హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

5G Phones: తక్కువ ధరలో మంచి ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్స్... రూ.20వేల లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

5G Phones: తక్కువ ధరలో మంచి ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్స్... రూ.20వేల లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

5G Phones: తక్కువ ధరలో మంచి ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్స్... రూ.20వేల లోపు బెస్ట్ మోడల్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

5G Phones: తక్కువ ధరలో మంచి ఫీచర్లతో 5G స్మార్ట్‌ఫోన్స్... రూ.20వేల లోపు బెస్ట్ మోడల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

5G Phones | ఇండియాలో ఇటీవల 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది.మార్కెట్లో అనేక 5జీ స్మార్ట్‌ఫోన్స్ (5G Smartphones) అందుబాటులో ఉన్నాయి. వాటిలో రూ.20,000 లోపు బెస్ట్ 5జీ మొబైల్స్ ఏవో తెలుసుకోండి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఇండియాలో అనేక స్మార్ట్ బ్రాండ్స్ బడ్జెట్ ధరలో కొత్త 5G ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. రూ.10వేల నుంచి రూ.20వేలలో చాలా మోడళ్లు మార్కెట్‌లో ఉన్నాయి. అయితే మీడియం రేంజ్ ఫీచర్లతో విడుదలైన కొన్ని మోడళ్లకు మాత్రమే మంచి డిమాండ్ ఉంది. మీరు కూడా తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే.. రూ.20వేల లోపు లభించే టాప్ డివైజ్‌లపై ఓ లుక్కేయండి..

ఐకూ జెడ్6 5జీ

స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,499 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 6nm క్వాల్‌కాప్ స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌‌ను వినియోగించారు. ఈ డివైజ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల FHD+ డిస్‌ప్లే‌తో లభిస్తుంది. ఇందులో18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. 50MP+ 2MP +2MP రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16MP ఫ్రంట్ కెమెరా.. ఈ ఫోన్ ప్రత్యేకతలు.

Redmi 10 Power: రూ.12,000 లోపే 8GB+128GB స్మార్ట్‌ఫోన్ కొనేయండి... అదిరిపోయే ఆఫర్

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం13 5జీ

5జీ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో ప్రస్తుతం రూ.13,999 వద్ద అందుబాటులో ఉంది. ఇది రెండు వేరియంట్లు (4GB + 64GB & 6GB + 128GB)లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే‌తో లభిస్తుంది. ఇందులో 5000mAh సామర్థ్యం ఉన్న లిథియం-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌పై రన్ అవుతుంది. 50MP మెయిన్+2MP మైక్రో కెమెరాతో రియర్ డ్యుయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 5MP ఫ్రండ్ కెమెరాను అమర్చారు.

రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ

ఈ మిడ్ రేంజ్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం రూ.13,999కు సొంతం చేసుకోవచ్చు. రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58-అంగుళాల FHD+ డాట్ డిస్‌ప్లే ఉంటుంది. 18వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh Li-Po బ్యాటరీ ఇందులో ఉంటుంది. 50MP AI మెయిన్ + 2MP డెప్త్ సెన్సార్‌తో రియర్ డ్యుయల్ కెమెరా సెటప్, 8MP AI సెల్ఫీ కెమెరా వంటివి ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు.

Microsoft Alert: అలర్ట్... తొందరపడి మీ ల్యాప్‌టాప్, కంప్యూటర్ అప్‌డేట్ చేయకండి

ఒప్పో ఏ74 5జీ

ఒప్పో ఏ74 5జీ ఫోన్ ధర రూ.14,990 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ 6.5-అంగుళాల FHD+ హైపర్-కలర్ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో పంచ్-హోల్ డిస్‌ప్లేతో లభిస్తుంది. ఇందులో 5000mAh బ్యాటరీ ఉంటుంది. 48MP మెయిన్ + 2MP మ్యాక్రో + 2MP డెప్త్ లెన్స్‌తో రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, 8MP ఫ్రంట్ కెమెరాను దీంట్లో అందించారు.

రెడ్‌మీ నోట్11టీ 5జీ

ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.17,999 నుంచి ప్రారంభవుతుంది. దీంట్లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల FHD+ డాట్ డిస్‌ప్లే‌ ఉంటుంది. 33W Pro ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000mAh Li-Po బ్యాటరీతో వచ్చే ఈ డివైజ్, ఆండ్రాయిడ్ 11 MIUI 12.5 ఓఎస్‌తో రన్ అవుతుంది.

First published:

Tags: 5g mobile, 5G Smartphone, Smartphone

ఉత్తమ కథలు