్పుడు ధరను ప్రకటించింది కంపెనీ. ఐకూ జెడ్6 సిరీస్‌లో భాగంగా ఈ మొబైల్‌ను తీసుకొస్తోంది కంపెనీ. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఐకూ జెడ్6 ప్రో (iQOO Z6 Pro), ఐకూ జెడ్6 44W, ఐకూ జెడ్6 మోడల్స్ ఉన్నాయి. ఇదే సిరీస్‌లో నాలుగో ఫోన్ ఐకూ జెడ్6 లైట్ వచ్చేసింది. క్వాల్కమ్ నుంచి వచ్చిన ఎంట్రీలెవెల్ 5జీ చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌తో రిలీజైన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఇందులో 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రూ.15,000 లోపు బడ్జెట్‌లోని 5జీ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది ఐకూ జెడ్6 లైట్. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను ప్రకటించింది కంపెనీ. ప్రారంభ ధర రూ.13,999 కాగా ఆఫర్‌లో బేస్ వేరియంట్‌ను రూ.11,499 ధరకే కొనొచ్చు.

ఐకూ జెడ్6 లైట్ ఆఫర్

ఐకూ జెడ్6 లైట్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499. అమెజాన్‌లో ఎస్‌బీఐ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.2,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో ఐకూ జెడ్6 లైట్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.11,499 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.12,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 14 మధ్యాహ్నం 12.15 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 14, 15 తేదీల్లో మాత్రమే లభిస్తుంది. అమెజాన్‌తో పాటు ఐకూ ఇండియా ఇ-స్టోర్‌లో కొనొచ్చు. స్టెల్లార్ గ్రీన్, మిస్టిక్ నైట్ కలర్స్‌లో కొనొచ్చు.

Poco M5: కాసేపట్లో పోకో ఎం5 సేల్... సరికొత్త ప్రాసెసర్, 6GB ర్యామ్, 50MP కెమెరా... ఆఫర్ ధర రూ.10,999

ఐకూ జెడ్6 లైట్ ఫీచర్స్

ఐకూ జెడ్6 లైట్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ను ఇటీవల క్వాల్కమ్ లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఐకూ జెడ్6 లైట్ ఆండ్రాయిడ్ 12 + ఫన్‌టచ్ ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండేళ్లు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడేళ్లు సెక్యురిటీ ప్యాచెస్ ఇస్తామని కంపెనీ చెబుతోంది. ఇందులో ర్యామ్ బూస్టర్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో 2జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. అల్‌ట్రా గేమ్ మోడ్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Flipkart Big Billion Offer: అసలైన ఆఫర్ అంటే ఇదే... ఓ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.16,300 డిస్కౌంట్

ఐకూ జెడ్6 లైట్ కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్సులో ఛార్జర్ లభించదు. రూ.399 చెల్లించి 18వాట్ ఛార్జర్ కొనాల్సి ఉంటుంది.

First published:

Tags: Amazon Great Indian Festival Sale, IQoo, Smartphone