హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iQOO Z6 Lite 5G: ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. త్వరలో ఇండియాలో ఐక్యూ Z6 లైట్ 5G ఫోన్ లాంచ్..

iQOO Z6 Lite 5G: ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ.. త్వరలో ఇండియాలో ఐక్యూ Z6 లైట్ 5G ఫోన్ లాంచ్..

iQOO Z6 Lite 5G

iQOO Z6 Lite 5G

iQOO Z6 Lite 5G: ఐక్యూ తన Z సిరీస్‌లో భాగంగా జెడ్6 లైట్‌ 5జీ (iQoo Z6 Lite 5G) ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేయనుంది. ఈ సరికొత్త ఫోన్ సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ.15 వేల లోపు ఉండొచ్చని సమాచారం. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ ఐకూ (iQoo) ఇండియా (India)లో అదిరిపోయే మొబైల్స్‌ (ను తక్కువ ధరకే లాంచ్‌ చేస్తోంది. భారతదేశంలో 5G ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఈ కంపెనీ ఇప్పటికే చాలా 5G ఫోన్స్ పరిచయం చేసింది. అయితే వాటిలో ఒక్క మొబైల్ తప్ప మిగతా ఫోన్ల ధరలన్నీ రూ.20 వేల కంటే ఎక్కువగానే ఉన్నాయి. దాంతో మధ్యతరగతి యూజర్ల కోసం మరొక బడ్జెట్ 5G ఫోన్‌ను కంపెనీ లాంచ్‌ చేయడానికి సిద్ధమైంది. ఐకూ తన Z సిరీస్‌లో భాగంగా జెడ్6 లైట్‌ 5జీ (iQoo Z6 Lite 5G) ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేయనుంది. ఈ సరికొత్త ఫోన్ సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ.15 వేల లోపు ఉండొచ్చని సమాచారం.

* ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ

తక్కువ ధరలో 5G మొబైల్ కావాలనుకునేవారికి జెడ్6 లైట్‌ 5జీ బెస్ట్ కావొచ్చని తెలుస్తోంది. ఎందుకంటే టెక్ రిపోర్ట్స్ ప్రకారం ఇందులో అందించిన ఫీచర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ మొబైల్ 6.68 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, 18W ఛార్జింగ్ సపోర్ట్‌, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 5,000 mAh బ్యాటరీ బ్యాకప్‌తో లాంచ్ కానుందని సమాచారం.

* కెమెరా స్పెసిఫికేషన్లు

ఇందులో 13MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అందించారని తెలుస్తోంది. మరో రిపోర్ట్ ప్రకారం, ఈ మొబైల్ బ్యాక్‌సైడ్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ ఆఫర్ చేశారు.

* టాప్ ఫీచర్లు..

స్మార్ట్‌ఫోన్ 4GB RAM+64GB, 6GB RAM+128GB స్టోరేజ్‌ వేరియంట్లలో రావొచ్చు. FunTouchOS 12, Android 12 ఆధారంగా ఇది రన్ కానుందని రూమర్స్ ప్రకారం తెలుస్తోంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్ ప్రాసెసర్‌తో వస్తుందని సమాచారం. క్వాల్‌కమ్ ఒక కొత్త స్నాప్‌డ్రాగన్ 4 సిరీస్ చిప్‌ని తీసుకొస్తుండగా.. Z6 లైట్ మొబైల్ ఈ సిరీస్ ప్రాసెసర్‌తో విడుదలయ్యే తొలి ఫోన్ కానుందని టాక్. త్వరలోనే కంపెనీ ఈ మొబైల్ గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ అప్‌కమింగ్ 5జీ మొబైల్ ఐకూ జెడ్6 (iQoo Z6)కి ట్రిమ్డ్‌ వెర్షన్ అయి ఉండొచ్చని రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : Gmail Without Internet: జీమెయిల్ వాడుతున్నారా..? ఇంటర్నెట్ లేకుండానే ఈమెయిల్ ఇలా సెండ్ చేయండి..


* ధరల వివరాలు

కాగా ఇండియాలో ఐకూ జెడ్6 రూ.17 వేల స్టార్టింగ్ ప్రైస్‌తో రిలీజ్ అయింది. గత రిపోర్ట్స్‌ Vivo T1x వంటి ఫీచర్లతో జెడ్6 లైట్‌ 5జీ ఫోన్ ఇండియన్ మొబైల్ మార్కెట్లో ఎంట్రీ ఇస్తుందని తెలిపాయి. ఐకూ సంస్థ Z6 లైట్ గురించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కాబట్టి పైన పేర్కొన్న ధర, ఫీచర్ల వంటి వివరాలన్నీ లీక్స్ ద్వారా చెప్పినవని గమనించాలి.

Published by:Sridhar Reddy
First published:

Tags: IQoo, Smart phones, Tech news

ఉత్తమ కథలు